`విశ్వంభర` కొత్త రిలీజ్ డేట్, ఐకానిక్ డే పై చిరు కన్ను.. రికార్డుల వేట తప్పదా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఆసక్తికర వార్త వినిపిస్తుంది. ఐకానిక్ డేట్‌కి రిలీజ్ చేయబోతున్నారట.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ఇది. `బింబిసార` ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఆషికా రంగనాథ్, ఈషా చావ్లా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రమిది. భారీ స్కేల్‌లో దీన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు వశిష్ట.
సోషియో ఫాంటసీ మూవీ కావడంతో దీనికి సీజీ వర్క్ ఎక్కువగా ఉంది. దీంతో అనుకున్న డేట్ కి రావడం కష్టమనే టాక్ వినిపిస్తుంది. మొదట ఈ మూవీని జనవరిలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. సమ్మర్‌లో వస్తుందన్నారు. ఏప్రిల్, మేలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్టుగా టీమ్ తెలిపింది. కానీ ఇప్పుడు కొత్త వార్త వినిపిస్తుంది. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేశారట. ఐకానిక్ డేట్‌కి ఈ మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారట.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకానిక్ డేట్‌గా పేరు తెచ్చుకుంది `మే 9`. ఈ డేట్‌కే చిరంజీవి నటించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` వచ్చింది. అప్పట్లో ఈ మూవీ పెద్ద సంచలనం. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. మరో అద్భతమైన మూవీ `మహానటి` కూడా ఇదే డేట్ రోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో కీర్తిసురేష్‌కి జాతీయ అవార్డు లభించింది. సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది.
ఇక ఇప్పుడు అదే డేట్‌ని టార్గెట్ చేస్తున్నారు చిరంజీవి. తనకు కలిసి వచ్చిన డేట్‌ని, తాను ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన డేట్‌కే `విశ్వంభర` సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. పైగా `జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీ కూడా సోషియో ఫాంటసీనే, ఇప్పుడు చేస్తున్న `విశ్వంభర` కూడా అదే జోనర్. ఇంకా చెప్పాలంటే కథలు కూడా దగ్గరగా ఉండబోతున్నాయి. సినిమా స్టయిల్ సేమ్ ఉంటుంది. అందుకే మరోసారి తాను బాక్సాఫీసుని షేక్ చేయాలని, అది తనకు కలిసి వచ్చిన మే 9న అయితే బెటర్ అని భావిస్తున్నారట చిరంజీవి.
ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే `జగదేక వీరుడు అతిలోక సుందరి` మ్యాజిక్ రిపీట్ అయితే టాలీవుడ్లో రికార్డులపై చిరు పంజా విసరబోతున్నారని, సరికొత్త రికార్డులు రాసి పెట్టుకోవాల్సిందే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ వార్తలు నిజమెంతా అనేది పక్కన పెడితే ఈ రూమర్ మాత్రం మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉందని చెప్పొచ్చు.
read more: పవన్ కళ్యాణ్, వేణు మాధవ్ మధ్య రహస్య ఒప్పందం.. డిప్యూటీ సీఎం చాలా మిస్ అవుతున్నట్టే?
also read: ఎన్బీకే థమన్‌కి బాలయ్య బిగ్ షాక్, ఆ సినిమా నుంచి ఔట్?