MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • థియేటర్ లో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? సినిమా మధ్యలో బ్రేక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే?

థియేటర్ లో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? సినిమా మధ్యలో బ్రేక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే?

సినిమా థియేటర్లలో  ఇంటర్వెల్ ఇవ్వడానికి కారణం ఏంటి? సినిమా చాలా ఇంట్రెస్ట్ గా నడుస్తుండగా ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి వెంటనే బ్రేక్ ఎందుకు ఇస్తారు. దానికి ఒక్కటి కారు రకరకాల కారణాలు ఉన్నాయి. ఇంతకీ థియేటర్ లో బ్రేక్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 09 2025, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనం ఎప్పుడో ఒకసారి  సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్తుంటాం.  సినిమా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతున్ టైమ్ లో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి.. ఇంట్రెవేల్ వేస్తుంటారు. ఆ మధ్యలో పది నిమిషాల టైమ్ లోనే వాష్ రూమ్ కు వెళ్ళడం, ఫుడ్ తెచ్చకోవడం, పాన్ కార్న్ , కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటుంటారు. అయితే ఈ ఇంట్రవెల్ ఇవ్వడం కేవలం పాప్‌కార్న్ తినడానికి మాత్రమే కాదు. దీని వెనుక అసలు కారణం వేరే ఉంది. అది చాలా మందికి తెలీదు.

Also Read: సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలు, మందు బాబులకు త్వరలో డబుల్ ధమాకా
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

థియేటర్లలో విడుదలయ్యే సినిమాల్లో ప్రేక్షకులు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇంటర్వెల్ ఇస్తారు. ఇప్పుడంటే డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. సినిమాలు థియేటర్ లో స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు. కాని  ఆ రోజుల్లో సినిమాలు థియేటర్ లో ప్లే చేయాలి అంటే రీల్స్ మార్చుతూ ఉండేవారు. దానికి పెద్ద రీల్స్ ఉండేవి. ఇంటర్వెల్ సమయంలో మొదటి రీల్‌ను తీసేసి రెండో రీల్‌ను పెట్టేవారు. దీనికోసమే థియేటర్లలో ఇంటర్వెల్ పెట్టేవారు.

Also Read:ఎన్టీఆర్ దెబ్బకు జ్వరం తో మంచం ఎక్కిన హీరోయిన్? 3రోజులు ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడ్డ నటి ఎవరు?

35

రీల్స్ మార్చడానికి పట్టే సమయాన్నే థియేటర్‌లో ఇంటర్వెల్‌గా ఇచ్చేవారు. ఇది సినిమా మధ్యలో ఇంటర్వెల్ రావడానికి గల టెక్నికల్ కారణం. సినిమాల మొదటి రోజుల్లో అయితే రెండు మూడు ఇంట్రవెల్స్ కూడా ఉండేవట. రాను రాను అవి తగ్గిపోయి..ప్రతీ సినిమాకు ఒకబ్రేక్ మాత్రమే ఇస్తున్నారు. అది సరే.. ఇప్పుడు రీల్స్ మార్చే అవసరం లేదు. అయినా థియేటర్లలో ఇంటర్వెల్ ఇవ్వడం కొనసాగుతూనే ఉంది కారణం ఏంటి? 

45
popcorn

popcorn

ఇప్పటికీ థియేటర్‌లో ఇంటర్వెల్ ఉండడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఇంటర్వెల్ సమయంలో అక్కడ దొరికే పాప్‌కార్న్, స్నాక్స్, కూల్‌డ్రింక్స్ వంటి వాటిని అభిమానులు కొనుక్కుని తింటారు. ఇది థియేటర్‌కు ఒక పెద్ద ఆదాయ వనరుగా ఉంటుంది. ఇది కూడా ఇంటర్వెల్ ఇవ్వడానికి ఒక కారణం. 

55

అంతే కాదు ఎప్పుడు పడితే అప్పుడు పైకి లేచి వాష్ రూమ్స్ కు, ఫుడ్, కూల్ డ్రింక్స్ కోసం వెళ్ళకుండా ఓపదినిమిసాల టైమ్ ను ఇంట్రవెల్ గా ఇస్తున్నారు. మధ్యలో లేస్తే సినిమా చూసే ఇతర ఆడియన్స్ కు ఇబ్బంది అవుతుంది కనుక, అందరికి కలిపి ఒక బ్రేక్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాదు సినిమా చాలా గంటలు నడిస్తే, ప్రేక్షకులు విసుగు చెందకుండా ఉండటానికి, కాసేపు నడుస్తూ, కూర్చుని, ఏదైనా తిని, తాగి మళ్ళీ సినిమా చూడటానికి ఇంటర్వెల్ ఇస్తారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved