MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్

Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్

ప్రభాస్ కి ఒకే ఏడాది 2 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఎదురయ్యాయి. అల్లు అర్జున్, వెంకటేష్ చిత్రాలకు పోటీగా వెళ్లడంతో నెగిటివ్ రిజల్ట్ తప్పలేదు. ఆ సినిమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 07 2025, 07:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రభాస్ సినిమాలు
Image Credit : Youtube/mangomusic, Instagram/Prabhas

ప్రభాస్ సినిమాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. కానీ గతంలో ప్రభాస్ కూడా టాలీవుడ్ హీరోలతో పోటీ పడాల్సి వచ్చేది. స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం, బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం అనేది సహజం. ప్రభాస్ కి గతంలో ఒకే ఏడాది డిజాస్టర్ చిత్రాలు ఎదురయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారీ అంచనాలతో విడుదలైన ప్రభాస్ మూవీ
Image Credit : Prime Video

భారీ అంచనాలతో విడుదలైన ప్రభాస్ మూవీ

ప్రభాస్ కెరీర్ లో భారీ అంచనాలతో విడుదలైన చిత్రాల్లో యోగి ఒకటి. ఆ టైంలో డైరెక్టర్ వివి వినాయక్ టాలీవుడ్ లో తిరుగులేని మాస్ డైరెక్టర్. పైగా బన్నీ, లక్ష్మీ లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆ సమయంలో వివి వినాయక్, ప్రభాస్ కాంబోలో యోగి చిత్రం తెరకెక్కింది. ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్న హీరోతో వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ సినిమా చేస్తే బాక్సాఫీస్ రికార్డుల మోత ఖాయం అని అంతా భావించారు. 

Related Articles

Related image1
Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
Related image2
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి
35
ప్రభాస్ సినిమాపై దేశముదురు దెబ్బ
Image Credit : Aditya Music/Youtube

ప్రభాస్ సినిమాపై దేశముదురు దెబ్బ

భారీ అంచనాల నడుమ యోగి చిత్రం 2007 సంక్రాంతికి రిలీజ్ అయింది. నయనతార ఈ చిత్రం లో హీరోయిన్. తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రెండు రోజుల గ్యాప్ లో అల్లు అర్జున్, పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కిన దేశముదురు రిలీజ్ అయింది. యూత్ ఫుల్ లవ్ అండ్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన దేశముదురు మంచి టాక్ సొంతం చేసుకుంది. దీనితో దేశముదురు చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోయాయి. ఫలితంగా యోగి బాక్సాఫీస్ వద్ద కనిపించకుండా పోయింది. 

45
కాలేజ్ డ్రామాగా మున్నా
Image Credit : DVV Entertainments

కాలేజ్ డ్రామాగా మున్నా

అదే ఏడాది కొన్ని నెలల వ్యవధిలోనే ప్రభాస్ కి మరో షాక్ తప్పలేదు. యోగి చిత్రంతో హెవీ ఎమోషనల్ కథతో వచ్చిన ప్రభాస్.. ఈసారి యూత్ లక్ష్యంగా కాలేజ్ డ్రామాతో వచ్చారు. ఆ చిత్రమే మున్నా. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కింది. 

55
ఈసారి వెంకటేష్ కి పోటీగా వెళ్లి ..
Image Credit : Zee 5

ఈసారి వెంకటేష్ కి పోటీగా వెళ్లి ..

మున్నా చిత్రంలో సాంగ్స్ బాగా హిట్టయ్యాయి. దీనితో సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. 2007 మే 2న ఈ చిత్రం విడుదలైంది. అప్పటికి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఇలియానా మున్నా చిత్రంలో నటించింది. విడుదలైన తొలి షో నుంచే మున్నా చిత్రానికి ఫ్లాప్ టాక్ మొదలైంది. ఈ చిత్రానికి వారం ముందు వెంకటేష్, త్రిష ల ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం విడుదలైంది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మున్నా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో వెంకటేష్ జోరు ముందు నిలబడలేకపోయింది.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ప్రభాస్
అల్లు అర్జున్
దగ్గుబాటి వెంకటేష్
Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Sarja: అర్జున్‌ చెంప చెల్లుమనిపించిన డైరెక్టర్‌.. కోపంతో ఊగిపోయిన యాక్షన్‌ కింగ్‌ ఏం చేశాడంటే
Recommended image2
Peddi Collections: ఫస్ట్ డే పెద్ది బాక్సాఫీసు వద్ద ఊచకోత.. ప్రభాస్‌, ఎన్టీఆర్‌ రికార్డులు బ్రేక్‌
Recommended image3
Darshan Viral Video: లైవ్‌లోకి వచ్చిన దర్శన్, కన్నీళ్లు పెట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్
Related Stories
Recommended image1
Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
Recommended image2
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved