- Home
- Entertainment
- TV
- Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కోసం బాధతో తలబాదుకున్న వల్లి, సేనాపతే చేయించాడని తెలిసిపోతుందా?
Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కోసం బాధతో తలబాదుకున్న వల్లి, సేనాపతే చేయించాడని తెలిసిపోతుందా?
Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో చందుకు యాక్సిడెంట్ ప్లాన్ చేస్తాడు సేనాపతి. కానీ ఆ యాక్సిడెంట్లో ప్రేమ ఆసుపత్రి పాలవుతుంది. ఇదంతా చూసి వల్లి చాలా బాధపడుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

ఆసుపత్రిలో ప్రేమ
చందుకు యాక్సిడెంట్ చేసి చంపేయమని సేనాపతి 50 వేలకు సుపారి మాట్లాడతాడు. ఇక అదే వ్యక్తితో ముందుగానే భాగ్యం, వల్లి డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెబుతారు. కానీ ఆ వ్యక్తి సేనాపతి మాటలు విని చందు ని చంపేయడానికి ప్లాన్ వేసి లారీని వేగంగా పోనిస్తాడు.అయితే చందును కాపాడి ప్రేమ ఆ లారీ యాక్సిడెంట్ కు గురవుతుంది. దీన్ని ధీరజ్ తో పాటు చందు, భాగ్యం, వల్లి, ఇడ్లీ బాబాయ్ చూస్తారు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్రేమను ఆసుపత్రిలో చేరుస్తారు. ప్రేమ తనతో మాట్లాడినవన్ని గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటాడు ధీరజ్. ఆస్పత్రికి రామరాజు కుటుంబమంతా వస్తుంది. చందును కాపాడబోయే ప్రేమ తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది అని తెలిసి అందరూ ఎంతో బాధపడతారు. జరిగిందంతా చందు చెబుతాడు.
ప్రేమ కోసం కన్నీరు పెట్టుకున్న వల్లి
ఇక్కడి నుంచి సీన్ వల్లి దగ్గరికి మారుతుంది. వల్లి కోపంగా తల్లిదండ్రులని చంపేస్తానంటూ అరుస్తుంది. ‘నేను డమ్మీ యాక్సిడెంట్ అని వాడికి కరెక్ట్ గానే చెప్పాను, వాడికి కూడా కరెక్ట్ గానే అర్థమైంది.. కానీ వాడు అలా ఫాస్ట్ గా వచ్చి గుద్దడం వెనుక ఇంకేదో కారణం ఉండి ఉంటుంది. మీ ఆయనకేమీ కాలేదు కదా.. ఎందుకలా ఫీలవుతున్నావ్’ అంటుంది భాగ్యం. దానికి వల్లి ‘మనుషుల ప్రాణాలతో ఆడుకునే పనికిమాలిన ప్లాన్ వేసావ్. పాపం ప్రేమ బలయింది. అమాయకురాలైన ప్రేమ తన ప్రాణాల మీదకు వచ్చింది. ఆ అమ్మాయి చాలా మంచిది. నేను తనని ఎంత బాధపెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా నన్ను సొంత అక్కలాగే చూసింది. ఇప్పుడు ఎలా ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఒకవేళ తనకి ఏమైనా కావాలి.. కన్నతల్లి అని కూడా చూడను చంపేస్తాను. నీ మాటలు విని విని నా కాపురాన్ని, జీవితాన్ని రోడ్డుమీదకి తెచ్చుకున్నాను’ అంటూ ఏడుస్తుంది. భాగ్యం మాత్రం ఆ డ్రైవర్ గాడికి నేను చెప్పింది ఒకటైతే మరొకటి ఎందుకు చేశాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.
సేనాపతి బాధ
ఇక్కడి నుంచి సీన్ సేనాపతి దగ్గరికి మారుతుంది. సేనాపతి బండి మీద ఇంటికి వచ్చి రామరాజు ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. కొడుకు యాక్సిడెంట్ మేటర్ తెలియదా ఏడుపులేవీ వినిపించట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపు యాక్సిడెంట్ చేసిన డ్రైవరు సేనాపతికి ఫోన్ చేస్తాడు. జరిగిందంతా సేనాపతికి చెబుతాడు. సేనాపతి భార్యకు తిరుపతి ఫోన్ చేసి ప్రేమకు యాక్సిడెంట్ అయిందని చెబుతాడు. దాంతో ఇంట్లో అందరూ ఏడుస్తారు. అప్పుడే సేనాపతి వచ్చి అసలు విషయం తెలుసుకుంటాడు. దాంతో బాధతో సేనపతి కళ్లు తిరిగి కింద పడిపోతాడు. తన చేత్తో తానే కూతురికి యాక్సిడెంట్ చేయించానని ఏడుస్తాడు.
క్షమాపణ చెప్పిన సేనాపతి
ఇక్కడి నుంచి సీన్ ఆస్పత్రికి మారుతుంది. ఆస్పత్రి బెడ్ పై ఉన్న ప్రేమను చూసేందుకు రామరాజు కుటుంబం అంతా గదిలోకి వస్తారు. ప్రేమ బాగానే ఉండడంతో అందరూ కాస్త రిలాక్స్ అవుతారు. ‘ఈ అమ్మాయి చాలా లక్కీ. అంత పెద్ద యాక్సిడెంట్ అయిన చిన్న చిన్న దెబ్బలతో బయటపడింది ఒక వీక్ లో అంతా తగ్గిపోతుంది’ అని చెబుతుంది డాక్టర్. అయితే పేషెంట్ ని జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. ప్రేమ చేసిన పనికి చందు, ధీరజ్ అందరూ చాలా రియలైజ్ అవుతారు. ఇక సేనాపతి ఇంట్లో మాత్రం అందరూ కంగారు పడుతూ ఉంటారు. సేనాపతి కుటుంబం అంతా ఆసుపత్రికి బయలుదేరుతూ ఉంటుంది. అదే సమయంలో రామరాజు కుటుంబం అంతా ప్రేమను తీసుకొని ఇంటికి వస్తారు. సేనాపతి ప్రేమను చూసి ఎలా ఉంది అంటూ అడుగుతాడు. ప్రేమ టెన్షన్ పడొద్దు అని తండ్రికి చెప్పడంతో సేనాపతి నన్ను క్షమించమ్మా అని అంటాడు. దానికి ప్రేమ వాడెవడో యాక్సిడెంట్ చేస్తే మీరు ఎందుకు క్షమాపణ చెబుతున్నారు అని అడుగుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

