- Home
- Entertainment
- రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి? ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది?
రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి? ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడాకుల తరువాత రేణు దేశాయ్ రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు. డివోర్స్ తరువాత వెంటనే మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది రేణుకి. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా ప్రకటించింది అప్పట్లో. అయితే ఆతరువాత పెళ్లి మాత్రం చేసుకోలేదు. కారణం ఏంటీ అనే విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది రేణు. ఇంతకీ ఈ మాజీ హీరోయిన్ రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రేణు దేశామ్ సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతుంటారు. చాలా విషయాల్లో ఆమె స్పందిస్తుంటుంది. రీసెంట్ గా హెచ్ సీయు భూముల విషయంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి సోషల్ మీడియాలో ఆమె చేసిన రిక్వెక్ట్ అందరి దృష్టిని ఆకర్శించింది. కాగా రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. విడాకులు తీసుకుని కూడా 12 ఏళ్లకు పైనే అవుతోంది. అయితే ఆమె విడాకులు తరువాత ఎందుకు రెండో పెళ్లి చేసుకోలేదు.
Also Read: థియేటర్ లో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? సినిమా మధ్యలో బ్రేక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే?
Pawan Kalyan - Renu desai
పవన్ కళ్యాణ్ రేణుతో డివోర్స్ తరువాత రష్యన్ నటి అన్నలెజినోవాను పెళ్లాడారు. కాని రేణు దేశాయ్ మాత్రం సింగల్ గానే ఉండటానికి కారణం ఏంటి. రీసెంట్ గా ఆమె ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. పవన్ తో విడాకులు టైమ్ లో వారికి అకీరా, ఆధ్య ఇద్దరు జన్మించారు. దాంతో వారిద్దరి బాధ్యత రేణు దేశాయ్ కు వెళ్ళింది. డివోర్స్ తరువాత కూడా పిల్లల కోసం ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉన్నారు. పవన్ కూడా పిల్లల బాధ్యత తీసుకుని, వారిని ఎప్పుటికప్పుడు కనిపెట్టుకుని ఉండేవారు. వారిని చూడటానికి పూణే కూడా వెళ్లేవారు.
Also Read: ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం తో మంచం ఎక్కిన హీరోయిన్? 3రోజులు ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డ నటి ఎవరు?
అయితే విడాకులు తీసుకున్న కొన్నాళ్ళకు పెళ్లి చేసుకోవాలని రేణునిర్ణయించుకున్నారట. ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ కూడా అయ్యిందట. కాని పెళ్లి మాత్రం జరగలేదు. దానికి కారణం ఏంటీ అనేది ఇప్పటి వరకూ ఎవరికి తెలియదు. కాని రేణు పెళ్లి చేసుకోబోతోంది అని తెలియగానే పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఎంగేజ్మెంట్ అయితే అయ్యింది కాని పెళ్లి మాత్రం జరగలేదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం వెల్లడించారు రేణు.
Also Read: సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలు, మందు బాబులకు త్వరలో డబుల్ ధమాకా
renu desai
అప్పట్లో రెండవ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ పిల్లల గురించి అలోచించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. రెండో పెళ్లి చేసుకుంటే.. పిల్లలు, ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలన్స్ చేయగలనా లేదా అనిపించింది. అందుకే పిల్లలకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నారు. ఆధ్య కి ఇప్పుడు 15 ఏళ్ళు..ఇంకో మూడేళ్లు అయితే 18 ఏళ్ళు నిండుతాయి. ఆమె కాలేజ్ కు వస్తుంది.. పిల్లలు తమ నిర్ణయాలు తాము తీసుకునే వరకు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు నా పెళ్ళి గురించి ఆలోచిస్తాను అని రేణు అన్నారు.
Also Read: రజనీకాంత్ భార్య లత నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
రేణు కామెంట్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇక అకీరా ఎంట్రీపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. మరో రెండేళ్లలో అకిరా నందన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, రామ్ చరణ్ ఆ సినిమాను నిర్మిస్తారు అని వస్తున్న వార్తలపై రేణు దేశాయ్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘అకిరా ఇంకా సినిమాల్లోకి రావాలా వద్దా అనేది నిర్ణయించుకోలేరు. సోషల్ మీడియా లో ప్రచారమైన వార్తలన్నీ అబద్దాలే. అకిరా సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు నేనే అందరికీ తెలిసేలా అనౌన్స్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.