MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: శౌర్య దొరకలేదని బాధతో దీప, కార్తీక్.. సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ?

Karthika Deepam: శౌర్య దొరకలేదని బాధతో దీప, కార్తీక్.. సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ?

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 24వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 

4 Min read
Author : Navya G
Published : Oct 24 2022, 07:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..శౌర్య తన ఆటో డ్రైవర్ తో పాటు వెళుతూ ఉంటుంది. డ్రైవింగ్ ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు అతను, మీ బాబాయ్ కి తెలిస్తే ఇంక నా పని అయిపోయినట్టే నువ్వు ముందే కూర్చున్నావు కదా అలాగ మీ అమ్మ నాన్నల్ని వెతుకు అని అంటాడు. ఇలా వీళ్ళిద్దరూ వెళ్తుండగా దీప, శౌర్యను చూస్తుంది. శౌర్య! అని అరుస్తుంది, కానీ శౌర్య వినిపించుకోదు వాళ్లు వెళ్లిపోతారు. అప్పుడు పక్కనే ఉన్న కార్తీక్ అది శౌర్య ఏనా అని అంటే అవును డాక్టర్ బాబు నేను నా కళ్ళారా చూశాను అని దీప అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కార్ మీద శౌర్య ఆటో వెనకాతల వెళ్తారు. దారిలో దీప, కార్తీక్ తో, ఇన్ని రోజులు తను శౌర్యా? కాదా? అనుకున్నాను ఇప్పుడు నాకు స్పష్టంగా తెలిసింది శౌర్యే. పాపమది నన్ను వెతుక్కుంటూ ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నట్టున్నది తను కలిసే అవకాశం చాలా సార్లు వచ్చిన సరే నేనే పట్టించుకోలేదు అనుకొని గతంలో బస్టాండ్ లోని మరియు జాతర లో జరిగిన సంఘటన గుర్తుతెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అప్పుడు కార్తీక్ మనసులో,  అంతే దీప నేను కూడా నిన్ను మొదట్లో గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చింది. దేవుడు ఎందుకు మనతో ఇలా ఆడుకుంటున్నాడో అని మనసులో అనుకొని శౌర్య ఆటో వెనకాతల వెళుతూ ఉంటారు. కొంతసేపటికి శౌర్య ఆటో వాళ్లకి కనబడదు  అప్పుడు కార్తీక్ కార్ ఆపేస్తాడు.దీప, శౌర్య దొరకలేదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, ఈ ఊర్లోనే ఉన్నదని కచ్చితంగా తెలిసింది కదా ఇంక ఎలాగైనా వెతుకుదాంలే దీప బయపడొద్దు అని చెప్పాడు. ఆ తర్వాత మోనిత కాఫీ షాప్ లో కూర్చుని ఉంటుంది. అప్పుడు అక్కడికి వాణి అనే ఒక అమ్మాయి వస్తుంది. మోనిత వాణిని పలకరించగా వాణి కాదు వాల్తేరు వాణి ఏ పనైనా సక్రమంగా చేస్తాను అని అంటుంది. దానికి మోనిత నేను చెప్పినట్టే చెయ్యు అని ఒక ప్లాన్ చెప్తుంది.

38

అప్పుడు వాణి, ఇప్పుడు దీప ని వేసేయాలి అంతే కదా ఇంక నాకు వదిలే అని అనగా మోనిత, బిల్డప్ బానే ఉన్నది ఏమైనా తేడా వస్తే అప్పుడు చెప్తాను అని అంటుంది. ఒకవేళ తేడా వచ్చినా నీ పేరు బయటికి రాదు అని చెప్పి వాణి ఎక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మోనిత, ఇప్పుడు చూడండి ఇది చేసే తమాషా అని అంటుంది. ఆ తర్వాత సీన్లో దీప కార్తీక్ నిరాశతో తిరిగి ఇంటి వైపు వస్తూ ఉండగా కార్తీక్ మనసులో, దీప నువ్వు ఎంత బాధ పడుతున్నావో నాకు అర్థమవుతుంది పక్కనే ఉన్నా భర్తని అని నేను ఒప్పుకోవడం లేదు.ఒకే ఊర్లో ఉన్న కూతురు నిన్ను కలవడం లేదు అని అనుకుంటూ మీ వాళ్ళది హైదరాబాదు అన్నావు కదా మీ వాళ్ళందరూ అక్కడ ఉంటే మరి శౌర్య ఎందుకు ఇక్కడ ఉన్నది అని కార్తీక్ అడుగుతాడు. దానికి దీప, వాళ్ళు ఇక్కడ లేరు అమెరికా వెళ్ళిపోయారు ఇక్కడ శౌర్య ని ఎందుకు వదిలేసారో తెలీదు. 

48

యాక్సిడెంట్ జరిగిన చోట శౌర్య లేదు కనుక తను కూడా చనిపోయింది అనుకున్నారా లేకపోతే తను కూడా హైదరాబాద్ తిరిగి వచ్చేసరికి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసారేమో అని అంటుంది. దానికి కార్తీక్ కార్ ఆపి, ఇల్లు మారిపోయారా అని అంటాడు. కార్ ఎందుకు ఆపారు డాక్టర్ బాబు అంటే ఏమీ లేదు అని కార్తీక్ తిరిగి కారు నడుపుతూ ఎప్పటికైనా శౌర్య నీ5 కనిపెడదాము బాధపడొద్దు అని చెప్తాడు. ఆ తర్వాత సీన్లో వాణి తన ఫోన్లో కార్తీక్, దీప, దుర్గ ఫోటోలను చూస్తూ నవ్వుతుంది. తర్వాత ఆటోలో ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరోవైపు కార్తీక్ దీప కార్ దిగి ఇంటికి వచ్చేసరికి మోనిత వాళ్ళని చూస్తుంది. నా కార్తిక్ ని ఎక్కడికి తీసుకెళ్లావ్ వంటలక్క అని కోపంగా అడగగా, కారు నడిపింది ఆయన తీసుకెళ్లింది ఆయన నన్నెందుకు అడుగుతున్నారు అని అంటుంది దీప.

58

దానికి మోనిత, నిన్నే అనాలి నా భర్తని నువ్వు లాగేసుకుంటున్నావు? పూర్వకాలంలో ఒక భర్తను ఇంకొక అమ్మాయికి వదిలేస్తే పతివ్రత అంటారేమో కానీ ఇప్పుడు మాత్రం చేతకాని దాన్ని అని అంటారు. నేను చేతకానిదాన్ని కాదు చెంప పగిలించే దాన్ని అని దీప మీద చేస్తూ ఉండగా అదే సమయంలో వాణి అక్కడికి వచ్చి మోనిత చెంప చెల్లుమనిపిస్తుంది. ఇదేంటి నన్ను కొట్టింది అని మోనిత మనసులో అనుకుంటుంది. నువ్వు నాకు ఎంత అన్యాయం చేశావు నా బొటిక్ ని నాశనం చేసావు నాకు ఇప్పుడు 20 లక్షలు నష్టం వచ్చింది. కార్తీక్ సార్ మీ భార్యని మీ ముందే కొట్టినందుకు నన్ను క్షమించండి.అయినా ఏంటే ఊరంతా కార్తీక్ సార్ ఈవిడ భార్యాభర్తలు అంటున్నారు అని దీప వైపు చూపిస్తూ అంటుంది.నీకు,కార్తీక్ కి సంబంధం లేదట ఒకవేళ అది నిజమైతే నేనే వాళ్ళని కలుపుతాను అని అంటుంది. 

68

దానికి మోనిత,  ఇదేదో రివర్స్ దారి నుంచి వస్తున్నట్టున్నది ఏదైతే ఏమైంది మన పని అయితే అదే చాలు అనుకొని సైలెంట్ గా ఉంటే డౌట్ వస్తాది అనుకోని, ఏంటే నువ్వు నాకు చెంప చెల్లుమనిపించేది నేనే నీకు చుక్కలు చూపిస్తాను. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను అని కార్తీక్ ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది మోనిత. ఆ తర్వాత వాణి దీపతో, నువ్వేం బాధపడొద్దు వదిన ఆ మోనిత పని నేను చూసుకుంటాను అని అంటుంది. అదే సమయంలో దుర్గ అక్కడికి వచ్చి మోనితను అభినందిస్తాడు. నీకోసమే వెతుకుతున్నా దుర్గ నువ్వే నా దగ్గరికి వచ్చావు అని మనసులో అనుకుంటుంది వాణి. అప్పుడు వాణి నేను మోనిత అంతు చూడాలి అంటే చుట్టుపక్కల ఎక్కడైనా ఉండాలి నాకు ఒక మంచి ఇల్లు చూసి పెట్టండి అని అనగా దుర్గ, దీప ఇంట్లో ఉండమని చెప్తాడు. దానికి దీప, నాకు తోడుగా ఉంటానంటే సమస్య లేదు కానీ ఇల్లు చిన్నది అని అనగా పర్లేదు అని వాణి అంటుంది.
 

78

ఆ తర్వాత సీన్లో శౌర్య ఆటో ఎదురుగుండా కూర్చుంటూ అమ్మానాన్నలతో కలిసి ఆనందంగా ఉన్న క్షణాలు అన్ని గుర్తుతెచ్చుకుంటూ ఏడుస్తూ, దేవుడు నాతో ఎందుకు ఇలాగ ఆడుకుంటున్నాడు. ముందు నాన్న ని నాకు దూరం చేశాడు కొన్ని రోజులు అందరూ ఆనందంగా ఉన్నాము అనుకుంటే ఇప్పుడు ఇద్దరినీ దూరం చేసి నాతో ఆడుకుంటున్నాడు. అమ్మానాన్నలు నాతోనే ఉన్నారని నాకు తెలుసు ఎలాగైనా వాళ్ళని పట్టుకుంటాను అని ఏడుస్తూ ఉంటుంది శౌర్య. అదే సమయంలో శౌర్య వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి, మీ పిన్ని ఫోన్ చేసిందమ్మా మనం వెళ్లాల్సిన అవసరం లేదట తనే డబ్బులతో ఇంటికి వస్తాదట డబ్బులు వచ్చాక మనం చిన్న వ్యాపారం మొదలు పెట్టొచ్చు అని అంటాడు. 

88

చెప్పిన తర్వాత శౌర్య మొకం చూసేసరికి తన ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అంటే ఇలాగ వాళ్ళ అమ్మానాన్నల గురించి బాధపడుతున్నా అని చెప్తుంది. దానికి చంద్రుడు మనసులో, వాళ్ళు ఉన్నారో లేదో కూడా సరిగ్గా అర్థం కావడం లేదమ్మా. నిజంగా ఉంటుంటే ఎన్ని రోజులు నిన్ను గమనించకుండా ఉండరు కదా అని అనుకుంటూ తప్పకుండా దొరుకుతాడమ్మా అని శౌర్య కు ధైర్యం చెప్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Top Heroines Item Songs: ఒక్క ఐటెం సాంగ్‌కి కోట్ల రెమ్యూనరేషన్‌.. ఇండియాలో నెం.1 ఎవరో తెలిస్తే షాకే
Recommended image2
Rashmika Mandanna : రష్మిక మందన్న వల్ల 10 కోట్లు లాభం ఎవరికో తెలుసా? చీర కోసం మహిళల క్యూ..
Recommended image3
Naga Durga Remuneration: ఫోక్‌ డాన్సర్‌ నాగదుర్గ ఒక్క పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? గ్రేట్‌ అబ్బా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved