- Home
- Entertainment
- Prema Entha Madhuram: తాళి బొట్టు నేలకేసిన మాన్సీ.. నీరజ్ జీవితంలోకి అంజలి రానుందా.. అందుకే ఈ డ్రామానా?
Prema Entha Madhuram: తాళి బొట్టు నేలకేసిన మాన్సీ.. నీరజ్ జీవితంలోకి అంజలి రానుందా.. అందుకే ఈ డ్రామానా?
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. మొండితనంతో అత్తింటిని నరకంగా మారుస్తున్న ఒక మూర్ఖపు కోడలి కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 6 ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఇంత కష్టంలో కూడా మీ కృషిని తలుచుకుంటున్నారు మీకు ఇది ఎలా సాధ్యం ఉంటుంది అను. కష్టంలో ఉన్నప్పుడు సుఖం గురించి సుఖంలో ఉన్నప్పుడు కష్టం గురించి ఆలోచించకూడదు అంటాడు ఆర్య. కానీ నేను మీలా ఉండలేకపోతున్నాను అంటుంది అను. అంతఃపురం వదిలి నాతో పాటు అడవులకు వచ్చావు అది చాలు అంటాడు ఆర్య.
అవన్నీ తర్వాత ముందు భోజనం చెయ్యు అంటాడు. నేను అన్నం తినకుండా మీ టైం తింటున్నాను అని నవ్వుతూ భోజనం కలిపి తీసుకొచ్చి ఆర్య కి తినిపించి తను కూడా తింటుంది అను. మరోవైపు వేలంపాట దగ్గరికి ఇండస్ట్రియలిస్ట్ లు చాలామంది చేరుకుంటారు. నందిని టెక్స్టైల్స్ ఎవరి కొనుక్కుంటారో కానీ వాళ్ళ పంట పండినట్టే అంటాడు ఒక వ్యక్తి.
కొనుక్కున్న వాళ్ళకే కాదు అమ్మిన వాళ్లకి కూడా పంట పండినట్లే అంటుంది మరో వ్యక్తి. ఎంతకీ కొనుక్కుంటారో లేకపోతే అసలు వేలం పాట జరుగుతుందో జరగదు కూడా తెలియదు ఏం జరుగుతుందో చూడాలి అంటాడు మరొక వ్యక్తి. మరోవైపు కారులో వస్తున్న అంజలి నేను ఎంత హెల్ప్ చేద్దామన్న ఆర్య సార్ ఒప్పుకోవడం లేదు.
ఆంటీ చేత చెప్పిస్తే ఒప్పుకుంటాడేమో అని అనుకొని శారదమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది అంజలి. మరోవైపు వేలంపాటికి బయలుదేరుతుంటారు శారదమ్మ, నీరజ్, జెండే. గుమ్మానికి ఎదురుగా డైవర్స్, పేపర్స్ తో సహా నిలబడ్డ మాన్సీ ని చూసి షాక్ అవుతారు. శుభమని బయటికి వెళ్తుంటే అలా గుమ్మానికి అడ్డుగా నిల్చున్నవేంటి అంటుంది శారదమ్మ. మీరు వెళ్ళేది అశుభానికే. మీరు వెళ్ళకూడదు.. అక్కడ వేలంపాట జరగకూడదు అంటుంది మాన్సీ. అడ్డు తప్పుకో మేము వెళ్ళాలి అంటాడు నీరజ్.
మీరు వెళ్ళాలి అంటే ఈ డైవర్స్ పేపర్ మీద సైన్ చేసి నాకు రావలసిన ప్రాపర్టీస్ గురించి మాట్లాడి వెళ్ళండి అంటుంది మాన్సీ. నీకు పరువు కన్నా డబ్బు ఎక్కువ.. బంధాల కన్నా ప్రాపర్టీస్ ఎక్కువ? అంటుంది శారదమ్మ. అలాంటి న్యూసెన్స్ అంతా నాతో చెప్పొద్దు అంటూ రాష్ గా మాట్లాడుతుంది మాన్సీ. అంతలోనే అంజలి వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావు అంటూ చిరాకు పడుతుంది మాన్సీ. శారదమ్మ దగ్గరికి వెళ్లి ఆర్య సర్ నా హెల్ప్ తీసుకోవటం లేదు మీరైనా చెప్పండి ఆ 1300 కోట్లు నేను కట్టేస్తాను అంటుంది అంజలి. నీ దగ్గర మేము అప్పు తీసుకోవాలా అంటూ చీప్ గా మాట్లాడుతుంది మాన్సీ.
తను పరాయి మనిషి కాదు కదా అంటుంది శారదమ్మ. కాకపోతే మరేమిటి తను ఏమైనా మీ కోడలా ఇంకో కొడుకుంటే తనని కోడల్ని చేసుకునేవారా అంటూ అసహ్యంగా మాట్లాడుతుంది. ఆ మాటలకి శారదమ్మ వాళ్ళు షాక్ అవుతారు. మీ హెల్ప్ తీసుకోనని ఆర్య సర్ చెప్పారు కదా అంటాడు జెండే. మీరైనా చెప్పండి ఆంటీ అని శారదమ్మని అడుగుతుంది అంజలి. శారదమ్మ, నీరజ్ కూడా ఆర్య ఒప్పుకోడు తనకి ఇలాంటి ఇష్టం ఉండదు అంటారు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉంటే మీ నాన్సెన్స్ ఆపండి ముందు నా సంగతి తేల్చండి అంటూ కేకలు వేస్తుంది మాన్సీ.
డైవర్స్ అంటే నీకు అంత వేళాకోళమైపోయిందా అంటుంది శారదమ్మ. మీరు మాట్లాడుతున్నది దీని గురించేనా అంటూ తాళి తీసి చూపిస్తుంది. మహా అయితే ఇది 12 గ్రాములు ఉంటుంది 60000 కూడా ఉండదు మీరే ఉంచుకోండి అని నేలకేసి కొడుతుంది మాన్సీ. అక్కడున్న అందరూ నిర్ఘాంత పోతారు. ఎందుకు ఇంత దిగజారి పోయావు బతికుండగా తాళి తీయకూడదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది శారదమ్మ. భార్య కోరికలని తీర్చలేని హస్బెండ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటుంది మాన్సీ. ఆ మాటలకి మరింత బాధపడిన నీరజ్ నువ్వు నా చావుని కోరుకుంటున్నావా అంటూ పేపర్స్ తీసుకొని సంతకం పెట్టి చచ్చిపోతాను అప్పుడు నీకు తిక్క కుదురుతుంది అంటాడు.
నువ్వు చచ్చిపోవటం కాదు నేనే చచ్చి సాధిస్తాను అంటూ తన గదిలోకి వెళ్లి ఉరి పోసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందరూ ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ ఎవరి మాట లెక్క చేయదు మాన్సీ. శారదమ్మకి భయం వేసి ఆర్య కి విషయం చెప్పి త్వరగా రమ్మంటుంది. ఆర్య వచ్చి నేను మాట్లాడేది విను, నీరజ్ నీకు డైవర్స్ ఇవ్వడు అలాగే వేలం పాట కూడా ఆగదు అంటూ కఠినంగా చెప్తాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.