MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Makutam Collections: విశాల్ సినిమాకు తొలిరోజే షాక్.. మకుటంకి వచ్చిన కలెక్షన్లు ఇంతేనా?

Makutam Collections: విశాల్ సినిమాకు తొలిరోజే షాక్.. మకుటంకి వచ్చిన కలెక్షన్లు ఇంతేనా?

Makutam Collections: విశాల్ హీరోగా నటిస్తూ, తొలిసారి దర్శకత్వం వహించిన 'మగుడం' (తెలుగులో మకుటం) సినిమా థియేటర్లో సందడి చేస్తోంది. మరి ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 15 2026, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విశాల్‌ ఫస్ట్ టైమ్‌ డైరెక్ట్ చేసిన మకుటం
Image Credit : X

విశాల్‌ ఫస్ట్ టైమ్‌ డైరెక్ట్ చేసిన మకుటం

విశాల్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం `మకుటం`. ఇందులో ఆయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి లింగ ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ కాగా, కొడుకు కృపా ఒక మెడికల్ రిప్రజెంటేటివ్‌గా భార్య జమున, ఇద్దరు పిల్లలతో సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఒకరు విలాసవంతమైన జీవితం గడుపుతుంటే, మరొకరు రోజువారీ అవసరాలకే కష్టపడుతుంటారు. ఇందులో అంజలి లింగాకి జోడీగా చేసింది. ఆమెకి బలమైన పాత్ర దక్కింది. కానీ సినిమాకి మాత్రం నెగటివ్‌ టాక్‌ వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆకట్టుకోలేకపోయిన మకుటం
Image Credit : X

ఆకట్టుకోలేకపోయిన మకుటం

ఈ సినిమాలోని కామెడీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విశాల్, చిత్ర లక్ష్మణన్ మధ్య వచ్చే కొన్ని సీన్లు నవ్వు తెప్పించడానికి బదులు, బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తాయి. ప్రేక్షకులతో ఈలలు వేయించాలనే ఉద్దేశంతో పెట్టిన కొన్ని మాస్ సీన్లు కూడా అనుకున్నంత ప్రభావం చూపలేదు. స్క్రీన్‌ప్లేపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది.

35
దర్శకుడుగా మెప్పించలేకపోయిన విశాల్‌
Image Credit : X

దర్శకుడుగా మెప్పించలేకపోయిన విశాల్‌

కథనంలో వేగాన్ని తగ్గించేలా కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లేలో గ్యాప్స్ ఉన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం కూడా సినిమాకు ప్లస్ కాలేకపోయింది. పాటలు, నేపథ్య సంగీతం యావరేజ్‌గానే ఉన్నాయి. ద్విపాత్రాభినయం చేసినా, కృపాకరణ్‌ పాత్ర కంటే లింగ పాత్రే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. దర్శకుడుగా విశాల్‌ సక్సెస్‌ కాలేకపోయారు.

45
మెప్పించలేని కమర్సియల్‌ ఎలిమెంట్లు
Image Credit : X

మెప్పించలేని కమర్సియల్‌ ఎలిమెంట్లు

ఒక పక్కా కమర్షియల్ సినిమాకు కావాల్సిన డ్యూయల్ రోల్, ఇద్దరు హీరోయిన్లు, ఫ్యామిలీ సెంటిమెంట్, గ్యాంగ్‌స్టర్ నేపథ్యం వంటి అన్ని అంశాలను విశాల్ ఇందులో చేర్చాడు. కానీ, ఇవన్నీ కలిసినా ప్రేక్షకులకు సరైన థియేటర్ అనుభూతిని ఇవ్వడంలో ఈ సినిమా విఫలమైంది. ఇదే ఈ సినిమాకు పెద్ద మైనస్.

55
మకుటం మూవీ కలెక్షన్లు
Image Credit : X

మకుటం మూవీ కలెక్షన్లు

మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న 'మగుడం'(మకుటం) వసూళ్లలో భారీ దెబ్బతింది. Sacnilk రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమా ఇండియాలో తొలిరోజు కేవలం రూ. 68 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇందులో తమిళ వెర్షన్ రూ. 38 లక్షలు, తెలుగు వెర్షన్ రూ. 20 లక్షలు రాబట్టింది. కర్ణాటకలో రూ. 7 లక్షలు, కేరళలో రూ. 2 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో రూ. 1 లక్ష వసూలు చేసింది. విశాల్‌ సినిమాకి ఇంతటి దారుణమైన కలెక్షన్లు ఎవరూ ఊహించరు. సినిమా డిజాస్టర్‌ అనేదానికిది నిదర్శనం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Recommended image2
Divya Bharathi: ఇండస్ట్రీలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. అసలు నిజం చెప్పిన హీరోయిన్!
Recommended image3
Taapsee Pannu: హీరో పెళ్ళానికి నచ్చలేదని తాప్సీని సినిమా నుంచి తీసేశారు.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన
Related Stories
Recommended image1
Nagarjuna: నేను కరప్ట్ అయ్యాను, నాది నాకే నచ్చడం లేదు.. నాగార్జున సంచలన కామెంట్‌
Recommended image2
Vishwanath and Sons Review: విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ రివ్యూ, సూర్య తెలుగు సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved