MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • వ్యాపారం
  • వీడియోలు
  • Home
  • Entertainment
  • ఒకప్పుడు వాచ్ మెన్ గా పనిచేసిన స్టార్ హీరో, ప్రస్తుతం 200 కోట్ల ఆస్తికి యజమాని, ఎవరా నటుడు?

ఒకప్పుడు వాచ్ మెన్ గా పనిచేసిన స్టార్ హీరో, ప్రస్తుతం 200 కోట్ల ఆస్తికి యజమాని, ఎవరా నటుడు?

పేదరికం తట్టుకోలేక వాచ్ మెన్ గా పనిచేసిన ఓ యువకుడు ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగాడు. ఎన్నో ఆశలతో సినిమాల్లోకి వచ్చిన ఆ యువకుడు కూరగాయలు అమ్మి, ఇంటింటికి పేపర్ వేసి, అవకాశం రాగానే అందిపుచ్చుకున్నాడు. ప్రస్తుతం 200కోట్ల ఆస్తితో.. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తోన్న బాలీవుడ్ నటుడు ఎవరు?  

Mahesh Jujjuri | Published : Apr 04 2025, 11:50 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Nawazuddin Siddiqui

Nawazuddin Siddiqui

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడు, ఇప్పుడు లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్న ఈ  నటుడు ఒకప్పుడు చేయని ఉద్యోగం లేదు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అతను వాచ్‌మెన్ పని కూడా చేశాడు. బాలీవుడ్‌లో  తాను నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ప్రస్తుతం 200 కోట్లకుపైగా ఆస్తి, బాలీవుడ్ లో స్టార్ డమ్, సమాజంలో పలుకుబడి. అన్నింటిని సాధించిన ఆ నటుడు ఎవరో కాదు నవాజుద్దీన్ సిద్ధిఖీ. 

Also Read: రాధిక అల్లుడు ఒక స్టార్ క్రికెటర్ అని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా స్టార్ ప్లేయర్ ?

27
Asianet Image

ఉత్తరప్రదేశ్‌లోని బుధానాలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించిన నవాజుద్దీన్, పేదరికంతో పాటు కష్టపడి పనిచేయడం తెలుసుకున్నాడు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ నటనపై ఆసక్తిని పెంచుకున్నాడు. బాలీవుడ్‌కు వెళ్లాలనేది అతని కల. కానీ అది అంత సులభం కాదు, అసాధ్యం అని అనుకున్నాడు. ఎలాగైనా ఇండస్ట్రీలో అడుగు పెట్టానే పట్టుదలతో పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఈక్రమంలో ఎన్నో ఇబ్బందులు అతను ఫేస్ చేశాడు. 

Also Read: బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?

37
Asianet Image

బాలీవుడ్‌లో చేరడానికి ముందు నవాజుద్దీన్ చాలా పనులు చేశాడు. కడుపునిండా తిండి దొరకడమే కష్టంగా ఉన్న రోజుల్లో.. ఆయన ఢిల్లీలో సెక్యూరిటీ గార్డ్ గా,   వడోదరలో కెమిస్ట్‌గా పని చేశాడు. అలా చేస్తూ.. చిన్నగా ముంబయ్ చేశారడు. ఇక  ముంబైలో బ్రతకడం కోసం అక్కడ కూరగాయలు అమ్మేవాడు. నెమ్మదిగా ఎదుగుతూ నటన నేర్చుకున్నాడు,  వర్క్‌షాప్‌లు నిర్వహించాడు,  బాలీవుడ్‌లోని చిన్న పాత్రల కోసం ఆడిషన్‌కు పిలుపు వచ్చింది. కొన్నిసార్లు రిజెక్ట్ అయ్యాడు. అయిన  పట్టువదలకుండా ప్రయత్నించాడు, ప్రతీ ఫెయిల్యూర్ నుంచి ఒక పాఠం నేర్చుకున్నాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్టార్ నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. 

Also Read: 500 మంది ఫైటర్లు, 3,000 మంది ఆర్టిస్టులు, ఒక్క సీన్ కోసం కోట్లు ఖర్చుచేస్తున్న సినిమా ఏంటో తెలుసా?

47
Asianet Image

బాలీవుడ్‌లోకి ప్రవేశించడం అంత సులభం కాదు. నవాజుద్దీన్ అంత అందంగా లేకపోవడం, బాలీవుడ్ తో ముందు నుంచి  సంబంధాలు లేకపోవడం వల్ల నవాజుద్దీన్ చాలా కష్టపడవలిసి వచ్చింది.  ఈ క్రమంలో ఎంతో మందితో అవమానాలు ఫేస్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు వదలకొద్ది  పాత్రల కోసం ఆడిషన్ చేశాడు. చాలాసార్లు చిన్న చిన్న పాత్రలు చేశాడు, జూనియర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు లేని క్యారెక్టర్లలో నటించేవాడు. అయినా సరే పట్టదలతో ప్రయత్నించాడు నవాజుద్దీన్.

Also Read:  మోక్షజ్ఞ కోసం మరో స్టార్ డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఎవరితో? బాలయ్య ఏం ప్లాన్ చేశారు?

57
Asianet Image

సర్ఫరోష్ (1999), శూల్ (1999) వంటి సినిమాల్లో అతని నటనను ఎవరూ గుర్తించలేదు. కానీ నవాజ్ పోరాటం ఆపలేదు. తనటైమ్ కోసం ఎదురు చూసిన నవాజుద్దీన్ గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' (2012) సినిమాతో ఒక్క సారిగా బ్లాస్ట్ అయ్యాడు. ఈసినిమాలో  ఫైజల్ ఖాన్ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. అతని అద్భుతమైన నటన ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అతనికి వరుస  ఆఫర్లు క్యూ కట్టాయి. 

Also Read: ఐశ్వర్య రాయ్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా? షాక్ అవుతారు!

67
Asianet Image

ఇక వెంట వెంటనే  కహానీ (2012), ది లంచ్ బాక్స్ (2013), మంఝీ: ది మౌంటెన్ మ్యాన్ (2015) సినిమాల్లో తన పాత్రల ద్వారా  తనలోని టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. బాలీవుడ్‌లోని గొప్ప నటుల్లో ఒకడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. నవాజుద్దీన్ ప్రతిభ బాలీవుడ్‌ను దాటి అంతర్జాతీయ వేదికలపై అతనికి గుర్తింపు తెచ్చింది. సేక్రేడ్ గేమ్స్ (2018), మాంటో (2018) సినిమాల్లో అతని నటన ఎంతలా ఆకట్టుకుందంటే..? క్లిష్టమైన పాత్రలకు ప్రాణం పోసే అతని సామర్థ్యాన్ని మరింతగా చూపించింది. 

Also Read: అట్లీపై మండిపడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్, బన్నీపై స్టార్ డైరెక్టర్ ప్రయోగం చేయబోతున్నాడా ?

77
Asianet Image

జూనియర్ ఆర్టిస్ట్ నుంచి  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడిగా ఎదగడం అతని కష్టం, ప్రతిభ, పట్టుదలకు నిదర్శనం. ఈ రోజు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, కొత్తగా వచ్చే  నటులకి స్ఫూర్తి. ప్రతిభ, పట్టుదల ఉంటే అడ్డంకులను అధిగమించి అద్భుతమైన విజయం సాధించవచ్చు అని నిరూపించిన నవాజుద్దీన్.. ఎంతో మందికి ఆదర్శం. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
తెలుగు సినిమా
బాలీవుడ్
 
Recommended Stories
Top Stories