MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Roja Selvamani: రోజా తో రొమాన్స్ చేయాలంటే భయపడ్డ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

Roja Selvamani: రోజా తో రొమాన్స్ చేయాలంటే భయపడ్డ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

ప్రస్తుతం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా.. ఒకప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీని ఊపు ఊపేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలందితో జోడీగా నటించి మెప్పించింది. అయితే ఆమెతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఓ హీరో భయపడ్డాడని మీకు తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 12 2026, 08:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు తమిళంలో రోజా మార్క్..
Image Credit : Instagram/Roja Selvamani

తెలుగు తమిళంలో రోజా మార్క్..

సౌత్ లో ప్రత్యేకంగా తెలుగు, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలలో హీరోయిన్ గా తన మార్క్ చూపించింది రోజా. ప్రస్తుతం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా దూసుకుపోతున్న ఈతార.. హీరోయిన్ గా ఇండస్ట్రీని ఊపు ఊపేసింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ తో పాటు జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి ఫ్యామిలీ హీరోల జంటగా నటించి మెప్పించింది. హీరోయిన్ గా మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్నిసినిమాల్లో అదరగొట్టింది. తల్లి పాత్రల్లో నటించినా.. తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో హీరోయిన్ ను కూడా డామినేట్ చేసేది రోజా. రాజకీయాల్లోకి ఫుల్ టైమ్ ఎంట్రీ తరువాత ఇండస్ట్రీని వదిలేసిన ఆమె.. బుల్లితెరపై మాత్రం కంటీన్యూ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రోజాతో రొమాన్స్ అంటే భయపడ్డ హీరో..
Image Credit : Instagram/Roja Selvamani

రోజాతో రొమాన్స్ అంటే భయపడ్డ హీరో..

రోజా తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించింది. చిరంజీవిత పోటీగా డ్యాన్స్ చేసేది, సెంటిమెంట్, కామెడీ, గ్లామర్ ఏదైనా సరే ఆమె నవరసాలు పండించగల నటిగా పేరు తెచ్చుకుంది. కమర్షియల్ సినిమాల్లో ఎంత హాట్ గా కనిపించేదో.. ఫ్యామిలీ హీరోలతో చేసేప్పుడు అంత పద్దతిగా నటించేది. ఈక్రమంలో ఆమె జగపతిబాబు, శ్రీకాంత్ జంటగా కొన్ని ఫ్యామిలీ ఓరియోంటెడ్ మూవీస్ చేసింది. అందులో ఆమె నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమాల్లో రోజాతో రొమాన్స్ చేయడానికి హీరో శ్రీకాంత్ కి భయం వేసేదట.

Related Articles

Related image1
Balakrishna: బాలయ్య ను ఇంత దారుణంగా వాడుతున్నారేంట్రా బాబు.. ఫ్రీ లిక్కర్, బిర్యానీ ఎక్కడో తెలుసా?
Related image2
Monsoon Movies: భార్యాభర్తలు కలిసి వర్షం పడుతున్నప్పుడు చూడాల్సిన 5 రొమాంటిక్ సినిమాలు ఏవో తెలుసా?
35
శ్రీకాంత్ ను ఆటపట్టించిన రోజా..
Image Credit : Youtube/Aditya Movies

శ్రీకాంత్ ను ఆటపట్టించిన రోజా..

శ్రీకాంత్ , రోజా కలిసి  తిరుమల, తిరుపతి వెంకటేశ, క్షేమంగా వెళ్లి లాభంగా రండి లాంటి సినిమాల్లో నటించారు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాలో వీరి మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. రోజాతో ఆ సీన్స్ చేయడానికి తాను కొంచెం ఇబ్బంది పడ్డానని శ్రీకాంత్ స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు.

షూటింగ్‌ సమయంలో రోజా చాలా చలాకీగా ఉండేదట, కానీ శ్రీకాంత్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా 'అన్నా' అని పిలిచి నవ్వించేదట, దాంతో ఆ సన్నివేశాలు చేయడం తనకు కష్టంగా అనిపించిందని, ఆయన ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు. రోజాతో రొమాంటిక్ సీన్స్ అంటే భయం వేసేదని ఆయన అన్నారు.

45
రోజా రీ ఎంట్రీ ప్రయత్నాలు..
Image Credit : INSTAGRAM/Roja Selvamani

రోజా రీ ఎంట్రీ ప్రయత్నాలు..

ఫిల్మ్ ఇండస్ట్రీలో రోజా అన్నా అని ప్రేమగా పిలుచుకునేది శ్రీకాంత్ నే. ఈ విషయాన్ని రోజా కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు. ప్రస్తుతం బుల్లితెరపై కొన్ని కామెడీ, డ్యాన్స్ షోలకు జడ్జిగా రోజా వ్యవహరిస్తున్నారు. ఎన్ని కల్లో ఓడిపోవడంతో.. ఆమె ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న టాక్ కూడా వచ్చింది. ఈమధ్యనే బుల్లితెరపై మళ్లీ మెరిస రోజా.. త్వరలో సినిమాల్లో కూడా కనిపించబోతున్నారట. తమిళంలో ఆమె ఇప్పటికే కొన్ని సినిమాలు చేస్తున్నారని తెలుస్తోంది.

55
విలన్ గా శ్రీకాంత్ కొత్త అవతారం..
Image Credit : Actor Srikanth\Twitter

విలన్ గా శ్రీకాంత్ కొత్త అవతారం..

ఇక శ్రీకాంత్ విషయానికి వస్తే.. హీరోగా సినిమాలు తగ్గడంతో ఆయన క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లారు. ఫ్యామిలీ హీరోగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ అభిమానులను సంపాదించుకున్న శ్రీకాంత్.. ప్రస్తుతం మాస్ ఇమేజ్ వైపు పరుగులు తీస్తున్నాడు. విలన్ గా కొత్త అవతారం ఎత్తి.. తనలో మరో కోణాన్ని చూపిస్తున్నాడు. అఖండ లో ఆయన చేసిన వరదరాజులు  పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరో వైపు తమిళ, మళయాల సినిమాల్లో కూడా శ్రీకాంత్ కొత్త తరహా పాత్రల్లో నటిస్తున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Related Stories
Recommended image1
Balakrishna: బాలయ్య ను ఇంత దారుణంగా వాడుతున్నారేంట్రా బాబు.. ఫ్రీ లిక్కర్, బిర్యానీ ఎక్కడో తెలుసా?
Recommended image2
Monsoon Movies: భార్యాభర్తలు కలిసి వర్షం పడుతున్నప్పుడు చూడాల్సిన 5 రొమాంటిక్ సినిమాలు ఏవో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved