MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Abhishree Sen: సల్మాన్ 'మాతృభూమి'లో కొత్త హీరోయిన్.. భాయ్‌జాన్‌తో ఏళ్ల నాటి బంధం, ఆమె గురించి తెలుసా

Abhishree Sen: సల్మాన్ 'మాతృభూమి'లో కొత్త హీరోయిన్.. భాయ్‌జాన్‌తో ఏళ్ల నాటి బంధం, ఆమె గురించి తెలుసా

సల్మాన్ ఖాన్ రాబోయే సినిమా 'మాతృభూమి' నుంచి 'మేరా జీ నహీ భరా' అనే కొత్త పాట రిలీజైంది. ఇది ఒక రొమాంటిక్ సాంగ్. అయితే ఈ పాటను సల్మాన్, చిత్రాంగద సింగ్‌పై కాకుండా, జైన్ షా, అభిశ్రీ సేన్ అనే ఇద్దరు కొత్త నటులపై చిత్రీకరించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 10 2026, 10:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సల్మాన్ ఖాన్ షేర్ చేసిన 'మాతృభూమి' కొత్త పాట
Image Credit : Instagram

సల్మాన్ ఖాన్ షేర్ చేసిన 'మాతృభూమి' కొత్త పాట

సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియాలో 'మాతృభూమి' కొత్త పాట 'జీ నహీ భరా'ను షేర్ చేశారు. "వెండితెరపైకి స్వాగతం" అని క్యాప్షన్ పెట్టి, జైన్ షా, అభిశ్రీ సేన్‌లను ట్యాగ్ చేశారు.
Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
పాటలో జైన్, అభిశ్రీల రొమాంటిక్ కెమిస్ట్రీ
Image Credit : Instagram

పాటలో జైన్, అభిశ్రీల రొమాంటిక్ కెమిస్ట్రీ

'మేరా జీ నహీ భరా' పాటను శ్రేయా ఘోషల్, విశాల్ మిశ్రా పాడారు. దీనికి సమీర్ టండన్, విశ్వదీప్ జీస్ట్ సాహిత్యం అందించారు. సమీర్ టండన్, కుమార్ గౌరవ్ సింగ్ కంపోజ్ చేసిన ఈ పాటలో జైన్ షా, అభిశ్రీ సేన్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ అదిరిపోయింది. జైన్ షా ఇంతకుముందు 'ఫర్రే' సినిమాలో కనిపించాడు. కానీ అభిశ్రీ సేన్‌కు 'మాతృభూమి' మొదటి సినిమా. ఈమె ఎవరా అని అందరూ ఆరా తీస్తున్నారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Salman Khan (@beingsalmankhan)

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవి కష్టపడి ఎదగలేదు, బిగ్ ఫెయిల్యూర్..చరణ్ మెంటాలిటీ ఇదే, డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Related image2
Jr NTR: జనాలు రాళ్లతో కొడతారు, ఆ మచ్చని తొలగించుకోవడానికి ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా ?
37
ఎవరీ అభిశ్రీ సేన్?
Image Credit : Instagram

ఎవరీ అభిశ్రీ సేన్?

అభిశ్రీ సేన్ ముంబైలో నివసిస్తున్నారు. వృత్తిరీత్యా ఆమె ఒక కొరియోగ్రాఫర్. 2019 నాటి ఒక రిపోర్ట్ ప్రకారం, అప్పుడు ఆమె వయసు 23 ఏళ్లు. అంటే ఇప్పుడు ఆమెకు 30 ఏళ్లు ఉంటాయి. కేవలం 4 ఏళ్ల వయసులోనే డ్యాన్స్‌ను తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తల్లి ప్రోత్సాహంతో 8 ఏళ్లకే తన డ్యాన్స్ టాలెంట్‌ను ప్రపంచానికి చూపించింది.
47
ముదస్సర్ ఖాన్ వద్ద అభిశ్రీకి డ్యాన్స్ శిక్షణ
Image Credit : Instagram

ముదస్సర్ ఖాన్ వద్ద అభిశ్రీకి డ్యాన్స్ శిక్షణ

అభిశ్రీ సేన్ ముంబైలోని 'ది ఫైర్ డ్యాన్స్ అకాడమీ'లో డ్యాన్స్ నేర్చుకున్నారు. కొరియోగ్రాఫర్ ముదస్సర్ ఖాన్ ఆమె గురువు. ఈ అకాడమీ కూడా ఆయనదే. అభిశ్రీ 'బూగీ వూగీ' వంటి డ్యాన్సింగ్ రియాలిటీ షోలలో విజేతగా నిలిచింది.

57
17 ఏళ్ల వయసులో అభిశ్రీ సేన్ బాలీవుడ్ ఎంట్రీ
Image Credit : Instagram

17 ఏళ్ల వయసులో అభిశ్రీ సేన్ బాలీవుడ్ ఎంట్రీ

అభిశ్రీ సేన్ 17 ఏళ్ల వయసులో ముదస్సర్ ఖాన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇక్కడే ఆమెకు సల్మాన్ ఖాన్‌తో మొదటి కనెక్షన్ ఏర్పడింది. ముదస్సర్ అసిస్టెంట్‌గా సల్మాన్ నటించిన 'దబంగ్ 2', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'జై హో' సినిమాలకు పనిచేసింది. అక్షయ్ కుమార్ 'బాస్' చిత్రానికి కూడా అసిస్టెంట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా ఉంది.
67
ఇండస్ట్రీలోని చాలా మంది పెద్ద స్టార్లతో పనిచేసిన అభిశ్రీ సేన్
Image Credit : Instagram

ఇండస్ట్రీలోని చాలా మంది పెద్ద స్టార్లతో పనిచేసిన అభిశ్రీ సేన్

అక్షయ్ కుమార్ నటించిన 'బేబీ' సినిమాలో ఇషా గుప్తాపై చిత్రీకరించిన 'బేపర్వా' పాటకు అభిశ్రీ సేన్ స్వతంత్ర కొరియోగ్రాఫర్‌గా పనిచేసింది. తాను బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అలియా భట్ నుంచి కత్రినా కైఫ్ వరకు చాలా మంది పెద్ద హీరోయిన్లతో కలిసి పనిచేసినట్లు Idivaకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిశ్రీ చెప్పింది.
77
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అభిశ్రీ సేన్
Image Credit : Instagram

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అభిశ్రీ సేన్

అభిశ్రీ సేన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 32.9 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తన బయోలో "బార్న్ ఫ్రమ్ బూమ్‌బాక్స్" అని రాసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, రష్మిక మందన్న, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా వరకు చాలా మంది ప్రముఖులను ఆమె ఫాలో అవుతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya 200 Crore Club: సూర్యకు తొలి 200 కోట్ల సినిమా 'కరుప్పు'.. 100 కోట్ల క్లబ్‌లో ఉన్న చిత్రాలివే!
Recommended image2
OTT Movies: కమెడియన్ సత్య నుంచి ధనుష్ వరకు, ఓటీటీలోకి దిగుతున్నారుగా.. ఈ వారం తప్పక చూడాల్సిన మూవీస్ ఇవే
Recommended image3
Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి కష్టపడి ఎదగలేదు, బిగ్ ఫెయిల్యూర్..చరణ్ మెంటాలిటీ ఇదే, డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Jr NTR: జనాలు రాళ్లతో కొడతారు, ఆ మచ్చని తొలగించుకోవడానికి ఎన్టీఆర్ ఏం చేశాడో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved