- Home
- Entertainment
- Lucky Baskhar: లక్ష పెట్టుబడితో రూ.100 కోట్లు లాభం పొందిన జైలర్ 2 నటుడు, రియల్ లక్కీ భాస్కర్ ఎవరో తెలుసా?
Lucky Baskhar: లక్ష పెట్టుబడితో రూ.100 కోట్లు లాభం పొందిన జైలర్ 2 నటుడు, రియల్ లక్కీ భాస్కర్ ఎవరో తెలుసా?
Jailer 2 Actor investment Story: నెల్సన్ డైరెక్షన్లో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయిన జైలర్ 2 సినిమాలో రజనీకాంత్ ఫ్రెండ్‌గా నటించిన ఒకరు రియల్ లైఫ్‌లో అదిరిపోయే ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏకంగా రూ.100 కోట్లు సంపాదించారు. ఆ పూర్తి వివరాలు చూద్దాం.

జైలర్ 2 నటుడి పెట్టుబడి కథ
తమిళ ఇండస్ట్రీకి భారీ వసూళ్లు తెచ్చిపెట్టిన సినిమా అంటే అది జైలర్ అనే చెప్పాలి. ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చింది. ఇందులో 2023లో జైలర్ పార్ట్ 1 రిలీజ్ అయింది. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి దుమ్మురేపింది. అప్పటివరకు వరుస ప్లాపుల్లో ఉన్న రజనీకాంత్‌కు జైలర్ 2 ఒక సాలిడ్ హిట్ ఇచ్చింది.
జైలర్ 2 సంచలనం
ఆ తర్వాత రెండో భాగాన్ని తెరకెక్కించాలని ఫిక్స్ అయిన నెల్సన్ పని మొదలుపెట్టాడు. జైలర్ ఫస్ట్ పార్ట్ కంటే మరింత గ్రాండ్‌గా జైలర్ 2ను తీసి ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేశాడు. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. నెల రోజులు దాటినా థియేటర్లలో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
బాక్సాఫీస్ విన్నర్
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ రికార్డులు సృష్టిస్తోంది. తమిళ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా జైలర్ 2 నిలిచింది. జైలర్ 2 మూవీ ప్రస్తుతం రూ.830 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతోంది. జైలర్ రెండు భాగాలు కలిపి మొత్తం రూ.1400 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. అయినప్పటికీ తమిళ సినిమా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 1000 కోట్ల కలెక్షన్ల కల ఇంకా నెరవేరలేదు.
జైలర్ 2 నటుడి మాస్టర్ స్ట్రోక్
ఇక జైలర్ 2 సక్సెస్‌లో రజనీతో పాటు నటించిన ఇతర యాక్టర్ల పాత్ర కూడా ఎంతో ఉంది. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఇందులో రజనీకాంత్‌కు స్నేహితులుగా కనిపించారు. వీరిలో జాకీ ష్రాఫ్ ఒక మాస్టర్ మైండ్ వేశాడు. అది సినిమాల్లో కాదు, బిజినెస్‌లో. ఆయన 1995లో పెట్టిన 1 లక్ష రూపాయల పెట్టుబడి 2012 నాటికి రూ.100 కోట్లుగా తిరిగి వచ్చింది.
జాకీ ష్రాఫ్ 100 కోట్లు ఎలా సంపాదించాడు?
1995లో సోనీ టీవీని ప్రారంభించినప్పుడు అందులో జాకీ ష్రాఫ్‌తో పాటు పలువురు పెట్టుబడి పెట్టారు. అప్పుడు జాకీ ష్రాఫ్ పెట్టింది కేవలం లక్ష రూపాయలు మాత్రమే. ఆ తర్వాత 2012లో సోనీ టీవీ తమ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారి షేర్లను మొత్తం కొనేసింది. అలా తన షేర్లను అమ్మినప్పుడు జాకీ ష్రాఫ్‌కు ఏకంగా 100 కోట్ల రూపాయలు వచ్చాయి. ఒక లక్ష రూపాయలు పెట్టి వంద కోట్లు సంపాదించిన అతని పెట్టుబడిని ఇప్పుడు ఒక మాస్టర్ స్ట్రోక్‌గా చెబుతున్నారు.









