MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Apple Box: సినిమాల్లో పొట్టి హీరోలు పొడుగ్గా కనిపించడానికి ఏం చేస్తారో తెలుసా? ప్రభాస్ కు ఎదురైన వింత పరిస్థితి ఏంటంటే?

Apple Box: సినిమాల్లో పొట్టి హీరోలు పొడుగ్గా కనిపించడానికి ఏం చేస్తారో తెలుసా? ప్రభాస్ కు ఎదురైన వింత పరిస్థితి ఏంటంటే?

Apple Box: స్టార్ హీరోల్లో అందరి హైటు ఒకేలా ఉండదు. కొంత మంది హైట్ ఎక్కువ ఉంటే చాలామంది హైట్ చాలా తక్కువ ఉంటుంది. అటువంటి వారి హైట్ ను సినిమాల్లో ఎలా చూపిస్తారో తెలుసా? పొట్టి హీరోలను కాస్త పొడుగ్గా చూపించడం కోసం ఏం వాడతారు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 15 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండస్ట్రీలో పొట్టిగా ఉండే హీరోల కోసం..
Image Credit : stockPhoto

ఇండస్ట్రీలో పొట్టిగా ఉండే హీరోల కోసం..

టాలీవుడ్ లో కాస్త పొట్టిగా కనిపించే హీరోలు చాలామంది ఉన్నారు. కానీ వారి ఇమేజ్ మాత్రం ఆకాశమంత ఎత్తులో ఉంటుంది. అయితే షూటింగ్స్ టైమ్ లో వారి హైట్ ను మ్యానేజ్ చేయడం కోసం.. తమకంటే హైట్ ఎక్కువగా ఉన్నక్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, విలన్ల ముందు హీరోల హైట్ ను అడ్జెట్స్ చేయడం కోసం షూటింగ్స్ లో ఒక వస్తువు వాడుతుంటారు. అది మరేదో కాదు యాపిల్ బాక్స్.. సినిమా రంగానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, షూటింగ్ సెట్స్‌లో కొన్ని ప్రాథమిక, సాధారణ వస్తువుల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదు. అలాంటి వాటిలో అత్యంత కీలకమైనది ‘యాపిల్ బాక్స్’ (Apple Box).

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యాపిల్ బాక్స్ అంటే ఏమిటి? షూటింగ్స్‌లో ఎలా వాడతారు?
Image Credit : StudioBinder's YouTube Channel

యాపిల్ బాక్స్ అంటే ఏమిటి? షూటింగ్స్‌లో ఎలా వాడతారు?

వెండితెరపై కనిపించే అద్భుతమైన ఫ్రేమ్‌ల వెనుక ఈ చిన్న పెట్టెల పాత్ర ఎంతో ఉంటుంది.యాపిల్ బాక్స్ అనేది సినిమా షూటింగ్స్, ఫొటోగ్రఫీ సెట్స్‌లో ఉపయోగించే ఒక దృఢమైన చెక్క పెట్టె. పూర్వకాలంలో హాలీవుడ్‌లో పండ్ల రవాణా కోసం వాడే యాపిల్ పెట్టెలను ఇలా సినిమాల కోసం ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం ప్రారంభించడంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఇవి ఫుల్, హాఫ్, క్వార్టర్, ప్యాన్‌కేక్ వంటి నాలుగు రకాల సైజ్ లలో లభిస్తాయి. 

సినిమా షూటింగ్స్ లో వీటిని రకరకాలుగా వాడుతుంటారు. షూటింగ్ నేల సమతలంగా లేనప్పుడు కెమెరా ట్రైపాడ్స్‌ను, భారీ లైటింగ్ పరికరాలను స్థిరంగా ఉంచడానికి వీటిని సపోర్టుగా పెడతారు. అలాగే, సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్స్ మధ్య దర్శకులు, సాంకేతిక నిపుణులు తాత్కాలికంగా కూర్చోవడానికి కూడా ఈ బాక్సులు కుర్చీలుగా ఉపయోగపడతాయి.

35
హీరోల కోసం యాపిల్ బాక్స్ లు ఎలావాడుతారు?
Image Credit : gemini AI

హీరోల కోసం యాపిల్ బాక్స్ లు ఎలావాడుతారు?

అయితే పైన చెప్పిన వాటికంటే కూడా యాపిల్ బాక్సులను నటీనటుల ఎత్తును పెంచి ఫ్రేమ్‌ను బ్యాలెన్స్ (Frame Balance) చేయడానికి వీటిని ఎక్కువగా వాడుతుంటారు. హీరో ఎవరైనా పొట్టిగా ఉంటే.. వారిని ఈ యాపిల్స్ బాక్స్ ఎక్కించి సీన్లు షూట్ చేస్తుంటారు. మన టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోల కోసం ఈ బాక్స్ లు వాడిన సందర్భాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే.. 6 ఫీట్ కంటేఎక్కువగా ఉన్న ప్రభాస్ కోసం కూడా ఈ పెట్టెను వాడారంటే మీరు నమ్ముతారా?

45
ప్రభాస్ కోసం యాపిల్ బాక్స్ ఎందుకు వాడారు..?
Image Credit : Asianet News

ప్రభాస్ కోసం యాపిల్ బాక్స్ ఎందుకు వాడారు..?

సాధారణంగా పొట్టిగా ఉండే నటీనటుల ఎత్తును పెంచడానికే యాపిల్ బాక్సులను ఉపయోగిస్తారనే భావన ఉంటుంది. కానీ, 6 ఫీట్ల 2 ఇంచుల భారీ కటౌట్ ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ కోసం కూడా ఈ బాక్స్ ను ఉపయోగించడం విచిత్రం అనిపిస్తుంటుంది. ఆ క్రెడిట్ ను టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కొట్టేశాడు. ఆయన ప్రభాస్ తో తెరకెక్కించిన బాహుబలి సినిమాలో కాలకేయాగా నటించిన నటుడు ప్రభాస్ కంటే ఎక్కువ హైట్ ఉంటాడు. దాంతో ఆయన ముందు నటించే సీన్ల టైమ్ లో ప్రభాస్ కోసం యాపిల్ బాక్స్ వేసినట్టు సమాచారం.

 ఇక ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ డిజాస్టర్ మూవీ 'ది రాజా సాబ్' మూవీలో కూడా ప్రభాస్ పక్కన నిల్చొబెట్టడానికి హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఈ బాక్స్ వాడారట. ఈ విషయాన్ని రీసెంట్ గా ఇంటర్వ్యూలో నిథి ఈ విషయాన్ని వెల్లడించింది. అంతే కాదు కెరీర్ లో ఆమెమొదటిసారి యాపిల్ బాక్స్ ఎక్కినట్టు వెల్లడించింది.

55
సినిమా మేకింగ్‌లో అద్భుతమైన సాధనం
Image Credit : gemini AI

సినిమా మేకింగ్‌లో అద్భుతమైన సాధనం

సినిమా రెంజూలో హీరో ఎంత ఎత్తుగా ఉన్నప్పటికీ, క్లోజప్ షాట్స్ లేదా రొమాంటిక్ సీన్స్ తీసేటప్పుడు సహ నటీనటుల ఎత్తును బట్టి కెమెరా యాంగిల్స్ సరిచేయడానికి ఈ బాక్సులు అనివార్యమవుతాయి. సినిమా ఇండస్ట్రీలో ఎంతటి భారీ స్టార్ సినిమా అయినా, దర్శకుడి విజన్‌కు తగ్గట్టుగా పర్‌ఫెక్ట్ విజువల్స్ రావాలంటే ఈ చిన్న యాపిల్ బాక్స్ ల సహాయం తప్పనిసరి. చూడటానికి కేవలం చెక్క పెట్టెలా కనిపించినా, సినిమా మేకింగ్‌లో ఇది ఒక అద్భుతమైన  సాధనం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Related Stories
Recommended image1
Facts: ఎడారిలో పాత్రలను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా? నీళ్లు లేకుండానే అంట్లు ఎలా క్లీన్ అవుతాయి?
Recommended image2
Mutton: చికెన్, మటన్ కలిపి తింటే ఏమౌతుంది? రెండు మాంసాలు కలిపి వండొచ్చా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved