MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Chiranjeevi: సినిమా హిట్ అయినా చిరంజీవికి రెమ్యునరేషన్ లేదు..పెళ్లి ఖర్చులకు ఆదుకున్నది ఎవరో తెలుసా

Chiranjeevi: సినిమా హిట్ అయినా చిరంజీవికి రెమ్యునరేషన్ లేదు..పెళ్లి ఖర్చులకు ఆదుకున్నది ఎవరో తెలుసా

చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో కొన్ని సినిమాలకు రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. తన మంచి తనంతోనే నిర్మాతలకు చేరువయ్యారు. చిరంజీవి పెళ్ళి ఖర్చులకు ఓ నిర్మాత డబ్బులు కూడా ఇచ్చారు. This producer gives money for Chiranjeevi Marriage

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 15 2026, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగింగ్ లో కేవలం గుర్తింపు కోసం మాత్రమే ప్రయత్నించారు. దాని కోసం ఎంత కష్టమైనా అనుభవించారు. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి రెమ్యునరేషన్ గురించి అస్సలు పట్టించుకోలేదు. కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ చిరంజీవి రెమ్యునరేషన్ తీసుకోని సందర్భాలు ఉన్నాయి. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తమ్మారెడ్డి భరద్వాజ సినిమాలు
Image Credit : Asianet News

తమ్మారెడ్డి భరద్వాజ సినిమాలు

తమ్మారెడ్డి, చిరంజీవి కాంబోలో 2 సినిమాలు వచ్చాయి. ఒకటి కోతల రాయుడు కాగా మరొకటి మొగుడు కావాలి. రెండు చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. నాకు ఉన్న సన్నిహితుల్లో డబ్బుతో ముడిపడిన బంధం ఎవరితోనూ లేదు. మనిషిని నమ్మి స్నేహం చేయడమే. నా ఫస్ట్ మూవీ కోతల రాయుడులో చిరంజీవి హీరో. ఆ చిత్రానికి గాను చిరంజీవికి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ ఇవ్వలేదు.

Related Articles

Related image1
NTR: బాబూ మన సినిమాకి థియేటర్లు బద్దలైపోతున్నాయ్, హీరోకి అనుచరులు చెప్పిన ఫస్ట్ షో టాక్..రియాలిటీ తుస్సు
Related image2
George Krish: మహేష్ నుంచి గోపీచంద్ వరకు, వరుసగా 5 ఫ్లాపులు.. అయినా సాహసం చేస్తున్న శర్వానంద్
35
చిరంజీవి పెళ్లి ఖర్చులకు డబ్బు
Image Credit : Pinterest

చిరంజీవి పెళ్లి ఖర్చులకు డబ్బు

అయినప్పటికీ చిరంజీవి నాతో రెండో సినిమా చేశారు. మా ఇద్దరి కాంబోలో వచ్చిన రెండవ చిత్రం మొగుడు కావాలి. ఆ సినిమా ప్రారంభానికి కొన్ని నెలల ముందు చిరంజీవి పెళ్లి జరిగింది. కోతల రాయుడు చిత్రానికి రెమ్యునరేషన్ ఇవ్వలేదు కాబట్టి చిరంజీవి పెళ్లి జరుగుతున్నప్పుడు రూ 10 డబ్బు పెళ్లి ఖర్చులకు ఇచ్చాను. అది పెళ్లి ఖర్చుల కోసం అనుకోండి, గిఫ్ట్ అనుకోండి, రెమ్యునరేషన్ అనుకోండి ఇంకేమైనా అనుకోండి. చిరంజీవి కోసం ఆ డబ్బు ఇచ్చాను.

45
ఈసారి యూరప్ ఖర్చులకు డబ్బు
Image Credit : our own

ఈసారి యూరప్ ఖర్చులకు డబ్బు

ఆ తర్వాత ఫోన్ చేసి నాకు ఇంకో సినిమా చేయాలి అని చిరంజీవి అడిగాను. అలాగే అన్నయ్య చేస్తాను. ఇప్పుడు 15 రోజులు షూటింగ్ పెట్టుకోండి. ఆ తర్వాత బాలచందర్ గారి సినిమా కోసం యూరప్ వెళుతున్నా. రాగానే మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేస్తా అని చెప్పాడు. చెప్పినట్లుగానే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఆ తర్వాత యూరప్ వెళుతుండగా.. అన్నయ్య యూరప్ వెళుతున్నా. ఖర్చులకు డబ్బులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. నన్ను ఎప్పుడూ చిరంజీవి నాకు రెమ్యునరేషన్ ఇవ్వండి, డబ్బు ఇవ్వండి అని డిమాండ్ చేసింది లేదు.

55
హిట్ సినిమాకి కూడా నో రెమ్యునరేషన్
Image Credit : others

హిట్ సినిమాకి కూడా నో రెమ్యునరేషన్

నేను కూడా చిరంజీవి అడిగిన వెంటనే రూ 10 వేలు ఇచ్చి యూరప్ పంపాను. ఆ తర్వాత మొగుడు కావాలి చిత్రం రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. తర్వాత చాలా రోజులకు మళ్ళీ ఫోన్ చేసి అన్నయ్య ఇల్లు కొంటున్నా ఏమైనా డబ్బులు ఉన్నాయా అని అడిగాడు. వెంటనే 10 వేలో, 15 వేలో ఇచ్చాను. అప్పటికి మొగుడు కావాలి రిలీజ్ అయి చాలా కాలం అయింది. అది హిట్ సినిమా. ఆ సినిమాకి కూడా చిరంజీవికి రెమ్యునరేషన్ ఇవ్వలేదు అని తమ్మారెడ్డి అన్నారు. నేను చిరంజీవిని ఎప్పుడూ తిడుతూ ఉంటా అని ట్రోల్ చేస్తుంటారు. నేను నిజంగానే చిరంజీవిని తిడుతుంటే ఇంత మంచి రిలేషన్ మా మధ్య ఉంటుందా అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Recommended image2
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image3
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Related Stories
Recommended image1
NTR: బాబూ మన సినిమాకి థియేటర్లు బద్దలైపోతున్నాయ్, హీరోకి అనుచరులు చెప్పిన ఫస్ట్ షో టాక్..రియాలిటీ తుస్సు
Recommended image2
George Krish: మహేష్ నుంచి గోపీచంద్ వరకు, వరుసగా 5 ఫ్లాపులు.. అయినా సాహసం చేస్తున్న శర్వానంద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved