Ramayana Review: రామాయణం మూవీ ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్ ఏంటంటే?
Ramayana First Review: రామాయణం ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ `రామాయణం`. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. అయితే ఇప్పటికే ప్రీమియర్స్ వేశారు, కొందరికి సినిమాని చూపించారు. మరి సినిమా టాక్ ఏంటి అనేది ఫస్ట్ రివ్యూలో తెలుసుకుందాం.

రామాయణ మూవీ ఫస్ట్ రివ్యూ
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ ఒకటి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగానికి ఇప్పటికే లాస్ ఏంజెల్స్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఇండియాలోనూ షోస్ వేశారని తెలిసింది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది. మూవీ ఎలా ఉంటుందనేది ఫస్ట్ రివ్యూలో తెలుసుకుందాం. ఇది సెన్సార్ పూర్తి చేసుకొని యూ సర్టిఫికేట్‌ని పొందింది. నిడివి 3 గంటల 15 నిమిషాల నిడివితో ఉంటుంది.
కథ, కథనం ఎలా ఉన్నాయి?
వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రాముడి జీవితంలోని కీలక ఘట్టాలను భారీ స్థాయిలో తెరకెక్కించారు. తెలిసిన కథనే అయినప్పటికీ, దానిని అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశారు. కథలోని ప్రధాన అంశాలకు పెద్దపీట వేస్తూనే యాక్షన్ సన్నివేశాలను ప్రత్యేకంగా రూపొందించారు. అయితే, ప్రీమియర్ చూసిన కొందరు విమర్శకుల అభిప్రాయం ప్రకారం, సినిమాలో డ్రామా, భావోద్వేగాల కంటే విజువల్స్, యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్లు ఉందని చెబుతున్నారు.
ప్లస్ పాయింట్స్
1. రావణుడిగా యష్ నటన
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ యష్ అని తెలుస్తోంది. రావణుడి పరిచయ సన్నివేశాలు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా యష్ తనదైన శైలిలో రావణుడి పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చారని అంటున్నారు.
2. రణబీర్ కపూర్, సాయి పల్లవి
శ్రీరాముడిగా రణబీర్ కపూర్ ప్రశాంతమైన నటనతో మెప్పించారని, సీతాదేవిగా సాయి పల్లవి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారని టాక్. ఇద్దరి నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.
3. విజువల్స్, భారీ నిర్మాణం
సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయని సమాచారం. కొన్ని సన్నివేశాలను హాలీవుడ్ చిత్రం ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ స్థాయిలో పోలుస్తున్నారు.
కథ అడాప్టేషన్ బాగుందని చెబుతున్నారు. తెరపై ఒక అనుభూతిని ఇచ్చే సినిమా అవుతుందని టాక్. ఒక మాస్టర్ పీస్‌గా ఈ సినిమా గురించి చెబుతున్నారు. పెద్ద తెరపై చూడాల్సిన సినిమా, విజువల్‌గా కనువిందు చేస్తుందని అంటున్నారు.
మైనస్ పాయింట్స్
అయితే ప్లస్‌ల కంటే మైనస్ లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలిసిన కథే కావడం మెయిన్ మైనస్ అంటున్నారు. దీనికితగ్గట్టుగానే కథనం నెమ్మదిగా సాగుతుందట. రామాయణం వంటి ఇతిహాసానికి అవసరమైన దైవత్వం, భావోద్వేగాలను సంగీతం పూర్తిస్థాయిలో అందించలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల గ్రీన్ మ్యాట్ ఛాయలు కనిపిస్తున్నాయట. కొన్ని పాత్రలు కర్టూన్లను తలపించేలా ఉన్నాయని చెబుతున్నారు. వీఎఫ్ఎక్స్ కొన్ని సీన్లలో తేలిపోయాయని అంటున్నారు.
యాక్షన్ సన్నివేశాలు లెన్తీగా, సాగదీసినట్టుగా ఉన్నాయని చెబుతున్నారు. గ్రాండ్ విజువల్స్, భారీ బడ్జెట్, భారీ తారాగణం ఉన్నా, సినిమాలో సోల్ లేదని, ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేదని చెబుతున్నారు. అంతేకాదు అడంభరాల మీద పెట్టిన దృష్టి ఎమోషనల్‌గా ఆడియెన్స్ కి మూవీని కనెక్ట్ చేయడంలో పెట్టలేదని చెబుతున్నారు. అంతేకాదు రాముడిగా రణ్‌బీర్‌ని చూడలేకపోతున్నామని, సీతగా సాయిపల్లవి కూడా అంతగా నప్పలేదని చెబుతున్నారు.





