MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Folk Song : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సూపర్ ఫోక్ .. మీరు రీల్ చేసినా లక్షల వ్యూస్ ఖాయం

Folk Song : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సూపర్ ఫోక్ .. మీరు రీల్ చేసినా లక్షల వ్యూస్ ఖాయం

Gunnagunnavoye Sinnadi Folk Song : ప్రస్తుతం ఏ సోషల్ మీడియా మాధ్యమంలో చూసినా ఓ తెలంగాణ జానపద పాటపై రీల్స్, వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ పాటపై మీరు రీల్స్ చేసినా లక్షల వ్యూస్ ఖాయం. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 19 2026, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యూట్యూబ్ లో మరో ఫోక్ సాంగ్ వైరల్..
Image Credit : Screeshot to MV Music & Movies

యూట్యూబ్ లో మరో ఫోక్ సాంగ్ వైరల్..

Folk Song : ప్రస్తుతం ఎక్కడచూసినా జానపద పాటలే వినిపిస్తున్నాయి. కొన్ని ఫోక్ సాంగ్స్ సినిమా పాటలను మించిపోతున్నాయి. కొన్ని ఫోక్స్ యూట్యూబ్ లో కోట్ల వ్యూస్ తో దూసుకుపోతుంటే మరికొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇలా గతంలో ''రాను బొంబైకి రాను'', ''ఓ పిలగ యెంకటేశు..'' వంటి పాటలు ఓ ఊపు ఊపాయి. ఇప్పుడు ఇదే బాటలో ''గురియన్నే సీరెగట్టి.. గుద్దినట్టు గోసివెట్టి.. గున్నగున్నవోయే గునుకపూల సిన్నది'' అంటూ సాగే తెలంగాణ ఫోక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటపై చాలామంది రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గున్నగున్నవోయె సిన్నది ఫోక్ సాంగ్ లిరిక్స్...
Image Credit : Screeshot to MV Music & Movies

గున్నగున్నవోయె సిన్నది ఫోక్ సాంగ్ లిరిక్స్...

పల్లవి

కట్ల కట్ల మిరపకాయ

కాళ్ళ గుత్తులు మెరియనాయ

బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది

చల్ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది

చల్ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది

ఆ బంతి సేబంతి

సెలియ నీకు ఇత్తగాని

కొండమీని కోతినైన

సిటికెలోన దెత్తగాని

సెన్నగోడ మీనికెళ్లి

సేతులియ్యవే

చల్ సెన్నగోడ మీనికెళ్లి

సేతులియ్యవే

చరణం 1

గురియవన్నె సీరెగట్టి

గుద్దినట్టు గోసివెట్టి

గున్న గున్నవోయే

గునుకపూల సిన్నది

చల్ గున్న గున్నవోయే

గనుకపూల సిన్నది

చల్ గున్న గున్నవోయే

గనుకపూల సిన్నది

ఆ బంతి సేబంతి

సెలియ నీకు ఇత్తగాని

మా ఇంటికి మీ ఇంటికి

నడుమ నిచ్చనేత్త గాని

కట్టెల దడి మీనికెళ్లి

కన్ను గిలుపవే

గా కట్టెల దడి మీనికెళ్లి

కన్ను గిలుపవే

చరణం 2

అల్లిపూల సీరె గట్టి

అద్దాల రైక దొడిగి

ఆగమాగమచ్చె

అందమోళ్ల సిన్నది

చల్ ఆగమాగమచ్చె

అందమోళ్ల సిన్నది

చల్ ఆగమాగమచ్చే

అందమోళ్ళ సిన్నది

అరే ఆబంతి సేబంతి

సెలియ నీకు ఇత్తగాని

బతుకంత కాళ్ళకాడ

నేను వడీ సత్తగాని

అరుగుబండ మీనికెళ్లి

అలికిరియ్యవే

గా అరుగుబండ మీనికెళ్లి

అలికిరియ్యవే

చరణం 3

ఎర్రజీర గట్టుకోని

ఎండి గొలుసులు వెట్టుకోని

ఎన్నెలోలే ఎల్లే

ఎచ్చిరికాల సిన్నది

చల్ ఎన్నెలోలే ఎల్లే

ఎచ్చిరికాల సిన్నది

చల్ ఎన్నెలోలే ఎల్లే

ఎచ్చిరికాల సిన్నది

ఆ బంతి సేబంతి

సెలియ నీకు ఇత్తగాని

నీ అడుగుల నడిసచ్చి

ఏడడుగూలేత్తగాని

పందిరి గుంజ సాటుకెళ్లి

పలుకరియ్యవే

చల్ పందిరి గుంజ సాటకెళ్లి

పలుకరియ్యవే

చరణం 4

మామిడంచు సీరెగట్టి

మల్లెపూలు శికల వెట్టి

మౌనంగ వోయే

మట్టి కాళ్ళ సిన్నది

చల్ మౌనంగ వోయే

మట్టి కాళ్ళ సిన్నది

చల్ మౌనంగ వోయే

మట్టి కాళ్ళ సిన్నది

ఆ బంతి సేబంతి

సెలియ నీకు దెత్తగాని

నువ్వు గోరుకుంటే

నా పాణమైన ఇత్తగాని

గడిగొయ్యల మీనికెళ్లి

సైగ జేయ్యవే

గా గడిగొయ్యల మీనికెళ్లి

సైగ జేయ్యవే

34
పల్లెటూరి ప్రేమకు చాటేలా సాంగ్..
Image Credit : Screeshot to MV Music & Movies

పల్లెటూరి ప్రేమకు చాటేలా సాంగ్..

పల్లెటూరి ప్రేమను అంటే కాస్త మొరటుగా సాగే ప్రేయసి ప్రియుడి సరసాలను ఈ పాటలో చక్కని పదాలతో వివరించారు. అమ్మాయి వివిధ రంగుల చీరలు కట్టి అందంగా ముస్తాబై వెళుతుంటే ఆమెను ప్రియుడు పిలుస్తున్నట్లుగా సాగుతుంది. అయితే ''గురియవన్నె సీరెగట్టి..గుద్దినట్టు గోసివెట్టి'' అంటూ మొదటి చరణంపై సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. కేవలం లిరిక్స్ మాత్రమే కాదు మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది... అందుకే ఈ ఫోక్ జనాల్లోకి బలంగా వెళ్లింది. యూట్యూబ్ లో కోటి వ్యూస్ కి చేరువచ్చింది ఈ సాంగ్.

44
గున్నగున్నవోయె సాంగ్ టీమ్ ఇదే..
Image Credit : Screeshot to MV Music & Movies

గున్నగున్నవోయె సాంగ్ టీమ్ ఇదే..

అచ్చ తెలంగాణ యాసలో సాగే ఈ గున్నగున్నవోయె సిన్నది సాంగ్  ను ఎంవి మ్యూజిక్ ఆండ్ మూవీస్ యూట్యూబ్ లో ఛానెల్ రూపొందించింది. ఈ పాటకు లిరిక్స్, మ్యూజిక్ తో పాటు డైరెక్షన్ చేసింది ఎస్వి మల్లిక్ తేజ... ప్రొడ్యూసర్ ఒర్సు (RK). అందమైన పదాలతో కూడిన ఈ పాట సరికొత్త గొంతులో మోగింది... అందుకే ఇంత అద్భుతంగా వచ్చింది. లచ్చుమక్క బొడుగు ఈ పాట ద్వారా సింగర్ గా పరిచయం అయ్యారు. గున్నగున్నవోయె సాంగ్ ను వైష్ణవి సోని, ఈశ్వర్ సాయి డ్యాన్స్ మరో స్థాయికి తీసుకెళ్లాయి. మై విలేజ్ షో గంగవ్వ, సింగర్ లచ్చుమక్క బొడుగు కూడా మధ్యలో కనిపిస్తూ మరింత పల్లెటూరు టచ్ ఇచ్చారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Recommended image2
Folk Song : ప్రేయసి మాటలే పాటగా మారితే.. మనసుదోచే ఈ మాస్ ఫోక్ వింటే ఫిదా అవ్వాల్సిందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved