MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Srinivasa Mangapuram 5 Days Collections: శ్రీనివాస మంగాపురంకి షాకింగ్‌ కలెక్షన్లు.. మహేష్‌ అన్న కొడుక్కి ఇది ఊహించలేం

Srinivasa Mangapuram 5 Days Collections: శ్రీనివాస మంగాపురంకి షాకింగ్‌ కలెక్షన్లు.. మహేష్‌ అన్న కొడుక్కి ఇది ఊహించలేం

Srinivasa Mangapuram 5 Days Collections: మహేష్‌ బాబు అన్న రమేష్‌ బాబు కొడుకు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అయిన `శ్రీనివాస మంగాపురం` గత గురువారం థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రానికి కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 04 2026, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శ్రీనివాస మంగాపురంతో జై కృష్ణ హీరోగా ఎంట్రీ
Image Credit : Asianet News

శ్రీనివాస మంగాపురంతో జై కృష్ణ హీరోగా ఎంట్రీ

సూపర్‌స్టార్‌ కృష్ణ రెండో తరం నుంచి, మహేష్‌ బాబు కుటుంబం నుంచి వచ్చిన తొలి వారసుడు జై కృష్ణ. ఆయన మహేష్‌ అన్న రమేష్‌ బాబు కొడుకు కావడం విశేషం. జై కృష్ణ `శ్రీనివాస మంగాపురం` చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ కూతురు రాషా తడాని హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. దీనికి అజయ్‌ భూపతి దర్శకత్వం వహించడం విశేషం. వైజయంతి మూవీస్‌ సి అశ్వినీదత్‌ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై జెమినీ(పి) కిరణ్‌ నిర్మించారు. ఈ మూవీలో మోహన్‌ బాబు, వాసుకి, శ్యామ్‌ కీలక పాత్రలు పోషించారు. గురువారం(జులై 30)న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శ్రీనివాస మంగాపురం మూవీకి డివైడ్‌ టాక్‌
Image Credit : Asianet News

శ్రీనివాస మంగాపురం మూవీకి డివైడ్‌ టాక్‌

చాలా వరకు రొటీన్‌ స్టోరీ అని, రెగ్యూలర్‌ కమర్షియల్‌ మూవీ అన్నారు. ఒక స్టార్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోకి ఇలాంటి ఇంట్రడక్షనా? అనే విమర్శలు కూడా వచ్చాయి. లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గ కథలతో వస్తే బాగుండనే కామెంట్లు చాలా వరకు వినిపించాయి. దర్శకుడు టేకింగ్‌, మేకింగ్‌ పరంగానూ అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు. మొత్తంగా పాజిటివ్‌ కంటే నెగటివ్‌ ఈ సినిమాని చుట్టిముట్టింది. ఇది వసూళ్లపై ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. అయినా ప్రారంభంలో డీసెంట్‌ కలెక్షన్లని వసూలు చేసింది.

34
శ్రీనివాస మంగాపురం కలెక్షన్లు
Image Credit : Asianet News

శ్రీనివాస మంగాపురం కలెక్షన్లు

`శ్రీనివాస మంగాపురం` మూవీ కలెక్షన్లు చూస్తే(సాక్నిల్క్ సైట్‌ ఆధారంగా) మొదటి రోజు రూ.1.25కోట్లు రాబట్టగా, రెండో రోజు 88 లక్షలు, మూడో రోజు రూ.83లక్షలు, నాల్గో రోజు రూ.83లక్షలు వసూలు చేసింది. ఇక సోమవారం భారీగా డ్రాప్‌ అయ్యింది. కేవలం రూ.31లక్షలు మాత్రమే రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం ఇండియాలో రూ.4.63 కోట్ల గ్రాస్‌, రూ.4.10కోట్ల నెట్‌ రాబట్టింది. ఓవర్సీస్‌లో 25లక్షలు వచ్చాయి. టోటల్‌గా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.4.88కోట్ల కలెక్షన్లని సాధించింది. ఈ లెక్కన దీనికి రెండున్నర కోట్ల షేర్‌ వచ్చింది.

44
హిట్టా? ఫట్టా?
Image Credit : Asianet News

హిట్టా? ఫట్టా?

ఈ సినిమా హిట్‌ కావాలంటే పది కోట్ల షేర్‌ రావాలి. అంటే ఇరవై కోట్ల గ్రాస్‌ రావాలి. ఇప్పుడు వస్తున్న కలెక్షన్లు చూస్తే కనీసం ఇది పది కోట్లు కూడా వసూలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే జరిగితే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఇది నిలవబోతుందని చెప్పొచ్చు. ఈ సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.20కోట్లు. నాన్‌ థియేట్రికల్‌గా కూడా దీనికి అంతంతగానే వచ్చిందని సమాచారం. మొత్తంగా ఈ మూవీ పరాజయం దిశగా వెళ్తుందని ట్రేడ్‌ వర్గాల టాక్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్ గా.. తల్లి చివరి కోరిక తీర్చడానికి కెరీర్ ను త్యాగం చేసిన మాస్టర్ భరత్...
Recommended image2
Soundarya: చనిపోవడానికి ముందు మేనకోడలితో సౌందర్య ఏమన్నారంటే? చివరి మాటలు ఇవే
Recommended image3
Don't Trouble The Trouble 5 Days Collections: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి దారుణమైన కలెక్షన్లు.. 5 రోజుల్లో ఇంతేనా
Related Stories
Recommended image1
Newtons 3rd Law 4 Days Collections: సుమంత్‌ మూవీకి దారుణమైన కలెక్షన్లు.. కనీసం హీరో రెమ్యూనరేషన్‌ కూడా రాలేదా?
Recommended image2
Biggest Budget Movies: ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మూవీస్‌ ఇవే.. టాలీవుడ్‌ దే హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved