మోహన్ బాబుకు కోపం వస్తే.. ఆపే శక్తి, ఎదిరించే ధైర్యం ఎవరికి ఉందో తెలుసా...?
ప్రస్తుతం మంచువారి వివాదం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఇంటి గుట్టు రచ్చకెక్కిడంతో అది కాస్త ఇండస్ట్రీని కుదిపేస్తోంది. కోపంతో మోహన్ బాబు మీడియా ప్రతినిధిని గాయపరిచారు కూడా. ఇంత కోపం ఉన్న మోహన్ బాబును కంట్రోల్ చేయగలిగే శక్తి ఎవరికి ఉందో తెలుసా..?
అసలు విషయం ఎక్కడ మొదలయ్యిందో తెలియదు కాని.. చల్లని మంచులో మంటలు మొదలయ్యాయి. రెండు మూడురోజులగా నిరంతరం మండుతూనే ఉన్నాయి. ఎక్కడ స్టార్ట్ అయ్యింది... ఎటువైపు వెళ్తోంది తెలియడంలేదు. మొన్నటి వరకూ నాలుగు గోడల మధ్య కుటుంబ విషయంగా ఉన్న మోహన్ బాబు గొడవ.. ప్రస్తుతం వీధికెక్కి రచ్చ రచ్చగా మారింది.
Also Read: తల్లి కూతురు తో రొమాన్స్ చేసిన ఏకైక టాలీవుడ్ హీరో NTR, ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో తెలుసా..?
మంటకు పెట్రోలో తోడయినట్టు.. మోహన్ బాబు కోపంలో మీడియా ప్రతినిధిని గాయపరచడంతో.. ఇది కాస్త మరింత వివాదంగా మారింది. మోహన్ బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా మండిపడుతున్నాయి జర్నలిస్ట్ సంఘాలు. అటు మీడియా ప్రతినిధి అయ్యప్ప మాలలో ఉండటంతో.. అటు అయ్యప్పలు కూడా మోహన్ బాబును శిక్షించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు.
మెహన్ బాబుకు వివాదాల కొత్త కాదు. కొట్టడం కూడా కొత్త కాదు. ఎప్పుడు ఎవరో ఒకరి మీద చేయి చేసుకోవడం.. నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఇంట్లో నోళ్ళ మీద కూడా చేయిచేసుకోవడం. షూటింగ్ స్పాట్ లో కూడా ఆయన చేసిన వివాదాలు చాలా ఉన్నాయి. ఇంట్లో కూడా కోపంగా ఉండటంతో పాటు వారిపై కూడా చేయి చేసుకోవడం మోహన్ బాబకు అలవాటు అని మంచు విష్ణు చాలా సందర్భాల్లో వెల్లడించారు.
అయితే మోహన్ బాబు కోపాన్ని.. ఆయన ఆవేశాన్ని.. ఆపగలిగి ఎదురించే శక్తి ఇంట్లో ఒకరికే ఉందట. ఈవిషయాన్ని మంచు విష్ణు వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ.. నాన్నగారు కొట్టిన సందర్భం ఉందా అని యంకర్ అడగ్గా.. చాలాసార్లు కొట్టారండీ.. మేము చేసే పనులు అలాగే ఉండేవి.
ఆయన అంటే ఇప్పటికీ భయమే.. ఎప్పుడు చేయి లేపుతారా అని భయపడుతుంటాము. ఆయనతో ఏదైనా చెప్పాలన్నా భయమే.. ఇక ఏదైనా కోతి పని చేస్తే మటుకు ఇక అయిపోయినట్టే.. అది ఆయనకు ఎప్పుడు తెలుస్తుందా.. ఎలా రియాక్ట్ అవుతారా అని భయం భయంగా ఉంటాము అని విష్ణు వెళ్ళడించారు.
ఇక బాగా కోపం వచ్చినా.. ఏదైనా మెహన్ బాబుకు చెప్పాలన్నా.. ఇంట్లో ఆ ధైర్యం చేయగలిగేది ఒక్క మంచు లక్ష్మి మాత్రమేనట. మంచు విష్ణు మాట్లాడుతూ.. అక్క మాత్రమే ఆ పనిచేయగలదు. ఆమెకు తప్పించి ఆ ధైర్యంఎవరికి లేదు. నాన్న కోపాన్ని తట్టుకోవాలి అన్నా.. ఆవేశాన్ని ఆపాలన్నా.. ఎదురుతిరిగి మాట్లాడాలి అన్నా అది లక్ష్మికి మాత్రమే సాధ్యమట. ఇప్పటికే ఆయకు ఏదైనా చెప్పాలంటే.. ఏ విషయంలో అయినా ఎదురుతిరగాలంటే లక్ష్మి మాత్రమే డైరెక్ట్ గా వెళ్తుందట.
ప్రస్తుతం శంషాబాద్ శివారు ప్రాతంలోని జల్ పల్లి లో భారీ బంగ్లాలో ఉంటున్నాడు మోహన్ బాబు. ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటున్నారు. ఈ స్థలం.. ఆ పెద్ద విలాసవంతమైన బంగ్లా చుట్టునే వివాదం రాజుకుంది అని సమాచారం. ఆస్తుల పంపకాలు జరిగితే ఈ ప్లేస్, ఆబంగ్లా తరకు కావాలి అంటున్నాడట మనోజ్. కాని మనోజ్ రెండో పెళ్లి.. భూమా మౌనిక అంటే నచ్చని మోహన్ బాబు, విష్ణు.. ఈ బంగ్లాను ఇవ్వడానికి నిరాకరించినట్టు సమాచారం. అంతే కాదు వీరి పెళ్ళి జరిగినప్పటి నుంచి ఈ వివాదం నడుస్తున్నట్టు తెలుస్తోంది.
మౌనిక మొదటి భర్తకు కలిగినతనయుడు మనోజ్ తో ఉండటం కూడా మంచు ఫ్యామిలీకి ఇష్టంలేదని తెలుస్తోంది. ఇక మంచువారి విద్యాసంస్థలు, విష్ణు దుబాయ్ వ్యాపారాలకుసబంధించిన విషయాలు బయటపెడతానని మనోజ్ అన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియో ప్రకారం మనోజ్, అతని భార్య మౌనిక కలిసి తాగి ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారని. పనివాళ్లను కొడుతున్నారని, ఆస్తి కోసం అన్న విష్ణును చంపుతానని బెధిరించాడని, రోజంతా తాగుతూ గొడవ చేస్తున్నాడని మోహన్ బాబు వర్షన్.
ఆస్తి తన కష్టార్జితం, నచ్చినవారికి ఇస్తాను. లేకపోతే ఏట్లో కలిపేస్తాను.. అడిగే హక్కు మనోజ్ కు లేదు. ఆ ఇంట్లోకి రావాలన్నీ.. తన అనుమతి తీసుకోవల్సిందే. నీ కష్టార్జితం ఉంటే.. ఆ ఇంట్లో నువ్వు ఉండు. అందరికంటే గారాబంగా పెంచినందుకు గుండెలపై తన్నివాంటు మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ఈ వివాదం కొలిక్కి రావల్సి ఉంది. మోహన్ బాబు దాడి చేయించారంటూ మనోజ్.. మనోజ్ కొట్టాడంటూ మోహన్ బాబు హస్పిటల్ లోఉన్నారు. ఇద్దరికి గాయాలు అయ్యాయని తెలుస్తోంది. మరి అసలు నిజానిజాలు ముందు ముందు తెలుస్తాయేమో చూడాలి. మీడియాపై దాడి విషయంలోమాత్రం మోహన్ బాబుపై కేసు నమోదు అయ్యింది.