MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తల్లి కూతురు తో రొమాన్స్ చేసిన ఏకైక టాలీవుడ్ హీరో NTR, ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

తల్లి కూతురు తో రొమాన్స్ చేసిన ఏకైక టాలీవుడ్ హీరో NTR, ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో విచిత్రాలెన్నో జరిగాయి. హీరోలుగా తండ్రీ కొడుకులు ఒకే హీరోయిన్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన వారు ఉన్నారు. కాని తల్లీ కూతురు హీరోయిన్లు గా ఒకే హీరోతో జతగా నటించిన అరుదైన రికార్డ్ ఒక్క ఎన్టీరామారావుకే ఆ రికార్డ్ దక్కింది. ఇంతకీ ఎవరా హీరోయిన్లు.. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 11 2024, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తరాలుమారినా బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎన్టీరామారావు మాత్రమే కనిపిస్తారు. ఏఎన్నార్ తో కలుపుకుని ఇండస్ట్రీకి రెండు కళ్ళలా ఉన్నారు వీరిద్దరు.  ఈ ఇద్దరిలో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన రికార్డ్ లు ఎన్నో. ఆయనతో మూడు తరాల హీరోయిన్లు నటించారు.

ఎన్టీఆర్ పక్కన నటించడానికి ఉరుకులు పెట్టేవారు అప్పటి తారలు. అంతే కాదు ఎన్టీఆర్ కు మనవరాలిగా చేసిన శ్రీదేవి కూడా పెద్దయన జతగా హీరోయిన్ గా నటించింది. ఇలా హీరోయిన్ల విషయంలో మరో రికార్డ్ కూడా ఆయన సొంతం అయ్యింది. 

Also Read: సౌందర్య 100 కోట్ల ఆస్తి చుట్టు మోహన్ బాబు ‌‌- మనోజ్ వివాదం, మంచువారి లొల్లి పై నిజానిజాలు ఏంటి..?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో వింతలు విచిత్రాలు జరుగుతుంటాయి. సందర్భానుసారం అవి బయటకు వస్తుంటాయి.  హీరోయిన్ల విషయంలో ఎక్కవగా ఇలాంటివి చూస్తుంటాం. ఒకే హీరోయిన్ తో తండ్రీ.. కొడుకు ఇద్దరు రొమాన్స్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. . చిరు చరణ్, , ఎన్టీఆర్,  నాగార్జున, చైతన్య,  ఇలా తండ్రి కొడుకులు ఒకే హీరోయిన్ తో ఆడిపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి.

అయితే విచిత్రంగా తల్లీ కూతురు ఇద్దరి తో వేరు వేరు సినిమాల్లో రొమాన్స్ చేసిన రికార్డ్ మాత్రం టాలీవుడ్ మొత్తంమీద పెద్దాయన ఎన్టీఆర్ కే దక్కింది. ఇంతకీ ఆ తల్లీ కూతురు హీరోయిన్లు ఎవరో తెలుసా..? 

Also Read: 15 ఏళ్ళకే హీరోయిన్, డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయిన స్టార్ బ్యూటీ ఎవరో తెలుసా..?

36

వాళ్ళు ఎవరో కాదు.. జయచిత్ర ఆమె తల్లి అమ్మాజి.  అవును జయచిత్ర అందరికి తెలిసే ఉంటుంది. హీరోయిన్ గా చాలామందికి తెలియకపోయినా.. ఆమెవిలన్ గా మాత్రం చాలా సినిమాల్లో కనిపించారు. అబ్బాయిగారు సినిమాలో వెంకటేష్ మారుతల్లిగా విలనిజం పండించిన జయచిత్ర.. బాలయ్య బాబు సమరసింహారెడ్డిలో కూడా మారు తల్లిగా..హోటల్ ఓనర్ గా అలరించారు. 

Also Read:ఏ ఆర్ రెహమాన్ ను అవమానించిన సూర్య, ఇంత పని చేశాడేంటి..?

46

ఇక జయచిత్ర తల్లి అమ్మాజి కూడా హీరోయిన్ నే. ఆమెను అప్పట్లో జయశ్రీ అని కూడా పిలిచేవారు. అయితే వీరిద్దరు అన్న నందమూరి తారకరామారావు తో హీరోయిన్లు గా నటించారు. ఒక్క హీరోతో తల్లీ కూతురు నటించడం మాత్రం ఒక్క రామారావుతో మాత్రమే సాధ్యం అయ్యింది. అమ్మాజీ అలియాస్ జయశ్రీ తెలుగులో రోజులు మారాయి.. దైవబలం లాంటి సినిమాలలో నటించారు. అయితే ఈ ఇద్దరితోను సీనియర్ ఎన్టీఆర్ రొమాన్స్‌ చేసి ఓ అరుదైన రికార్డు సృష్టించారు. 
 

56

ఇక అమ్మాజీ కూతురు జ‌య‌చిత్ర 1976 లో వచ్చిన మా దైవం సినిమాతో మొదటిసారిగా ఎన్టీఆర్ తో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమాలో రామారావు ఒక జైలర్ పాత్రలో కనిపించారు.. ముద్దాయిల‌ను మంచివాళ్లను చేయవచ్చు అని రామారావు నమ్ముతారు.. అంతేకాదు నేరాలు చేసిన వారిని జైలుకు తీసుకువచ్చి వారిని మంచి వాళ్ళని చేసి వారి జీవితాల్లో వెలుగు నింపుతారు.

66

ఇక అంతకంటే ముందు 1959లో దైవబలం అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో జయ చిత్రా తల్లి జయశ్రీ అలియాస్ అమ్మాజీ తో ఎన్టీఆర్ నటించారు.  పొన్నలూరు వసంత కుమార్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో  నిర్మించిన ఈమూవీ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డ్ కూడా చేరింది. ఆతరువాత కాని.. అంతకు ముందు కాని ఇలాంటి సందర్భం ఫిల్మ్  ఇండస్ట్రీలోనే లేదు అని చెప్పాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image3
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved