MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Giri Babu: 40 రూపాయల రూమ్ రెంట్, స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తూ.. గిరిబాబుతో కలిసున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

Giri Babu: 40 రూపాయల రూమ్ రెంట్, స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తూ.. గిరిబాబుతో కలిసున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

Giri Babu: ఒకప్పుడు సినిమాల కోసం మద్రాస్ వెళ్లి నెలకు 40 రూపాలయ రెంట్ కడుతూ.. అవకాశాల కోసం ప్రయత్నం చేశారట నటుడు గిరిబాబు. ఆయనతో పాటు 20 రూపాయలు ఇచ్చి రూమ్ షేర్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 24 2026, 07:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్..
Image Credit : Giri Babu\Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్..

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ నటులు కలిసి ప్రయాణం చేశారు. కెరీర్ బిగినింగ్ లో కలిసి మెలిసి ఉన్నారు. ఒకటే రూమ్, ఒకటే కాలేజ్, ఒక్కటిగా ఉండి.. అందులో ఎవరో ఒకరు స్టార్ డమ్ సాధించిన వారు ఉన్నారు. చిరంజీవి, కమెడియన్ సుధాకర్ రూమ్ మెంట్స్, మోహన్ బాబు, రజినీకాంత్ కూడా రూమ్మెంట్స్.. అంతకు మించిన స్నేహితులు. సునిల్, త్రివిక్రమ్ ఇలా చెప్పుకుంటూపోతే.. చాలామంది స్టార్స్ కలిసి ఒక దగ్గర ఉండి ఇండస్ట్రీలో నిలబడ్డారు. ఈక్రమంలోనే క్యారెక్టర్ ఆర్టిస్, విలన్, కమెడియన్ గా వందల సినిమాల్లో నటించిన గిరిబాబు తో ఓ స్టార్ హీరో కలిసి ఒకే రూమలో ఉన్నాడని తెలుసా? ఆ హీరో ఎవరో కాదు డైలాగ్ కింగ్ మోహన్ బాబు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
40 రూపాయల రూమ్ రెంట్ నుంచి
Image Credit : Asianet News

40 రూపాయల రూమ్ రెంట్ నుంచి

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులు గిరిబాబు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఒక ఇంటర్వ్యూలో గిరిబాబు తమ స్నేహం గురించి, కెరీర్ బిగినింగ్ లో పడిన సినిమా కష్టాల గురించి, ప్రత్యేకంగా రూమ్ షేరింగ్, మోహన్ బాబుతో స్నేహం, మోహన్ బాబు ఎలా ఉండేవారు అనే విషయాలను, అనుభవాలను గురించి వెల్లడించారు. 1969 ప్రాంతంలో గిరిబాబు, మోహన్ బాబు ఇద్దరూ మద్రాస్‌లో చెరో రూ. 20 భరించి, నెలకు రూ. 40 అద్దె ఉండే ఒక చిన్న గదిలో కలిసి ఉండేవారు.

36
డ్రిల్ మాస్టార్ గా పనిచేసిన మోహన్ బాబు..
Image Credit : facebook.com/TheMohanBabu

డ్రిల్ మాస్టార్ గా పనిచేసిన మోహన్ బాబు..

గిరిబాబుకు రూమ్ లో ఉన్న టైమ్ లో.. ఆయనకు ఇంటి నుంచి డబ్బులు వచ్చేవి. వాటితో సినిమా అవకాశాలు చూసుకునేవారు. కానీ ఆ సమయంలో మోహన్ బాబు మాత్రం డబ్బుల కోసం ఇబ్బంది పడేవారు. దాంతో ఆయన సర్వేవ్ అవ్వడానికి రకరకాల పనులు చేసేవారు. 'వై.ఎం.సి.ఏ. హైస్కూల్' లో డ్రిల్ మాస్టర్ (P.E.T)గా పనిచేసేవారు మోహన్ బాబు. మరోవైపు నటుడిగా ఎదగాలనే బలమైన కోరికతో.. గిరిబాబు అవకాశాల కోసం ప్రయత్నిస్తుండేవారు. ప్రారంభంలో కొన్ని సినిమాలు ఆగిపోయినా, ఆయన కష్టపడటం మానలేదు.

46
మోహన్ బాబు నటనపై గిరిబాబు కామెంట్స్..
Image Credit : Asianet News

మోహన్ బాబు నటనపై గిరిబాబు కామెంట్స్..

గదిలో ఉన్న సమయంలో మోహన్ బాబు నటుడవాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ, దుర్యోధనుడి వంటి పాత్రల డైలాగ్‌లను గొప్పగా చెప్పేవారని గిరిబాబు గుర్తుచేసుకున్నారు. మోహన్ బాబు డైలాగ్ డెలివరీని చూసి గిరిబాబు ఎంతో మెచ్చుకునేవారు. "నువ్వు చాలా బాగా డైలాగ్స్ చెప్తున్నావురా… మంచి ముక్కు మొహం ఉంది, కొంచెం బాడీ పెంచి కండలు పెంచితే నటుడిగా బ్రహ్మాండంగా ఉంటావు" అని మోహన్ బాబుకు ధైర్యాన్ని, సలహాలను ఇచ్చేవారని తెలిపారు.

56
మోహన్ బాబు సినీ ప్రస్థానం....
Image Credit : Asianet News

మోహన్ బాబు సినీ ప్రస్థానం....

అవకాశాల కోసం వెతుకుతూ.. మోహన్ బాబు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ఆతరువాత కొంత కాలానికి 1975లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'స్వర్గం నరకం' సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. గిరిబాబు అంతకుముందే 1973లో 'జగమేమాయ'తో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఇద్దరూ టాలీవుడ్‌లో పోటాపోటీగా విలన్ పాత్రలు చేస్తూ ఎంతో బిజీ ఆర్టిస్టులుగా మారారు. అంతే కాదు ఇద్దరూ హీరోలుగానూ, ఆపై సొంత బ్యానర్లు స్థాపించి నిర్మాతలుగానూ విజయవంతమయ్యారు.

66
గిరిబాబు ఆల్ రౌండర్ ప్రయాణం
Image Credit : Giri Babu\Instagram

గిరిబాబు ఆల్ రౌండర్ ప్రయాణం

ఇద్దరి ప్రయాణాన్ని పోల్చుతూ గిరిబాబు ఒక ఆసక్తికరమైన తేడాను చెప్పారు. మోహన్ బాబు కేవలం నటన నిర్మాణానికే పరిమితమై, దాదాపు 55కు పైగా చిత్రాలను నిర్మించారు. అయితే తాను మాత్రం చిత్రసీమలో ఒక "ఆల్ రౌండర్"గా మారానని గిరిబాబు అన్నరు. ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా చేస్తూనే.. కథలు రాయడం, దర్శకత్వం వహించడం , సొంతంగా సినిమాలు నిర్మించడం వంటి పలు విభాగాల్లో పనిచేశారు. ఏమీ లేని స్థితిలో రూ. 40 అద్దె గది నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి, టాలీవుడ్‌లో అగ్ర నటులుగా స్థిరపడటం చాలా తక్కువమందికే సాధ్యమైన విషయం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మంచు మోహన్ బాబు
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Paradise Movie Review: ప్యారడైజ్‌ మూవీ రివ్యూ.. నాని విశ్వరూపం ఓకే.. కానీ అసలు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Varshini: నరేష్ ని పొట్టోడు అనొద్దు, అది కూడా సమస్యే అతడికి.. ఆడదానితో ఆడి గెలిచి ఏం రచ్చ చేస్తున్నారో చూడు
Recommended image3
Sobhita Dhulipala: అద్దం ముందు శోభిత ఫోజులు.. రెడ్ రోజ్ లుక్‌లో గ్లామర్ ట్రీట్!
Related Stories
Recommended image1
Prabhas: కాకులు దూరని కారడివిలో నాటు కోడి కావాలని ప్రభాస్ డిమాండ్, అర్ధరాత్రి ఫారెస్ట్ లో కోళ్లను వేటాడిన నటుడు ఎవరు?
Recommended image2
Paradise Review: ది ప్యారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ.. నాని సినిమాలో హైలెట్స్ ఇవే, మైనస్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved