MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే

నందమూరి బాలకృష్ణ అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే డిమాండ్ ఎక్కువవుతోంది. అఖండ 2 కనుక సంక్రాంతికి విడుదలైతే ఏం జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 07 2025, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నందమూరి బాలకృష్ణ అఖండ 2
Image Credit : Youtube/14reels plus

నందమూరి బాలకృష్ణ అఖండ 2

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ డిస్కషన్ గా మారిపోయింది. డిసెంబర్ 5 రిలీజ్ కి అంతా రెడీ అయిపోయింది. థియేటర్ల వద్ద అభిమానుల హంగామా కూడా మొదలు పెట్టారు. కటౌట్లు కట్టారు. బాలయ్య పోస్టర్లకు పాలాభిషేకాలు మొదలయ్యాయి. మరికొన్ని నిమిషాలలో ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతాయి అనగా చిత్ర యూనిట్ షాక్ ఇచ్చింది. అఖండ 2 రిలీజ్ వాయిదా అని ప్రకటించారు. ఈరోస్ సంస్థతో ఆర్ధిక వ్యవహారాలు, వివాదాలు కారణంగా అఖండ 2 రిలీజ్ ఆగిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గోల్డెన్ ఆపర్చునిటీ మిస్
Image Credit : 14 reels plus/Youtube

గోల్డెన్ ఆపర్చునిటీ మిస్

అఖండ 2 రిలీజ్ వాయిదా పడడం అభిమానులకి బిగ్ షాక్ అనే చెప్పాలి. కారణాలు ఏవైనా అఖండ 2 చిత్రానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ పోయింది. ఈ చిత్ర బడ్జెట్ రికవరీ కావాలంటే సోలో రిలీజ్, హిట్ టాక్ వల్ల మాత్రమే సాధ్యం అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. డిసెంబర్ 5 ముగిసింది కాబట్టి ఇప్పుడు నిర్మాతలు కొత్త రిలీజ్ డేట్ కోసం చర్చలు జరుపుతున్నారు. డిసెంబర్ 12న లేదా డిసెంబర్ 25న రిలీజ్ అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

35
అవతార్ 3 తో పోటీ 
Image Credit : Asianet News

అవతార్ 3 తో పోటీ 

డిసెంబర్ 25న అయితే అవతార్ 3 తో పోటీ పడాల్సి ఉంటుంది. అభిమానులు అయితే అఖండ 2ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అఖండ 2 సంక్రాంతికి రిలీజ్ కావాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ సంక్రాంతి బెర్తులని రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలు ఖరారు చేసుకున్నాయి. బరిలో జన నాయకుడు, పరాశక్తి లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. 

45
సంక్రాంతికి వస్తే థియేటర్ల సమస్య 
Image Credit : 14 Reels Plus/ Youtube

సంక్రాంతికి వస్తే థియేటర్ల సమస్య 

 రాజా సాబ్ నిర్మాత విశ్వప్రసాద్ ఆల్రెడీ థియేటర్స్ తో అగ్రిమెంట్ పూర్తి చేశారట. ఇక మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రానికి కూడా భారీగా థియేటర్స్ ఉండేలా డీల్ ముగిసినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో బాలయ్య అఖండ 2 వస్తే ఎన్ని థియేటర్లు దక్కుతాయో తెలియని పరిస్థితి. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా కలెక్షన్స్ బాగానే వస్తాయి. అయితే ముందు నుంచే థియేటర్లు ఆక్యుపై చేసుకుని ఉండాలి. 

55
నష్టం ఎవరికి అంటే.. 
Image Credit : youtube/@14ReelsPlus

నష్టం ఎవరికి అంటే.. 

అఖండ 2 సడెన్ గా సంక్రాంతికి వస్తే ఆ చిత్రానికే నష్టం ఎక్కువ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఎందుకంటే అఖండ 2 హిట్ కావాలంటే 200 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టాలి. రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ చిత్రాలతో పోటీ పడి ఆ ఫీట్ సాధించడం కష్టం అవుతుంది. సో అఖండ 2 ఏదైనా సేఫ్ రిలీజ్ డేట్ చూసుకోవడం బెటర్ అనే టాక్ వినిపిస్తోంది. మరి నిర్మాతలు ఏం డిసైడ్ చేస్తారో వేచి చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్
Recommended image2
Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved