- Home
- Entertainment
- Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
చిరంజీవితో నటించి ఆ తర్వాత సెలబ్రిటీలని వివాహం చేసుకున్న హీరోయిన్ల జాబితా ఇక్కడ ఉంది. వీరిలో కొంతమంది స్టార్ హీరోలని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఆ వివరాలు ఈ కథనంలో చూడండి.

సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న చిరంజీవి హీరోయిన్లు
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో నటించారు. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్లలో విజయశాంతి, రాధ, రాధికల పేర్లు ప్రముఖంగా చెప్పాలి. శ్రీదేవి చిరంజీవితో చేసింది తక్కువ సినిమాలే అయినా జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి అద్భుతమైన చిత్రంలో నటించింది. ఇదిలా ఉండగా చిరంజీవితో నటించిన హీరోయిన్లు చాలా మంది సెలెబ్రిటీలని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. ఆ హీరోయిన్లు ఎవరు ? ఎవరిని వివాహం చేసుకున్నారు అనే వివరాలు ఈ కథనంలో చూద్దాం.
సుమలత
నటి సుమలత చిరంజీవితో శుభలేఖ, ఖైదీ లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె కన్నడ స్టార్ అంబరీష్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అంబరీష్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణించారు.
సుహాసిని
చిరంజీవితో కలిసి సుహాసిని చంటబ్బాయి, మంచి దొంగ, ఛాలెంజ్ లాంటి చిత్రాల్లో నటించింది. సుహాసిని లెజెండ్రీ దర్శకుడు మణిరత్నంని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు.
రమ్యకృష్ణ
ముగ్గురు మొనగాళ్లు, అల్లుడా మజాకా, ఇద్దరు మిత్రులు లాంటి చిత్రాల్లో రమ్యకృష్ణ చిరంజీవితో నటించింది. రమ్యకృష్ణ క్రేజీ డైరెక్టర్ కృష్ణ వంశీని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు.
అమల
అక్కినేని అమల గురించి పరిచయం అవసరం లేదు. అమల చిరంజీవితో రాజా విక్రమార్క అనే చిత్రంలో నటించింది. ఆమె అక్కినేని నాగార్జునని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
రాధిక
చిరంజీవి లక్కీ హీరోయిన్లలో రాధిక ఒకరు. చిరంజీవి, రాధిక ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. రాధిక.. ప్రముఖ నటుడు శరత్ కుమార్ ని 2001లో వివాహం చేసుకున్నారు. ఆమెకి ఇది మూడో వివాహం.
నమ్రత శిరోద్కర్
నమ్రత గురించి కూడా పరిచయం అక్కర్లేదు. ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి. నమ్రత తెలుగులో నటించింది 2 సినిమాల్లో మాత్రమే. ఒకటి మహేష్ బాబుతో వంశీ కాగా మరొకటి చిరంజీవితో అంజి. తెలుగులో నమ్రత చివరగా నటించిన చిత్రం ఆంజినే.
శ్రీదేవి
అతిలోక సుందరి శ్రీదేవి , చిరంజీవి కలసి ఆల్ టైం క్లాసిక్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో నటించారు. ఆ తర్వాత శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ని వివాహం చేసుకున్నారు.
జ్యోతిక
నటి జ్యోతిక ఠాగూర్ మూవీలో చిరంజీవితో నటించారు. ఆ తర్వాత జ్యోతిక సూర్యని ప్రేమించి వివాహం చేసుకున్నారు.

