- Home
- Entertainment
- Suman: చిరంజీవి, బాలకృష్ణల మధ్య గొడవలు నిజమేనా? సుమన్ వెల్లడించిన అసలు నిజాలేంటి?
Suman: చిరంజీవి, బాలకృష్ణల మధ్య గొడవలు నిజమేనా? సుమన్ వెల్లడించిన అసలు నిజాలేంటి?
Suman: మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ మధ్య నిజంగానే గొడవలు ఉన్నాయా? చిరుని పొగిడితే బాలయ్యకు కోపం వస్తుందా? ఈ విషయంలో అసలు నిజాలు ఏంటి? ఇద్దరి వ్యక్తిత్వాల గురించి మరో హీరో సుమన్ ఏమన్నారు? అసలు నిజాలేంటి.

దశాబ్దాలుగా బాక్సాఫీస్ పోటీ..
తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు. వీరి సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే.. బాక్సాఫీస్ లు బ్లాస్ట్ అవ్వాల్సిందే. ఈ ఇద్దరు హీరోల సినిమాల మధ్య దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో తగ్గింది కానీ.. ఒప్పుడు పోటీ గట్టిగా ఉండేది. కానీ ఆ పోటీ సినిమాల వరకే నడిచేది. పర్సనల్ గా హీరోలంతా మంచి అనుబంధం కలిగి ఉండేవారు.
అయితే చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేరని, పైకి కలిసే ఉన్నా లోపల పడదని బయట రకరకాల కథనాలు వినిపిస్తుంటాయి. దానికి తగ్గట్టే ఇటీవల జరిగిన ఓ వివాదం నేపథ్యంలో ఈ అంశంపై చాలా మంది తమ ఇష్టం వచ్చినట్టు రాశారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై మరో హీరో సుమన్ క్లారిటీ ఇచ్చారు. “చిరంజీవిని పొగిడితే బాలకృష్ణకి ఎందుకు నచ్చదు.. ఇద్దరి మధ్య ఉన్న అసలు రాపో గురించి సుమన్ తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.
బాలకృష్ణ, చిరంజీవి వ్యక్తిత్వాల్లో తేడా
ఇద్దరినీ దగ్గరగా, ఎక్కువ కాలం చూసిన అనుభవంతో సుమన్ మాట్లాడుతూ, ప్రతి మనిషి క్యారెక్టర్ భిన్నంగా ఉంటుంది, ఒకరిని ఇంకొకరితో పోల్చకూడదనే విషయం ముందుగా అర్థం చేసుకోవాలని సుమన్ అన్నారుడు. బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని వివరిస్తూ, ఆయన సాధారణంగా మంచికి మంచి, చెడుకు చెడుగా వ్యవహరిస్తారని అన్నాడు.
బాలయ్య కొంచెం షార్ట్ టెంపర్డ్.. ఆ విషయంలో చాలా కారణాలు ఉన్నాయి.. ఆయనపై చాలా బాధ్యతలున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేగా, మరోవైపు నటుడిగా, ఇంకోవైపు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్‌గా ఇలా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారని, బయటకు తెలియని ఇతర వ్యాపారాలు, బాధ్యతలు కూడా ఉండవచ్చని సుమన్ అన్నాడు.
మరోవైపు చిరంజీవి స్వభావం గురించి చెబుతూ, ఆయన సాధారణంగా కొంచెం సాఫ్ట్‌గా ఉంటారు. చిరాకు కలిగించే పరిస్థితి ఎదురైనా దాన్ని బయటకు ఎక్స్పోజ్ చేయకుండా కంట్రోల్ చేసుకునే తత్వం చిరంజీవిదని సుమన్ వివరించారు.
అసలు వివాదాల సంగతేంటి?
చిరు బాలయ్య ఇద్దరి మధ్య సమస్యలు ఎక్కడ తలెత్తుతాయనే విషయంపై సుమన్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ప్రకటనల వల్లే ఇలాంటి వివాదాలకు దారి తీస్తాయని సుమన్ అన్నారు. వాగ్వాదాలు జరిగినప్పుడు ఆవేశంతో, టెంపరమెంట్‌తో నోరు జారడం సహజమేనని, కానీ తన లెక్కలో అదంతా ఆ క్షణం వరకే పరిమితమని అన్నారు. అయితే హీరోలు ఎవరు ఎదురెదురుగా నిలబడి తిట్టుకోరు. వాళ్లు బాగానే ఉంటారు. కానీ అభిమానులు, కింద స్థాయి నేతలు మాత్రమే వారిపై అభిమానంతో గొడవలు పడుతుంటారని సుమన్ అన్నారు.
అభిమానుల మధ్య గొడవలు ఎందుకు?
అసలు సమస్య అభిమానుల విషయంలోనే కనిపిస్తోందని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. నటీనటులంతా బాగానే ఉన్నా, బయట అభిమానులు కొట్టుకోవడం, రాళ్లు విసురుకోవడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటివి చేయడం వృథా అని అన్నారు. హీరోలంతా బాగానే కలిసి మెలిసి మాట్లాడుకుంటుంటే.. అభిమానులు మాత్రం ఎందుకు గొడవ పడాలని ఆయన ప్రశ్నించారు.
తామంతా ఒకే గ్రూపులో సంతోషంగా ఉంటామని, వాట్సాప్ గ్రూప్‌లో రోజూ మాట్లాడుకుంటూ, శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఫోటోలు పంపుకుంటూ ఆత్మీయంగా మెలుగుతామని సుమన్ వెల్లడించారు. అమాయకులైన అభిమానులు మాత్రమే ఈ గొడవల్లో చిక్కుకుంటున్నారని, నటీనటుల మధ్య ఎలాంటి వైరం లేదని, రాజకీయాల్లోలాగే ఇక్కడ కూడా శాశ్వత మిత్రులు గానీ, శాశ్వత శత్రువులు గానీ ఉండరని ఆయన స్పష్టం చేశారు.









