`కల్కి`లో కర్ణుడిని గొప్పగా చూపించడం చూసి సిగ్గుపడుతున్నా.. ప్రభాస్ సినిమాపై స్టార్ రైటర్ సంచలన వ్యాఖ్యలు
ప్రభాస్ నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు రైటర్ అనంత శ్రీరామ్. ప్రభాస్ నటించిన కర్ణుడి పాత్రని చూపించిన తీరుపట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ప్రభాస్ హీరోగా నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా గతేడాది విడుదలైన సంచలన విజయం సాధించింది. ఈ మూవీ 1200కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. తొలి పార్ట్ తోనే భారీ వసూళ్లని రాబట్టిన చిత్రంగా `కల్కి` రికార్డు సృష్టించింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రాజేంద్రప్రసాద్, ఆర్జీవీ, శోభన గెస్ట్ రోల్స్ చేశారు.
నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించడంతో ఇప్పుడు `కల్కి 2`కి ప్లాన్ జరుగుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన ఆ సన్నాహాల్లో ఉన్నారు. విష్ణువు చివరి అవతారం కల్కి పాత్ర ప్రధానంగా ఈ మూవీని తెరకెక్కించారు. 874ఏళ్ల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది? మనుషులు ఎలా ఉంటారు, అప్పుడు అధినేతలుగా ఉంటారనేది కల్పిత కథతో ఈ మూవీని మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కించాడు నాగ్ అశ్విన్.
మొదటి పార్ట్ లో క్యూరియాసిటీ అంశాలను జోడించారు. మహాభారతంలోని కర్ణుడు పాత్రని, అర్జుణుడి పాత్రని, ఇద్దరి మధ్య ఫైట్‌ని, అశ్వత్థామ పాత్రని టచ చేశారు. అశ్వత్థామ శ్రీకృష్ణుడు శాపం వల్ల ఈ కలి కాలంలోనూ ఆ కల్కిని కాపాడటం కోసం బతికి ఉండటం, కల్కి పుట్టుక కోసం వెయిట్ చేయడమనేది మెయిన్ పాయింట్. రెండో భాగంలో ఆయా ఎలిమెంట్లని చూపించనున్నారు.
Kalki 2898 AD
ఇదిలా ఉంటే ఈ సినిమాపై కర్ణుడి పాత్రపై గతంలోనూ కొన్ని విమర్శలు వచ్చాయి. మహాభారతాన్ని వక్రీకరిస్తున్నారని, కర్ణుడు పాత్రని వక్రీకరిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రముఖ సినిమా పాటల రచయిత అనంత శ్రీరామ్ ఏకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
`కల్కి 2898 ఏడీ`లో కర్ణుడి పాత్రని వక్రీకరించినట్టు వెల్లడించారు. కర్ణుడి పాత్రని గొప్పగా చూపించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది హైందవ ధర్మంపై దాడి జరుగుతుందని, మన పురాణాలను వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డాడు.
read more: చిరంజీవి, మోహన్‌బాబులకు దిమ్మతిరిగే కౌంటర్, తనకు తాను `లెజెండ్`గా ప్రకటించుకున్న బాలకృష్ణ
వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతాన్ని వక్రీకరిస్తున్నారని తెలిపారు `కల్కి` చిత్రంలో కర్ణుడ పాత్రకు అనవసర గొప్పతనం ఇచ్చినందుకు సినిమా పరిశ్రమ వ్యక్తిగా సిగ్గుపడుతున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అనంత శ్రీరామ్. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి మూడు కోణాల్లో జరుగుతుందని, కావ్వేతిహాస పురాణాలను వక్రీకించడం, తెరమీద కనిపించే పాత్రలు పాటల్లో హైందవ ధర్మాన్ని దురమినియోగం చేయడం, తెరవెనుక మా ముందు అన్యమతస్తుల ప్రవర్తన.
వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం భారత సాహితీ వాంగ్మయ శరీరానికి రెండు కళ్లలాంటివి. కానీ అదే రామయణం, మహాభారతా్ని వినోదం కోసం వక్రీకరిస్తున్నారు అని తెలిపారు. ఒకప్పుడు వచ్చిన సినిమాల నుంచి మొన్న వచ్చిన `కల్కి` వరకు కర్ణుడి పాత్రకి అనవసరమైన గొప్పతనాన్ని ఆపాదించడం చూసి సిగ్గుపడుతున్నా అని తెలిపారు అనంత శ్రీరామ్.
అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి సినిమా నిర్మాతలు ఇదే కృష్ణా జిల్లాి చెందిన వారైనా సరే పొరపాటుని పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు అని అన్నారు. వివాదాలకు దూరంగా ఉండే ఆయన తాజాగా ఇలాంటి షాకింగ్‌కామెంట్ చేయడం వైరల్‌గా మారుతున్నాయి. విజయవాడలో జరుగుతున్న హైందవ శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడివి చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా `కల్కి 2898 ఏడీ` సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
read more: పవన్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసిన `హరిహర వీరమల్లు` టీమ్, `మాట వినాలి` పాట వాయిదా!
also read: నా జీవితాన్ని నాశనం చేశాడు, త్రివిక్రమ్‌పై మరోసారి పూనమ్ కౌర్ ఆరోపణలు.. `మా` కౌంటర్