MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • రజినీకాంత్ ను కొట్టమనందుకు.. సినిమానే వదిలేసిన స్టార్ హీరోయిన్? ఖుష్బూ మిస్ అయిన మూవీ ఏదో తెలుసా?

రజినీకాంత్ ను కొట్టమనందుకు.. సినిమానే వదిలేసిన స్టార్ హీరోయిన్? ఖుష్బూ మిస్ అయిన మూవీ ఏదో తెలుసా?

సూపర్‌స్టార్ రజినీకాంత్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు వచ్చిన అవకాశాన్ని నటి ఖుష్బూ తిరస్కరించారు. దీనికి కారణం ఆ సినిమాలో రజినీకాంత్‌ను కొట్టే సీన్ ఉండటమే. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 02 2026, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఖుష్బూ ప్లేస్ లో విజయశాంతి..
Image Credit : X

ఖుష్బూ ప్లేస్ లో విజయశాంతి..

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన 'మన్నన్' సినిమాలో ఆయనకు ధీటుగా, స్టైల్‌గా ఒరిజినల్ లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి నటించారు. నిజానికి ఆ పాత్రలో ముందుగా ఖుష్బూ నటించాల్సింది. కానీ ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఆమె స్థానంలో విజయశాంతి నటించడానికి కూడా ఖుష్బూనే కారణం. అసలు ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి ఆమె ఎందుకు నిరాకరించారో ఈ గ్యాలరీలో చూద్దాం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
షాక్ అయిన ఖుష్బూ
Image Credit : Google

షాక్ అయిన ఖుష్బూ

పి. వాసు దర్శకత్వంలో ప్రభు-ఖుష్బూ జంటగా నటించిన 'చిన్నతంబి' సినిమా మెగా హిట్ అయిన సమయంలో, శివాజీ గణేశన్ నిర్మాణంలో రజినీకాంత్‌తో 'మన్నన్' సినిమాను పి. వాసు డైరెక్ట్ చేయడానికి కమిట్ అయ్యారు. ఆ సినిమాలో రజినీకి సమానమైన హీరోయిన్ పాత్రకు ఆయన మనసులో మొదట మెదిలిన పేరు ఖుష్బూ. అందుకే పి. వాసు ఆ కథను ముందుగా ఖుష్బూకే చెప్పారు. కానీ కథ విన్న ఖుష్బూ షాక్ అయ్యారట. కథ నచ్చినా అందులో నటించడానికి మాత్రం ఒప్పుకోలేదట.

Related Articles

Related image1
వీడెక్కడ దొరికాడురా బాబు నా కర్మకి.. అని రాజమౌళి ఫీల్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Related image2
రామాయణ టీజర్.. రాముడిని దించేసిన రణ్‌బీర్ కపూర్.. మరో ఆదిపురుష్ అవుతుందా? మళ్ళీ అదే తప్పు..
35
రజినీకాంత్ ను కొట్టమన్నందుకు..
Image Credit : Google

రజినీకాంత్ ను కొట్టమన్నందుకు..

కార్మికుడిగా పనిచేసే రజినీకాంత్‌ను ఖుష్బూ చెంపదెబ్బ కొట్టే సీన్ సినిమాలో ఉందని పి. వాసు చెప్పగానే, 'అయ్యయ్యో ఆ సీన్‌లో నేను అస్సలు నటించలేను' అని ఖుష్బూ చెప్పేశారట. 'మీరు రజినీకాంత్‌కు సమానమైన పవర్‌ఫుల్ నటిని పెడితేనే ప్రేక్షకులు అంగీకరిస్తారు. నేను రజినీ సర్‌ను కొడితే ప్రేక్షకులు అస్సలు ఒప్పుకోరు. చిన్నతంబి సినిమాలో అల్లరి పిల్లగా నటించి, ఈ సినిమాలో అంత మాస్ రోల్ చేస్తే వాళ్లు అంగీకరించలేరు' అని ఖుష్బూ వివరించారట.
45
అభిమానులు గొడవచేస్తారని..
Image Credit : Google

అభిమానులు గొడవచేస్తారని..

అంతేకాదు, 'నేను రజినీ సర్‌ను కొడితే ఆయన అభిమానులు థియేటర్లలో స్క్రీన్లు చించేస్తారు. ఎందుకంటే రజినీకాంత్ అభిమానులు ఆయనపై అంత ప్రేమ చూపిస్తారు' అని ఖుష్బూ చెప్పారట. ఆమె వివరణ కరెక్ట్‌గా అనిపించడంతో, దర్శకుడు పి. వాసు ఖుష్బూ స్థానంలో అప్పట్లో తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఉన్న విజయశాంతిని ఆ పాత్రకు తీసుకున్నారు. అయితే, కథ బాగా నచ్చడంతో హీరోయిన్‌గా కాకపోయినా ఏదైనా చిన్న పాత్ర ఇవ్వమని ఖుష్బూ దర్శకుడిని అడిగారట.
55
చిన్న పాత్రలో నటించిన ఖుష్బూ..
Image Credit : instagram

చిన్న పాత్రలో నటించిన ఖుష్బూ..

ఖుష్బూ కోరిక మేరకు, 'మన్నన్' సినిమాలో విజయశాంతికి పీఏగా, రజినీకాంత్ ప్రేయసిగా ఆమెను నటింపజేశారు. కొన్ని సీన్లు, ఒక డ్యూయెట్ సాంగ్‌లో ఖుష్బూ కనిపిస్తారు. ఈ విషయాన్ని దర్శకుడు పి. వాసు ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, 'ఖుష్బూకి అస్సలు ఈగో ఉండదు. అందుకే నా సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది. సినిమా బాగా రావాలని చాలా కష్టపడుతుంది' అని ప్రశంసించారు. అందుకే  ఖుష్బూ సౌత్ సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Related Stories
Recommended image1
వీడెక్కడ దొరికాడురా బాబు నా కర్మకి.. అని రాజమౌళి ఫీల్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
రామాయణ టీజర్.. రాముడిని దించేసిన రణ్‌బీర్ కపూర్.. మరో ఆదిపురుష్ అవుతుందా? మళ్ళీ అదే తప్పు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved