MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా జీవితాన్ని నాశనం చేశాడు, త్రివిక్రమ్‌పై మరోసారి పూనమ్‌ కౌర్‌ ఆరోపణలు.. `మా` కౌంటర్

నా జీవితాన్ని నాశనం చేశాడు, త్రివిక్రమ్‌పై మరోసారి పూనమ్‌ కౌర్‌ ఆరోపణలు.. `మా` కౌంటర్

నటి పూనమ్‌ కౌర్‌ మరోసారి త్రివిక్రమ్‌ ని టార్గెట్‌ చేసింది. తన జీవితం నాశనం చేశాడంటూ మండిపడింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్‌ కి ఫిర్యాదు చేసినా చర్యల్లేవంటూ మళ్లీ రచ్చ చేసే ప్రయత్నం చేసింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 05 2025, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Poonam Kaur

Poonam Kaur

మాజీ హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ తరచూ `గురువు` అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చింది. తన జీవితాన్ని నాశనం చేశాడని, వాడుకుని వదిలేశాడని, లైఫ్‌ ఇస్తానని మోసం చేశాడని, ప్రెగ్నెన్సీని కూడా చేశారంటూ పదే పదే ఆమె ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు త్రివిక్రమ్‌పై ఆమె మరోసారి ఆరోపణలు చేశారు. `మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌) పట్టించుకోవడం లేదంటూ ఆమె ట్వీట్‌ చేశారు. 

read more: పవన్‌ కళ్యాణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` వేదికగా వార్నింగ్‌ ఇచ్చాడా? అహంకారం చూపిస్తున్నది ఎవరు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

`దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై మా అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసి చాలా కాలం అవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కానీ ఆయన్ని ప్రశ్నించలేదు. నా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నాశనం చేసి నా జీవితాన్ని దెబ్బతిసన తర్వాత కూడా ఆయన పెద్ద వారితో ప్రోత్సహించబడ్డాడు` అని లేటెస్ట్ గా ట్వీట్‌ చేసింది పూనమ్‌ కౌర్‌.

ఇలా ఆరు నెలలకు ఒక్క సారి ఆమె రియాక్ట్ అవుతూ త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ వస్తుంది. గతంలో పవన్‌ కళ్యాణ్‌ పై కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఆయన్ని పక్కన పెట్టి ఇప్పుడు త్రివిక్రమ్‌ని మాత్రమే టార్గెట్‌ చేస్తుంది. దీంతో రచ్చ మళ్లీ మొదటికి వచ్చింది. తాను ఫిర్యాదు చేసినా మా అసోసియేషన్‌ చర్యలు తీసుకోవడం లేదని ఆమె వెల్లడించారు. 

35

ఈ నేపథ్యంలో దీనిపై `మా` స్పందించింది. పూనమ్‌ కౌర్‌కి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది. ఆమె డ్రామాలు బయటపెట్టింది. తమకు పూనమ్‌ కౌర్‌ నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని వెల్లడించింది. రాత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని, మా టర్మ్ కంటే ముందు కూడా కంప్లెయింట్‌ ఇచ్చినట్టు రికార్డులలో లేదని చెప్పింది.

పూనమ్‌ కౌర్‌ ట్విట్టర్‌ లో ట్వీట్టు పెట్టడ్ వల్ల ఉపయోగం లేదు అని, మా అసోసియేషన్‌కిగానీ, కోర్ట్ ని ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుంది` అని `మా` కోశాధికారి శివబాలాజీ వెల్లడించారు. 
 

45

దీనితో పూనమ్‌ కౌర్‌ ట్వీట్  పై నెటిజన్లు స్పందిస్తూ సెటైర్లు పేల్చుతున్నారు. సోషల్‌ మీడియాలో తప్ప ఆమె ఫిర్యాదు చేసే ధైర్యం లేదని, ఇలానే డ్రామాలు ఆడుతుందని, తన ఐడెంటిటీ కోసం చేసే ప్రయత్నం అని కామెంట్లు చేస్తున్నారు. పూనమ్‌ కౌర్‌ ఇలా సోషల్‌ మీడియాలో కంటే డైరెక్టర్‌ గా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఆమె స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. 
 

55

ఇక పూనమ్‌ కౌర్‌ తెలుగులో హీరోయిన్‌గా మెప్పించింది. 2006లో `మాయాజాలం` అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఇందులో శ్రీకాంత్‌ సరసన నటించింది. ఆ తర్వాత `ఓ విచిత్రం`, `నిక్కి అండ్‌ నీరజ్‌`, `శౌర్యం`, `వినాయకుడు`, `ఈనాడు`, `గణేష్‌`, `నాగవళ్లీ`, `గగనం`, `బ్రహ్మిగాడి కథ`, `ఆడు మగాడ్రా బుజ్జి`,

`పొగ`, `సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌`, `ఎటాక్‌`, `నాయకి`, `శ్రీనివాస కళ్యాణం`, `నెక్ట్స్ ఏంటి?` వంటి సినిమాల్లో నటించింది. దాదాపుఆరేడు ఏళ్లుగా ఆమెకి సినిమాలు లేవు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. బీజీపీ నాయకురాలిగా రాణిస్తుంది పూనమ్‌ కౌర్‌. 

read more: `గేమ్ ఛేంజర్` సినిమాకి కొత్త చిక్కులు.. అక్కడ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటుందా?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 4 Days Collections: పెద్ది 4 రోజుల్లో రాబట్టింది ఇంతే, ఆదివారం ర్యాంపేజ్‌.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Anchor Suma: కత్తిలాంటి ఫిగర్ సుమ.. అంటూ కామెంట్ చేసిన హీరో ఎవరో తెలుసా? స్టార్ యాంకర్ రియాక్షన్ ఇదే
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved