MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • రామాయణ టీజర్.. రాముడిని దించేసిన రణ్‌బీర్ కపూర్.. మరో ఆదిపురుష్ అవుతుందా? మళ్ళీ అదే తప్పు..

రామాయణ టీజర్.. రాముడిని దించేసిన రణ్‌బీర్ కపూర్.. మరో ఆదిపురుష్ అవుతుందా? మళ్ళీ అదే తప్పు..

రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న 'రామాయణం' సినిమా టీజర్ వచ్చేసింది. ఈ టీజర్‌తో, రాముడి పాత్రలో రణ్‌బీర్ ఎలా ఉన్నాడో మొదటిసారి ప్రేక్షకులకు చూపించారు. టీజర్ మొత్తం రణ్‌బీర్‌పైనే ఫోకస్ చేశారు. కానీ ఎక్కడ తేడా కొడుతుందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 02 2026, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రాముడిగా రణ్ బీర్ కపూర్ లుక్..
Image Credit : World Of Ramayana youtube

రాముడిగా రణ్ బీర్ కపూర్ లుక్..

రణ్‌బీర్ కపూర్ తన కెరీర్‌లో మొదటిసారి ఒక పౌరాణిక చిత్రంలో నటిస్తున్నాడు. 'రామాయణం' సినిమాలో ఆయన శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్రలో రణబీర్ కపూర్ కు సబంధించిన లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది.  భారీ గ్రాఫిక్స్ తో.. గ్రాండ్ గా రిలీజ్ చేసిన ఈ టీజర్.. అద్భుతంగా ఉన్నా.. ఎక్కడో ఏదో లోటు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పలు అవతారాల్లో కనిపించిన హీరో..
Image Credit : World Of Ramayana youtube

పలు అవతారాల్లో కనిపించిన హీరో..

'రామాయణం' టీజర్‌లో రాముడిగా రణ్‌బీర్ పలు అవతారాల్లో కనిపించాడు. కొన్నిచోట్ల ధనుస్సు పట్టిన రాజకుమారుడిగా, మరికొన్నిచోట్ల వనవాసం చేస్తున్న రాముడిగా కనిపిస్తున్నాడు. మొత్తానికి రణ్ బీర్ రాముడిగా అద్భుతంగా ఉన్నాడు. కానీ ఈ టీజర్ లో కనిపించిన పెద్ద పెద్ద రాజ ప్రాసాదాలు, కోటలు, గ్రాఫిక్స్ వర్క్ లో కాస్త తేడా కనిపిస్తోంది.

Related Articles

Related image1
వీడెక్కడ దొరికాడురా బాబు నా కర్మకి.. అని రాజమౌళి ఫీల్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Related image2
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
36
మరో ఆదిపురుష్ అవుతుందా?
Image Credit : World Of Ramayana youtube

మరో ఆదిపురుష్ అవుతుందా?

ఈ సినిమా టీజర్ఈ లో చాలా సన్నివేశాలు చూపించారు. ఎక్కువగా రణ్ బీర్ కపూర్ రాముడి లుక్ మీదనే టీజర్ అంతా ఫోకస్ చేశారు. అయితే రాముడి జీవితం చూపించే ముందు రియాల్టీకి దగ్గర ఉండేలా చూపిస్తే బాగుంటుంది అని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ ఇక్కడ సీన్ కాస్త రివర్స్ అయినట్టు తెలుస్తోంది. ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ మీదనే ఆధారపడినట్టు కనిపిస్తోంది. గతంలో ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా కూడా ఇలానే భారీ అంచనాలు క్రియేట్ చేసి.. చివరకు డిజాస్టర్ గా నిలిచింది.

46
గ్రాఫిక్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారా?
Image Credit : World Of Ramayana youtube

గ్రాఫిక్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారా?

ప్రస్తుతం రిలీజ్ అయిన రామాయణం టీజర్ చూస్తుంటే కూడా.. గతంలో ఆదిపురుష్ మాదిరిగా.. గ్రాండ్ గా చూపించాలనే ఆలోచన కనిపిస్తోంది. గ్రాఫిక్స్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. వార్ సీన్స్ కూడా ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్టుగా కనిపించాయి తప్పించి.. పురాణకాలంలో జరిగినట్టుగా చెప్పబడుతున్న యుద్దాలకు.. ఇప్పటి వార్ సీన్స్ కు ఏమాత్రం పొంతన ఉండటంలేదు.  గతంలో రామాయణం అంటే సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా.. చూపించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

56
రాముడిగా రణ్ బీర్ లుక్ ఎలా ఉంది?
Image Credit : Youtube@WorldOfRamayana

రాముడిగా రణ్ బీర్ లుక్ ఎలా ఉంది?

టీజర్‌ మొత్తంలో రణ్ బీర్ కపూర్ పైనే ఎక్కువ గా ఫెకస్ చేసినట్టు కనిపిస్తోంది. రాజకుమారిడిగా, వనవాస రాముడిగా, అస్త్రాలు ధరించిన యుద్దు వీరుడిగా రకరకాల అవతారాల్లో ఈ టీజర్ లో కనిపించాడు రణ్ బీర్. అన్ని గెటప్పుల్లో ఈ హీర్ లుక్స్ చాలా బాగున్నాయి. వనవాస రాముడిగా నార వస్త్రాలు ధరించి, తలపై ముడి పెట్టుకుని.. శ్రీరాముడు శాంతమూర్తిలా దర్శణం ఇచ్చాడు. రణ్ బీర్ కపూర్ ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టు కనిపించాడు.

66
రామాయణం రిలీజ్ ఎప్పుడు?
Image Credit : Youtube@WorldOfRamayana

రామాయణం రిలీజ్ ఎప్పుడు?

'రామాయణం'లో రణ్‌బీర్ కపూర్‌తో పాటు, రాముడి తమ్ముడు లక్ష్మణుడి పాత్రలో రవి దూబే కనిపించనున్నాడు. 'రామాయణం' సినిమాకు నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. నమిత్ మల్హోత్రా ఈ చిత్రానికి నిర్మాత. రణ్‌బీర్ కపూర్‌తో పాటు సాయి పల్లవి, రవి దూబే, సన్నీ డియోల్, యశ్, అరుణ్ గోవిల్ వంటి నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా 2026, 2027 దీపావళికి విడుదల కానుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image2
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image3
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Related Stories
Recommended image1
వీడెక్కడ దొరికాడురా బాబు నా కర్మకి.. అని రాజమౌళి ఫీల్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved