MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: మేనేజర్, జ్యో కుట్ర- దీప బలి- శివన్నారాయణ ఫైర్- దీపకు మరో ఛాన్స్

Karthika Deepam 2 Today Episode: మేనేజర్, జ్యో కుట్ర- దీప బలి- శివన్నారాయణ ఫైర్- దీపకు మరో ఛాన్స్

Karthika Deepam 2 Today Episode (జూన్ 2వ తేదీ)లో మేనేజర్ తో కలిసి కుట్ర చేసిన జ్యో. పెద్ద ఆర్డర్ ని రిజెక్ట్ చేసిన దీప. ఆఫీసు నుంచి వెళ్లిపోమన్న శివన్నారాయణ. మరో అవకాశం ఇవ్వమన్న దీప. సూరజ్ సాయం కోరిన దీప. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే...  

3 Min read
Author : Kavitha G
Published : Jun 02 2026, 09:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో చిరాకుగా ఆఫీసుకు వస్తుంది జ్యోత్స్న. వెనకాలే వస్తారు దీప, కార్తీక్. మేడం చల్లగా జ్యూస్ పంపించమంటారా అని జ్యోత్స్నను అడుగుతాడు మేనేజర్ వంశీ. సూరజ్ స్టాల్లో జరిగిన అవమానం గుర్తుచేసుకొని జ్యూస్ అనగానే మేనేజర్ పై మండిపడతుంది జ్యోత్స్న. కార్తీక్ కాసేపు ఆటపట్టిస్తాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఆర్డర్ రిజెక్ట్ చేసిన దీప
Image Credit : Jiohotstar

ఆర్డర్ రిజెక్ట్ చేసిన దీప

ఆ తర్వాత దీపకు మెయిల్ వస్తుంది. మేనేజర్ ని పిలిచి చదవమని అడిగితే.. 350 మందికి రోజూ లంచ్ ఆర్డర్ కావాలట. కానీ ప్లేటు రూ.60కే ఇవ్వాలని అడుగుతున్నారని చెప్తాడు మేనేజర్. రూ.60కే క్వాలిటీ ఫుడ్ ఎలా ఇస్తాం. ఇవ్వలేము.. నో చెప్పమంటుంది దీప.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:సూరజ్ స్టాల్లో జ్యూస్ లు అమ్మిన జ్యో-శివన్నారాయణ బాధ-సూరజ్ వార్నింగ్
Related image2
Karthika Deepam 2 Today Episode:జ్యోతో ఆడుకున్న కార్తీక్, సూరజ్-జ్యోని CEOగా పనికిరావన్న శివన్నారాయణ
37
శివన్నారాయణ ఫైర్
Image Credit : Jiohotstar

శివన్నారాయణ ఫైర్

అప్పుడే శివన్నారాయణకు ఫోన్ వస్తుంది. అవునా అని సీరియస్ గా ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే దీప, జ్యోత్స్న, కార్తీక్, మేనేజర్ లను తన దగ్గరకు పిలుస్తాడు. శాండల్ వుడ్ మీడియా నుంచి వచ్చిన ఆర్డర్ ని ఎవరు రిజెక్ట్ చేశారు అని అడుగుతాడు శివన్నారాయణ. దీప మేడం చెప్తే నేనే నాట్ ఇంట్రెస్టెడ్ అని రిప్లై ఇచ్చాను అని చెప్తాడు మేనేజర్. అతని చెంప చెల్లుమనిపిస్తాడు శివన్నారాయణ.

మీరు కంపెనీని బాగు చేయడానికి ఉన్నారా? లేదా నాశనం చేయడానికా? శాండల్ వుడ్ మీడియా ఎంత పెద్ద కంపెనీయో మీకు తెలియదా? అలాంటి పెద్ద ఆర్డర్ వస్తే ఎలా రిజెక్ట్ చేస్తారు అని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. దీప మేడం చెప్పిందే నేను చేశాను అంటాడు మేనేజర్. అవును నేనే వద్దు అన్నాను అంటుంది దీప. రూ. 60కే ప్లేటు మీల్స్ అడిగారు. నాణ్యత లేకపోయినా పర్వాలేదన్నారట. అలా ఎలా ఇస్తాం అందుకే వద్దు అన్నాను అని చెప్తుంది దీప.

47
మేనేజర్, జ్యో కుట్ర
Image Credit : Jiohotstar

మేనేజర్, జ్యో కుట్ర

రూ. 60 కే ఎందుకు అడుగుతారు అంటాడు శివన్నారాయణ. నా దగ్గర సాక్ష్యం కూడా ఉందని వాళ్లు పంపించిన మెయిల్ చూపిస్తుంది దీప. అందులో 160 ప్లేటు ఉంటుంది. మేనేజర్ చదివి రూ.60 ఉందని చెప్పాడు అంటుంది దీప. నేనేందుకు అలా చెప్తాను. నేను 160 అని చెప్తే ప్లేట్ రూ.200 అంటేనే ఆర్డర్ చేయమని దీప మేడం చెప్పారు అని అబద్ధం చెప్తాడు మేనేజర్. దీప కోపంగా మేనేజర్ కాలర్ పట్టుకుంటే, దీపను నెట్టేస్తుంది జ్యోత్స్న.

మీరంతా బాగానే ఉన్నారు. మీ వల్ల నష్టం జరిగింది నాకు. జ్యోత్స్న రెస్టారెంట్స్ కి. అయినా రూ. 60 కి ప్లేటు అడిగినప్పుడు ఎందుకు అడుగుతున్నారో అనే డౌట్ నీకు రావాలి కదా.. మిమ్మల్ని అడగాలి కదా.. అని దీపపై ఫైర్ అవుతాడు శివన్నారాయణ.

57
దశరథ సలహా
Image Credit : Jiohotstar

దశరథ సలహా

జ్యోత్స్న, మేనేజర్ వంశీ సైగ చేసుకోవడం చూసి ఇదంతా జ్యోత్స్న కుట్రే అని అర్థం చేసుకుంటాడు కార్తీక్. ఇంత పెద్ద తప్పు చేసిన దీపకు సీఈఓగా ఉండే అర్హత లేదు అంటుంది జ్యోత్స్న. నిజమే అంటాడు శివన్నారాయణ. మరొక అవకాశం ఇవ్వమని వేడుకుంటుంది దీప. సరే అంటాడు శివన్నారాయణ.

ఇదంతా జ్యోత్స్న, మేనేజర్ తో కలిసి ఆడించిన నాటకమని దశరథ, కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. నువ్వు ఒక నమ్మకమైన వ్యక్తిని పెట్టుకో, తనతో కలిసి పనిచేయమని దీపకు సలహా ఇస్తాడు దశరథ.

67
జ్యో, పారు సంతోషం
Image Credit : Jiohotstar

జ్యో, పారు సంతోషం

మరోవైపు జ్యోత్స్న, పారిజాతం ఆఫీసులో జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు. పారిజాతం మనుమరాలి దెబ్బకు, శివన్నారాయణ మనుమరాలు ఓడిపోయిందన్న మాట అంటుంది పారు. మరి కార్తీక్ గాడు ఏం చేయలేదా అంటుంది పారు. బావ కాళ్లు చేతులు కట్టేసి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను కదా అంటుంది జ్యోత్స్న. కానీ నోరు కట్టేయలేదు కదా అనుకుంటూ వస్తాడు కార్తీక్. షాక్ అవుతారు పారు, జ్యోత్స్న.

చదువురాని వాళ్లకు సీఈఓ పోస్టు అవసరమా అన్నట్లు మాట్లాడుతుంది పారు. దీప ఓటమి ఒప్పుకోదు కదా.. యుద్ధం గెలవడానికి ఆయుధం తెచ్చుకోవడానికి వెళ్లింది అని చెప్తాడు కార్తీక్. అంటే దీప ఏదో ప్లాన్ చేస్తోంది.. తెలుసుకోవాలి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్యోత్స్న.

77
సూరజ్ సాయం కోరిన దీప
Image Credit : Jiohotstar

సూరజ్ సాయం కోరిన దీప

మరోవైపు సూరజ్ దగ్గరికి వెళ్లి తనకు సాయం చేయమని అడుగుతుంది దీప. నేను ఒకరి కింద పనిచేయను అని చెప్తాడు సూరజ్. నాతో కలిసి పని చేయండి అని అడుగుతుంది దీప. ఇది రెండు వారాల పోటీ మాత్రమే. మీకు నచ్చకపోతే వెళ్లిపోవచ్చు. నేను ఎవ్వరిని నమ్మే పరిస్థితిలో లేను. నాకు మీ సాయం కావాలి అని అడిగితే సున్నితంగా రిజెక్ట్ చేస్తాడు సూరజ్. 

దీప, సూరజ్ లను జ్యోత్స్న చూస్తుంది. సూరజ్ ని కలిసి తప్పు చేశావ్ దీప అని మనసులో అనుకుంటుంది. వీడు నా ఈగో మీద దెబ్బ కొట్టాడు. నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు అని అంటుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:సూరజ్ స్టాల్లో జ్యూస్ లు అమ్మిన జ్యో-శివన్నారాయణ బాధ-సూరజ్ వార్నింగ్
Recommended image2
Karthika Deepam 2 Today Episode:జ్యోతో ఆడుకున్న కార్తీక్, సూరజ్-జ్యోని CEOగా పనికిరావన్న శివన్నారాయణ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved