- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్, వేణు మాధవ్ మధ్య రహస్య ఒప్పందం.. డిప్యూటీ సీఎం చాలా మిస్ అవుతున్నట్టే?
పవన్ కళ్యాణ్, వేణు మాధవ్ మధ్య రహస్య ఒప్పందం.. డిప్యూటీ సీఎం చాలా మిస్ అవుతున్నట్టే?
పవన్ కళ్యాణ్ తో తనకున్న రహస్య ఒప్పందం గురించి బయటపెట్టాడు కమెడియన్ వేణు మాధవ్. ఇద్దరు అవి ఇచ్చిపుచ్చుకుంటారట. ఈ క్రమంలో పవన్ కోప్పడ్డ సందర్భంగా కూడా ఉందట.

వేణు మాధవ్ తనదైన కామెడీతో తెలుగు ఆడియెన్స్ ని అలరించారు. ఆద్యంతం నవ్వులు పూయించారు. తాను తిట్లు తింటూ, తాను దెబ్బలు తింటూ, తాను అందరిచేత అవమానం పొందుతూ ఆడియెన్స్ ని నవ్వించారు. అదే సమయంలో సినిమాల్లో తన పాత్రలతో ఓవర్ యాక్టింగ్ చేస్తూ చివరికి పప్పుగా మారి నవ్వించారు. నవ్వించడం కోసం ఏమైనా చేసేవారు.
అలాంటి వేణు మాధవ్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వేణు మాధవ్‌కి సంబంధించి ఓ రేర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్‌తో తాను చేసుకున్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాడు. మరి ఆ ఒప్పందమేంటి? అనేది చూస్తే.
వేణు మాధవ్ ఒకప్పుడు స్టార్ కమెడియన్‌గా రాణించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల్లోనూ వేణు మాధవ్ కనిపించేవారు. అంతేకాదు పర్సనల్‌గా ఇద్దరికీ కామన్ విషయాలు ఉన్నాయి. పవన్ ఫామ్ హౌజ్‌లో ఉంటూ వ్యవసాయం చేస్తుంటారు. పండ్లతోటలు, ఆర్గానిక్ ఫుడ్ పండిస్తుంటాడు. అలాగే వేణు మాధవ్‌కి కూడా పది ఎకరాల ఫామ్ ఉంది. అందులో తాను కూడా వ్యవసాయం చేస్తాడట. వరి, కూరగాయలు పండిస్తుంటాడట.
ఈ క్రమంలో తాను పండించే వరి పంట నుంచి ఒక బస్తా బియ్యం పవన్ కళ్యాణ్ కి పంపిస్తుంటాడట వేణు మాధవ్. దీనికి బదులుగా పవన్ ఫామ్ హౌజ్‌లో పండే మామిడి పండ్లు ఒక బాక్స్ వేణు మాధవ్‌కి వస్తుంటుందట. ఇది తామిద్దరం చేసుకున్న రహస్య ఒప్పందమని తెలిపారు వేణు మాధవ్. చాలా ఏళ్లుగా ఇది తమ మధ్య జరుగుతుందన్నారు. అయితే తాను ఓ అడుగు ముందుకేసి బియ్యంతోపాటు కందులు, పెసర్లు కూడా పంపించాడట వేణు మాధవ్.
దీనికి పవన్ సీరియస్ అయ్యాడట. `నేను ఒక్క మామిడి పండ్లే పండిస్తున్నా, నువ్వు ఇన్ని పండిస్తున్నావని నా వద్ద కటింగ్ ఇవ్వడానికి పంపిస్తున్నావా? అని ఫైర్ అయ్యాడట(సరదాగా). అంతటి రిలేషన్ తమ మధ్య ఉందన్నారు వేణు మాధవ్. గతంలో ఓసారి అలీతో సరదాగా షోకి వెళ్లినప్పుడు వేణు మాధవ్ అలీతో ఈ విషయాన్ని బయటపెట్టారు.
ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే వేణు మాధవ్ ఆరేళ్ల క్రితం లివర్, కిడ్నీ సమస్యతో కన్నమూసిన విషయం తెలిసిందే. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు డైరెక్టర్ కాబోతున్నాడట.