MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విన్నర్‌.. ఎవరీ జ్యోతిర్మయి నాయక్? ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విన్నర్‌.. ఎవరీ జ్యోతిర్మయి నాయక్? ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Indian Idol 16 Winner: 10 నెలల జర్నీ.. కోట్లాది మంది హృదయాలు గెలిచిన ఒడిషా సింగర్ జ్యోతిర్మయి.. ఇండియన్ ఐడల్ 16 టైటిల్‌ను సాధించింది. జ్యోతిర్మయి నాయక్ ఎంత ప్రైజ్ మనీ అందుకుందో తెలుసా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 27 2026, 07:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
10 నెలల పోరాటం.. ఇండియన్ ఐడల్ 16 కింగ్ జ్యోతిర్మయి
Image Credit : Instagram/jyotirmayeenayak_official18

10 నెలల పోరాటం.. ఇండియన్ ఐడల్ 16 కింగ్ జ్యోతిర్మయి

బుల్లితెరపై ఎంతో పాపులర్ అయిన సింగింగ్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్ సీసన్ 16' విజేత ఎవరో తెలిసిపోయింది. సుదీర్ఘంగా 10 నెలల పాటు సాగిన ఈ పోటీలో ఒడిషాకు చెందిన 24 ఏళ్ల జ్యోతిర్మయి నాయక్ విజేతగా నిలిచారు. గ్రాండ్ ఫినాలేలో తన అద్భుతమైన పాటలతో అందరినీ ఆకట్టుకుని 'ఇండియన్ ఐడల్ 16' ట్రోఫీని ముద్దాడారు.

విజేతగా నిలిచిన ఆమెకు ట్రోఫీతో పాటు రూ. 20 లక్షల నగదు బహుమతి లభించింది. జబల్‌పూర్ ప్రాంతానికి చెందిన తనిష్క్ శుక్లా రన్నరప్‌గా నిలిచారు. ఈ షోకు శ్రేయా ఘోషాల్, విశాల్ దాద్లానీ, బాద్‌షా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈసారి ‘యాదోంకీ ప్లేలిస్ట్’ అనే థీమ్‌తో వచ్చిన ఈ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మ్యూజిక్ థెరపీతో హీలింగ్.. క్యాన్సర్ పేషెంట్లకు క్రెడిట్
Image Credit : Instagram/jyotirmayeenayak_official18

మ్యూజిక్ థెరపీతో హీలింగ్.. క్యాన్సర్ పేషెంట్లకు క్రెడిట్

ఒడిషాలోని నీలగిరి బ్లాక్ బాఉన్సనాల్ గ్రామానికి చెందిన జ్యోతిర్మయి కెఐఐటి (KIIT) యూనివర్సిటీ నుంచి బి.టెక్ పూర్తి చేశారు. వృత్తిరీత్యా ఆమె ఒక క్వాలిఫైడ్ మ్యూజిక్ థెరపిస్ట్. తన సంగీతంతో క్యాన్సర్ బాధితులకు, గర్భిణులకు ఉపశమనం కలిగించేలా పనిచేశారు. తన విజయానికి క్యాన్సర్ రోగుల ఆశీస్సులే కారణమని ఆమె చెప్పారు. "నేను వాళ్లకు పాటలు పాడి వినిపించినప్పుడు చాలా సంతోషించేవారు. నన్ను ఇండియన్ ఐడల్ లో చూడాలని ఆశపడ్డారు. వారి ఆశీస్సుల వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను" అని ఎమోషనల్ అయ్యారు. ఒడిషా నుంచి ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

Related Articles

Related image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Related image2
Maruti Brezza 2026: కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ఏ వేరియంట్ కొనడం బెస్ట్? పూర్తి ఫీచర్లు, ధరల వివరాలు
34
అదరగొట్టిన ప్రదర్శనలు.. సెలబ్రిటీల ప్రశంసలు
Image Credit : Instagram/jyotirmayeenayak_official18

అదరగొట్టిన ప్రదర్శనలు.. సెలబ్రిటీల ప్రశంసలు

గ్రాండ్ ఫినాలేలో అన్షికా చోంకర్, మన్రాజ్ వీర్ సింగ్, మైసమ్మే బోసు, సుహైల్ సూఫీ, తనిష్క్ శుక్లాతో పోటీపడి జ్యోతిర్మయి విజేతగా నిలిచారు. 'సయాన్ ఓ సయాన్' పాటకు ఆమె ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అందరినీ కట్టిపడేసింది. అంతకుముందు 'ఓ జబ్ తక్ హై జాన్' పాటకు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని నుండి స్టాండింగ్ ఓవేషన్ లభించింది. అలాగే 'జానే క్యూ లోగ్ మొహబ్బత్ కియా కర్తే హై' పాట విని సీనియర్ నటి లీనా చందావర్కర్ భావోద్వేగానికి గురయ్యారు. ఉషా ఉతుప్, ఉదిత్ నారాయణ్, పపోన్, కుమార్ సాను, షెహనాజ్ గిల్, ఊర్మిళా మటోండ్కర్ వంటి ప్రముఖులు ఫినాలే వేడుకలో సందడి చేశారు.

44
బాలీవుడ్‌లో ప్లేబ్యాక్ సింగర్‌గా మారడమే లక్ష్యం
Image Credit : Instagram/jyotirmayeenayak_official18

బాలీవుడ్‌లో ప్లేబ్యాక్ సింగర్‌గా మారడమే లక్ష్యం

సెప్టెంబర్ 14న ముంబైకి వచ్చిన జ్యోతిర్మయి, దాదాపు ఏడాది పాటు సాగిన తన జర్నీ గురించి మాట్లాడారు. "నేను కేవలం నా బెస్ట్ ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను. ప్రైజ్ మనీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కాబట్టి ఆ డబ్బును ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు" అని తెలిపారు. తన తల్లిదండ్రుల సపోర్టు వల్లే ఈ స్థాయికి వచ్చానని, భవిష్యత్తులో బాలీవుడ్‌లో మంచి ప్లేబ్యాక్ సింగర్‌గా నిలదొక్కుకోవడమే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. జడ్జి శ్రేయా ఘోషాల్ స్పందిస్తూ, జ్యోతిర్మయి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, ఇది ఆమె సంగీత ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని శుభాకాంక్షలు తెలిపారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Indian Idol (@indianidols)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image2
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Recommended image3
Telugu Actress Arrest : చిరంజీవితో కలిసి కామెడీ పండించిన తెలుగు నటి అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Maruti Brezza 2026: కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ఏ వేరియంట్ కొనడం బెస్ట్? పూర్తి ఫీచర్లు, ధరల వివరాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved