MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sudhakar: కోమాలోకి వెళ్లి వచ్చిన నటుడు, వెంకటేష్ తో రీ ఎంట్రీ ఇవ్వాలని కోరిక.. ఆ కమెడియన్ల లాగా అంత ఆశ లేదు

Sudhakar: కోమాలోకి వెళ్లి వచ్చిన నటుడు, వెంకటేష్ తో రీ ఎంట్రీ ఇవ్వాలని కోరిక.. ఆ కమెడియన్ల లాగా అంత ఆశ లేదు

కమెడియన్ సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో తన రీ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రెమ్యునరేషన్ గురించి కూడా మాట్లాడారు. ఒకప్పుడు సుధాకర్ టాలీవుడ్ లో క్రేజీ కమెడియన్ గా రాణించిన సంగతి తెలిసిందే.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 24 2026, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Comedian Sudhakar
Image Credit : Asianet News

Comedian Sudhakar

సీనియర్ కమెడియన్ సుధాకర్ గురించి పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో కమెడియన్ గా, విలన్ గా వెలుగు వెలిగారు. హీరో పక్కన కమెడియన్ కావాలి అంటే ఆ టైంలో సుధాకర్ దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ గా ఉండేవాళ్ళు. వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాజశేఖర్, జగపతి బాబు సినిమాల్లో సుధాకర్ నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సుధాకర్ కామెడీ
Image Credit : Asianet News

సుధాకర్ కామెడీ

రాజా, సూర్యవంశం, మా అన్నయ్య, చెప్పవే చిరుగాలి లాంటి సినిమాల్లో సుధాకర్ కామెడీ విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత సుధాకర్ తీవ్ర అనారోగ్యానికి గురై కోమాలోకి కూడా వెళ్లారు. అంత విషమ పరిస్థితుల నుంచి కూడా సుధాకర్ తిరిగి కోలుకున్నారు. అనారోగ్యానికి గురైన తర్వాత సుధాకర్ సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు.

35
వెంకటేష్ సినిమాతో రీ ఎంట్రీ ?
Image Credit : Asianet News

వెంకటేష్ సినిమాతో రీ ఎంట్రీ ?

ఓ ఇంటర్వ్యూలో సుధాకర్ మాట్లాడుతూ తన రీ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ రీ ఎంట్రీ ఇవ్వాల్సి వస్తే ఏ హీరోతో అయితే బెటర్ అని మీరు భావిస్తారు అంటూ సుధాకర్ కి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి సుధాకర్ సమాధానం ఇస్తూ.. వెంకటేష్ సినిమా అయితే చాలా బావుంటుంది అని అన్నారు. చాలా సినిమాల్లో మా కామెడీ బాగా వర్కౌట్ అయింది. షూటింగ్ పూర్తి కాగానే వెంకటేష్ గారు.. ఏంటి సుధాకర్ ఈ రోజు వంట ఏం చేస్తున్నావ్, భోజనానికి బయటకు వెళుతున్నావా అని అడుగుతారు.

45
సుధాకర్ కోమాలో ఉన్నప్పుడు..
Image Credit : Asianet News

సుధాకర్ కోమాలో ఉన్నప్పుడు..

చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన నాకు ఫ్రెండ్. నేను హాస్పిటల్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం వచ్చారు. నాకు తెలియదు, అప్పుడు నేను కోమాలో ఉన్నా. కోలుకున్న తర్వాత చెప్పారు. తనికెళ్ళ భరణి, సంగీత దర్శకుడు కోటి, జగపతి బాబు వీళ్లంతా వచ్చారు. సుధాకర్ కి ఏమీ కాదు.. త్వరగా కోలుకుంటాడు అని చెప్పి వెళ్లారు. దేవుడి దయ వల్ల నిజంగానే కోలుకున్నాను అని సుధాకర్ తెలిపారు.

55
రెమ్యునరేషన్ గురించి ఇలా..
Image Credit : Asianet News

రెమ్యునరేషన్ గురించి ఇలా..

చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, కమెడియన్లు తమ రెమ్యునరేషన్ గంటల ప్రకారం తీసుకుంటారు. కానీ మీకు ఫుల్ క్రేజ్ ఉన్న టైం లో కూడా అలా చేయలేదు ఎందుకు అని ప్రశ్నించగా.. నాకు డబ్బు ముఖ్యం కాదు అన్ని సుధాకర్ సమాధానం ఇచ్చారు. ఎందుకంటే మన క్యారెక్టర్ వల్ల ఆడియన్స్ ఎంటర్టైన్ అయితే చాలు.. మరిన్ని సినిమాలు వస్తాయి. అంతే కానీ రెమ్యునరేషన్ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు అని సుధాకర్ సమాధానం ఇచ్చారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Movie: యశ్ 'రామాయణ'లో కాజల్‌కు షాక్? ఎడిటింగ్‌లో ఆమె రోల్ లేపేశారా?
Recommended image2
Bigg Boss 10 Elimination: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఏడో వారం ఎలిమినేషన్‌.. రెండో వారంలోనే ఆమె ఔట్‌
Recommended image3
Srihari: 9 భాషల్లోకి రీమేక్ అయిన తెలుగు మూవీ, బంగ్లాదేశ్ లో కూడా బ్లాక్ బస్టర్.. దటీజ్ రియల్ స్టార్ శ్రీహరి
Related Stories
Recommended image1
Srihari: 9 భాషల్లోకి రీమేక్ అయిన తెలుగు మూవీ, బంగ్లాదేశ్ లో కూడా బ్లాక్ బస్టర్.. దటీజ్ రియల్ స్టార్ శ్రీహరి
Recommended image2
Ram Charan: భారీ ఫ్లాపుల తర్వాత రాంచరణ్ తో సినిమా..వాడేం విన్నాడో తెలియదు, కథ వినకుండానే ఒట్టేసిన చిరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved