- Home
- Entertainment
- Varshini: నరేష్ ని పొట్టోడు అనొద్దు, అది కూడా సమస్యే అతడికి.. ఆడదానితో ఆడి గెలిచి ఏం రచ్చ చేస్తున్నారో చూడు
Varshini: నరేష్ ని పొట్టోడు అనొద్దు, అది కూడా సమస్యే అతడికి.. ఆడదానితో ఆడి గెలిచి ఏం రచ్చ చేస్తున్నారో చూడు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో డే 17న కొన్ని ఆసక్తికర పరిణామాలు, టాస్కులు జరిగాయి. ఒకరిపై ఒకరు ఊహించని కామెంట్స్ చేసుకున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Bigg Boss Telugu 10
బిగ్ బాస్ తెలుగు 10లో 17 వ రోజు జరిగిన టాస్కులు ఆసక్తికరంగా సాగాయి. రోహిత్, త్రిగున్ టెంప్టేషన్ లో భాగంగా కెప్టెన్సీ కంటెండర్స్ గా అవకాశం కోల్పోయారు. అదే విధంగా వర్షిణి, అమన్ మధ్య.. సుధీర్, సృష్టి మధ్య కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లు జరిగాయి.
నరేష్ ని పొట్టోడు అని పిలవొద్దు
ముందుగా దేబ్జానీ, నరేష్, రామ్ ప్రసాద్ మధ్య ఫన్నీగా సంభాషణ జరిగింది. త్రిగున్ మాట్లాడుతూ ఝాన్సీ కెప్టెన్ గా కొన్ని విషయాల్లో పక్షపాతధోరణి తో ఉంటోంది అని కామెంట్స్ చేశారు. నరేష్ తనకి ఉన్న బలహీనతని కూడా అధికమించి ఈ స్థాయికి చేరుకున్నాడు. అతడు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. అలాంటి నరేష్ కొంత మంది హౌస్ లో పొట్టోడు అని పిలుస్తున్నారు అంటూ త్రిగున్ తెలిపారు.
త్రిగుణ్ కి అది కూడా సమస్యే
ఆ విషయం రామ్ ప్రసాద్ కి తెలిసింది. దేబ్జానీ, వర్షిణి కూడా అక్కడే ఉన్నారు. నరేష్ ని ఇంకెవ్వరూ పొట్టోడు అని పిలవొద్దు. త్రిగున్ అది కూడా పట్టుకుంటున్నాడు అని రామ్ ప్రసాద్ అన్నారు. వర్షిణి స్పందిస్తూ మనం ప్రేమగా అలా పిలుచుకుంటున్నాం. ప్రేమగా పిలవడానికి, అవమానించడానికి తేడా ఉంది కదా అని వర్షిణి పేర్కొంది. ఆ తర్వాత జరిగిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో వర్షిణి, అమన్ పాల్గొన్నారు. టాస్క్ ప్రకారం వారిద్దరూ స్విమింగ్ పూల్ లోకి దూకి అక్కడ కొన్ని బ్యాగ్స్ తీసుకుని బిగ్ బాస్ చెప్పినట్లు ఆల్రెడీ అమర్చిన బ్రాంచెస్ పై విసరాలి.
కష్టపడిన వర్షిణి, కానీ
ఎవరు ఎక్కువ బ్యాగ్స్ విసిరితే వాళ్లే విజేతలు. బ్యాగ్స్ విసిరే క్రమంలో వర్షిణి, అమన్ ఫిజికల్ అయ్యారు. వర్షిణి.. అమన్ టీ షర్ట్ పట్టుకుని లాగగా.. అమన్ ఆమెని రెండు చేతులతో కౌగిలించుకున్నట్లు బంధించాడు. మొత్తానికి టాస్క్ లో అమన్ విజయం సాధించాడు. టెంప్టేషన్ టెన్షన్ లో భాగంగా అమన్.. రోహిత్ కి టెన్షన్ ఇచ్చి కెప్టెన్సీ కంటెండర్స్ రేసు నుంచి తప్పించారు. అమన్ విజయం గురించి కొంత మంది చర్చ పెట్టారు. అమన్ కావాలని వర్షిణిని బంధించలేదు అని.. ఆమె కూడా ముందు ఫిజికల్ అయింది అని త్రిగున్ రోహిత్ మరికొందరు మాట్లాడుకున్నారు.
ఆడదానితో గెలిచి రచ్చ చేస్తున్నారు
వాళ్ళని చూసిన వర్షిణి.. ఒక ఆడదానితో గెలిచి ఏం రచ్చ చేస్తున్నారో చూడు అంటూ కామెంట్ చేసింది. ఆ తర్వాత టాస్క్ సుధీర్, సృష్టి మధ్య జరిగింది. ఈ టాస్క్ లో సృష్టి విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచింది. టెన్షన్ టెంప్టేషన్ లో భాగంగా ఆమె త్రిగున్ కి టెన్షన్ ఇచ్చి అతడిని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించింది.

