MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Samantha Pregnancy: సారీ, సినిమాల నుంచి మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నా.. అఫీషియల్ గా గుడ్ న్యూస్ చెప్పిన సమంత

Samantha Pregnancy: సారీ, సినిమాల నుంచి మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నా.. అఫీషియల్ గా గుడ్ న్యూస్ చెప్పిన సమంత

Samantha Confirms Pregnancy: సమంత తాను గర్భవతిని అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సినిమాల నుంచి మరో విరామం తీసుకుంటున్నాను అని అన్నారు. కాకపోతే ఈ సారి చాలా సంతోషంగా బ్రేక్ తీసుకుంటున్నా అని అన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 24 2026, 10:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Samantha
Image Credit : Asianet News

Samantha

సమంత నటించిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం చిత్రం థియేటర్స్ లో దుమ్ములేపుతోంది. ఈ చిత్రానికి భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. సమంతకి అద్భుతమైన కంబ్యాక్ లభించడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు. ఇప్పుడు అభిమానుల సంతోషం రెట్టింపు అయ్యే గుడ్ న్యూస్ ని సమంత ప్రకటించింది. మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ మీట్ లో సమంత తాను గర్భవతిని అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. చాలా అందంగా ఈ విషయాన్ని సమంత అభిమానులకు తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సారీ, మరో చిన్న బ్రేక్
Image Credit : others

సారీ, మరో చిన్న బ్రేక్

మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ లో సమంత మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తున్న సమయంలో తన ప్రెగ్నన్సీ గురించి ప్రస్తావించారు. మా ఇంటి బంగారం సక్సెస్ తర్వాత ఇక ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేయాలి అని మీడియా ప్రతినిధి అన్నారు. దీనికి స్పందించిన సమంత చిరునవ్వుతో మాట్లాడుతూ, “సారీ గైస్, ఇంకో చిన్న గ్యాప్ తీసుకుని తిరిగి వస్తాను. ఇప్పుడు నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి. ఈ గ్యాప్ తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను” అని తెలిపారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వెంటనే అందరి దృష్టిని ఆకర్షించాయి.

Related Articles

Related image1
Pan India Movies: ఇప్పుడు కనుక రిలీజై ఉంటే ఈ సినిమాలకు 1000 కోట్లు పక్కా.. జనాలు మరిచిపోయిన ఆ నటి మూవీ కూడా
Related image2
Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?
35
సమంతకి అభిమానుల శుభాకాంక్షలు
Image Credit : Instagram

సమంతకి అభిమానుల శుభాకాంక్షలు

సమంత ఎంతో సహజంగా, ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు లేకుండా తన గర్భధారణ విషయాన్ని వెల్లడించడం అభిమానులను ఆకట్టుకుంది. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు కూడా తెరపడింది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్న సమంత ప్రయాణాన్ని దగ్గరగా గమనించిన అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

45
సమంత డబుల్ ధమాకా
Image Credit : others

సమంత డబుల్ ధమాకా

ఇదిలా ఉండగా, సమంత ఇటీవల మా ఇంటి బంగారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఇప్పటికే ఆమె అభిమానులకు ప్రత్యేక చిత్రంగా మారింది. సినిమాకు లభిస్తున్న స్పందనతో పాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ సంతోషకరమైన వార్త కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు కారణాలతో సమంత వార్తల్లో నిలిచారు.

55
తల్లిగా సమంత కొత్త జర్నీ
Image Credit : Instagram

తల్లిగా సమంత కొత్త జర్నీ

ఇప్పుడు సమంత ప్రసూతి సెలవులు తీసుకోనున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఒకవైపు ఆమెకు శుభాకాంక్షలు చెబుతుండగా, మరోవైపు ఆమె తిరిగి వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారో అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తల్లితనం కోసం చిన్న విరామం తీసుకుంటానని, ఆ తర్వాత తిరిగి వస్తానని సమంత స్పష్టం చేయడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. ప్రస్తుతం ఆమె జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతుండగా, ఆమె కమ్‌బ్యాక్ కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Related Stories
Recommended image1
Pan India Movies: ఇప్పుడు కనుక రిలీజై ఉంటే ఈ సినిమాలకు 1000 కోట్లు పక్కా.. జనాలు మరిచిపోయిన ఆ నటి మూవీ కూడా
Recommended image2
Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved