Akhanda 2 Release ఆగిపోవడానికి అసలు కారణం ఇదే ? బాలయ్య నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు?
Akhanda 2 Release : నందమూరి అభిమానులకు షాక్ ఇస్తూ.. అఖండ2 రిలీజ్ ఆగిపోయింది. బాలయ్య సినిమా కోసం ఎదురు చూసిన అభిమానుకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. ఇంతకీ అఖండా2 రిలీజ్ ఆగిపోవడానికి కారణం ఏంటి? మళ్లీ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది?

అఖండ సినిమాపై భారీ అంచనాలు
వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ.. అఖండ 2 సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని అనుకున్నారు. ఈ సినిమా రిలీజ్ పై భారీగా ఆశలు పెట్టుకున్న అభిమానులు.. బాలయ్య కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ ఆగిపోవడం అందరికి షాక్ తగిలినట్టు అయ్యింది. ఇంతకీ బాలకృష్ణ సినిమా ఎందుకు ఆగిపోయింది. కారణం ఏంటి?
ఒక్క టికెట్ లక్షలు పెట్టి కొన్న అభిమాని
డిసెంబర్ 5వ న ప్రపంచ వ్యాప్తంగా అఖండ 2 రిలీజ్ అని అనౌన్స్ చేశారు. అభిమానులు ఉత్సాహంతో రెచ్చిపోయారు. బాలయ్య మీద ప్రేమను రకరకాల రూపాల్లో వెల్లడించారు. ఒక అభిమాని అయితే అఖండ2 మూవీ టికెట్ ను ఏకంగా 2 లక్షలు పెట్టి కొన్నాడు. భారీ ఎత్తున రిలీజ్ కోసం.. థియేటర్లను అలంకరించారు.. తెరపై బాలయ్య అఖండ తాండవం చేస్తే.. థియేటర్ బయట అభిమానుల మాస్ డ్యాన్స్ కు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. కానీ రిలీజ్ ఆగిపోయిందన్న వార్త వారిని షాక్ కు గురయ్యేలా చేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఏర్పడింది.
అఖండ2 రిలీజ్ వాయిదాకు కారణాలు?
అఖండ2 రిలీజ్ వాయిదా పడటానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈసినిమా టెక్నికల్ సమస్యల వల్ల రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రచారం జరగింది. ఇండియాతో పాటు ఓవర్సిస్ లో కూడా అఖండ2 రిలీజ్ ఆగిపోవడంతో...బుకింగ్స్ చేసుకున్నవారికి డబ్బులు కూడా తిరిగి ఇచ్చేశారు. అయితే అఖండ2 రిలీజ్ ఆగిపోవడానికి అసలు కారణం టెక్నికల్ సమస్య కాదని తెలుస్తోంది. ఈసినిమా నిర్మాతలపైన మద్రాస్ హైకోర్ట్ లో వేసిన కేసు మూలంగానే.. బాలయ్య సినిమా రిలీజ్ ఆగిపోయింది. మరో నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషన్ తో 14 రీల్స్ కు ఉన్న వివాదాలే దీనికి కారణం అని తెలుస్తోంది.
14 రీల్స్ - ఎరోస్ కు మధ్య గొడవలు
గతంలో 14 రీల్స్ తో పాటు ఎరోస్ సంస్థ కలిసి మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే, ఆగడు లాంటి సినిమాలు నిర్మించారు. ఈ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో వారికి తీవ్రంగా నష్టం వచ్చింది. అయితే ఈ రెండు సంస్థల మధ్య ఆర్ధిక లావాదేవీల విషయంలో వివాదం నడుస్తోంది. ఎరోస్ కు 14 రీల్స్ నిర్మాతలు 27 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది. కొంత మంది వాదన ప్రకారం 70 కోట్ల వరకూ చెల్లింపులు జరగాల్సి ఉందని కూడా తెలుస్తోంది. అయితే ఆర్ధిక లావాదేవిలు ఎంత అనేది అఫీషియల్ గా తెలియదు... కానీ ఈ నిర్మాతలు 14 రీల్స్ బదులుగా 14 రీల్స్ ప్లస్ అనే మరో బ్యానర్ లో అఖండ2 ను నిర్మించి రిలీజ్ కు రెడీ అయ్యారు. ఇక ఇంత కాలం కామ్ గా ఉన్న ఏరోస్, సరిగ్గా రిలీజ్ టైమ్ చూసుకుని మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది . దాంతో అఖండ2 రిలీజ్ ఆగిపోయింది. ఈ మధ్యలో 14 రీల్స్ నిర్మాతలైన రామ్ ఆచంట, గోపీ ఆచంటలు చర్చలు జరిపినా.. లాభం లేకుండా పోయింది.
సోషల్ మీడియాలో 14 రీల్స్ పోస్ట్
అఖండ2 వాయిదాపై ఎక్స్ లో నిర్మాణ సంస్థ ఓ ప్రకటన కూడా రిలీజ్ చేసింది. భారమైన హృదయంతో అఖండ 2 సినిమా వాయిదా వేశామని తెలియచేయడానికి చింతిస్తున్నాం. కొన్ని సమస్యలు పరిష్కరించలేని పరిస్థితులు ఏర్పడ్డ కారణంగా ఈ సినిమాను అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయలేకపోతున్నాం. ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రతీ ఒక్కఅభిమానికి అఖండ వాయిదా వేయడం తీవ్ర నిరాశను కలిగించి ఉంటుంది. వారి పరిస్థితిని మేము అర్ధం చేసుకోగలం. ఈ సినిమా చూట్టు నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతీక్షణం ప్రయత్నిస్తూనే ఉన్నాం. అభిమానులకు మా వల్ల కలిగిన ఈ అసౌకర్యానికి చాలా బాధపడుతూ.. క్షమాపణలు అడుగుతున్నాం.. ఈ పరిస్థితుల్లో మీ సహకారం మాకు ఎంతో అవసరం. అదే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అన్ని సమస్యలు పరిక్షరించి.. త్వరలోనే అఖండ2 రిలీజ్ పై పాజిటీవ్ అప్ డేట్ ను అందిస్తాం అని 14 రీల్స్ ప్లస్ ట్వీట్ చేశారు.
అఖండ2 రిలీజ్ ఎప్పుడు?
అఖండ2 రిలీజ్ ఆగిపోయింది. మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అనే సమాచారం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వివాదంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. బాలయ్య కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఒక వేళ చర్చలు ఫలించి వివాదం క్లియర్ అయితే.. ఈసినిమాను రేపు(06 డిసెంబర్) రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. కుదరకపోతే మాత్రం డిసెంబర్ 16న కానీ.. 23 న కానీ అఖండ2 రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఈ డేట్స్ కుదరకపోతే మళ్లీ జనవరి చివరి వారంలో అఖండా 2ను తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నారట. మరి ఈ వివాదానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి.

