MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nagarjuna: నేను కరప్ట్ అయ్యాను, నాది నాకే నచ్చడం లేదు.. నాగార్జున సంచలన కామెంట్‌

Nagarjuna: నేను కరప్ట్ అయ్యాను, నాది నాకే నచ్చడం లేదు.. నాగార్జున సంచలన కామెంట్‌

నాగార్జున తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కరప్ట్ అయినట్టు వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో అది లేదని, కానీ బయట చాలా ఉందని, దాన్నుంచి బయటపడలేకపోతున్నామని చెప్పారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 15 2026, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న నాగార్జున
Image Credit : Asianet News

ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న నాగార్జున

నాగార్జున.. టాలీవుడ్‌లో కింగ్‌గా, మన్మథుడుగా పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే. సీనియర్లలో అత్యంత ప్రయోగాత్మక చిత్రాలు చేసిన హీరోగా నిలిచారు. గీతాంజలి, శివ, అన్నమయ్య వంటి డిఫరెంట్‌ చిత్రాలు చేశారు. మల్టీస్టారర్స్ చేశారు. ఇటీవల విలన్‌ రోల్స్ కూడా చేస్తున్నారు. రజనీకాంత్‌ `కూలీ`లో ఆయన విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు తన రూట్‌ మారుస్తూ మెప్పిస్తున్నారు. యంగ్‌ జనరేషన్‌ కి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన కింగ్‌ 100లో నటిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కోపం వస్తే తిట్టి తర్వాత సారీ చెబుతా
Image Credit : Asianet News

కోపం వస్తే తిట్టి తర్వాత సారీ చెబుతా

ఇదిలా ఉంటే నాగార్జున ఒకప్పుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. తాను కరప్ట్ అయినట్టు చెప్పారు. మీలో మీకు నచ్చని క్వాలిటీ ఏంటి అని ప్రశ్నించినప్పుడు నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. మంచు లక్ష్మి షోలో పాల్గొన్న ఆయన తన జర్నీ గురించి వెల్లడించారు. పిల్లల కెరీర్‌ గురించి స్పందించారు. చైతన్యకి స్వతంత్ర్య భావాలు ఎక్కువ అని, పెద్ద స్థాయికి వెళ్తాడని చెప్పారు నాగార్జున. అన్ని రకాల పనులను మ్యానేజ్‌ చేయడంపై ఆయన రియాక్ట్ అవుతూ, ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తానని, ఒకదాంట్లో మరోటి కలుపను అని చెప్పారు. సినిమాలు, పర్సనల్‌ లైఫ్‌ని మిక్స్ చేయను అని వెల్లడించారు. తనకు కూడా కోపం వస్తుందని, అందరిపై అరుస్తానని చెప్పారు. అయితే ముందు తిట్టేసి తర్వాత సారీ చెబుతానని, ఏదో కోపంలో అన్నాను అని చెప్పి సారీ చెబుతానని వెల్లడించారు. సారీ చెబితే చాలా సమస్యలు క్లీయర్‌ అవుతాయని, సారీ చెప్పడంలో ఈగో ప్రాబ్లమ్‌ ఏం లేదన్నారు.

34
నేను కరప్ట్ అయ్యాను
Image Credit : Asianet News

నేను కరప్ట్ అయ్యాను

ఇప్పుటి తరం కుర్రాళ్లు ప్రయోగాలు చేయడం లేదని, రెగ్యూలర్‌ కమర్షియల్‌ చిత్రాలు చేస్తున్నారని వెల్లడించారు. డిఫరెంట్‌ గా చేస్తేనే మంచి సినిమాలు వస్తాయన్నారు. చైతూకి కూడా అదే చెబుతుంటానని వెల్లడించారు. ఈ క్రమంలో మీలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటని మంచు లక్ష్మి అడగ్గా, ఆయన చెప్పలేదు. నచ్చని క్వాలిటీ గురించి అడగ్గా, ఆలోచించి.. `నేను కరప్ట్ అయ్యాను, అదే నాకు నచ్చడం లేదు` తెలిపారు నాగార్జున. దెబ్బకి మంచు లక్ష్మి షాక్‌ అయ్యింది. తన చుట్టూ కొన్ని రకాల కరప్షన్‌ ఉందని, అది తనకు నచ్చడం లేదని చెప్పారు నాగ్‌. కానీ మరో ఛాయిస్‌ లేదన్నారు. అయితే వ్యవస్థ చాలా కరప్ట్ అయ్యిందని, తాను అందులో భాగమే అని, ఇలా చేయడానికి, అలా చేయడానికి, వాళ్లు, వీళ్లు ఇలా ఏదో చాలా విషయాల్లో కరప్ట్ అయిపోయినట్టు చెప్పారు. కాకపోతే వ్యవస్థలో మనం కూడా భాగమే కాబట్టి, దాన్నుంచి బయటపడలేకపోతున్నామని తెలిపారు. ఈ సందర్భంగానే సినిమాల్లో అలాంటి కరప్షన్‌ లేదని, ఇక్కడ ప్రతిదీ క్లీయర్‌గా ఉంటుందని, కేవలం ఈగో సమస్య మాత్రమే ఉంటుందని, మరో సమస్య లేదన్నారు నాగార్జున.

44
టబు చాలా ప్రత్యేకం
Image Credit : Asianet News

టబు చాలా ప్రత్యేకం

టబుతో రిలేషన్‌ గురించి చెబుతూ, తను మంచి ఫ్రెండ్‌ అని, తనకు చాలా ప్రత్యేకం అని వెల్లడించారు. పెళ్లికంటే ముందే, సినిమాల్లోకి రావడానికి ముందు నుంచే టబ్‌ తెలుసు అని, చాలా క్లోజ్‌ అని వెల్లడించారు. అమలకి కూడా ఈ విషయం తెలుసు అని, తమ మధ్య ఆ నమ్మకం ఉంటుందని, నమ్మకం లేకపోతే రిలేషన్‌ ఉండదని వెల్లడించారు. నమ్మకం మీదనే చాలా బంధాలు నిలబడతాయని, ప్రతి విషయాన్ని అనుమానించలేమని వెల్లడించారు. నమ్మకం లేకపోతే కష్టమన్నారు. ఇక ప్రస్తుతం `కింగ్‌ 100`లో నటిస్తున్న నాగార్జున.. ఈ మూవీని దసరాకిగానీ, లేదంటే సంక్రాంతికిగానీ రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
అక్కినేని నాగార్జున
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Savitri: జెమినీ గణేశన్ ఉండగానే సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్, అన్నపూర్ణమ్మ చూసి ఏమన్నారంటే?
Recommended image2
Prabhas: ప్రభాస్ ముఖం మీదే అడిగేసి కళ్ళు తెరిపించిన కమెడియన్, మనసులో దాచుకుని మదనపడడం ఎందుకు
Recommended image3
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Related Stories
Recommended image1
Husharu Pittalu Review: హుషార్‌ పిట్టలు మూవీ రివ్యూ.. కుర్రాళ్లకి పండగే, కానీ అసలు ట్విస్ట్‌ ఏంటంటే?
Recommended image2
Agadha Review: అగధ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఎంఎస్‌ రాజు డైరెక్టర్‌గా సక్సెస్‌ అయ్యాడా? కామాక్షికి హిట్‌ పడిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved