MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Peddi Stars Remuneration: పెద్ది కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నది ఎవరు? రామ్ చరణ్, జాన్వీకి ఎంతిచ్చారంటే?

Peddi Stars Remuneration: పెద్ది కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నది ఎవరు? రామ్ చరణ్, జాన్వీకి ఎంతిచ్చారంటే?

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ సాధించింది. సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న పెద్ది సినిమాలో ఎంతో మంది స్టార్స్ నటించారు. మరి వారి రెమ్యూనరేషన్ సంగతేంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 19 2026, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఊహించని రేంజ్ లో పెద్ది స్టార్స్ రెమ్యునరేషన్లు
Image Credit : Asianet News

ఊహించని రేంజ్ లో పెద్ది స్టార్స్ రెమ్యునరేషన్లు

డైరెక్టర్ బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా భారీ బడ్టెట్ మూవీ పెద్ది. తాజాగా ఈసినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈమూవీపై అంచనాలను పెంచేసింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈసినిమాలో అందరు స్టార్స్ కు ఎంతెంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసా? దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నది ఎవరు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
రామ్ చరణ్
Image Credit : instagram

రామ్ చరణ్

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది సినిమా కోసం స్టార్ల రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో నటించినందుకు రామ్ చరణ్ ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యధికం. దీనికి ముందు RRR ,గేమ్ ఛేంజర్ సినిమాల కోసం ఆయన 50 కోట్ల వరకూ ఛార్జ్ చేశారని తెలుస్తోంది.

38
జాన్వీ కపూర్
Image Credit : instagram

జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాల్లోనూ వరుసగా నటిస్తూ బిజీగా ఉంది. 'పెద్ది' సినిమాలో ఆమె రామ్ చరణ్ పక్కన హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీలో నటించినందుకు ఆమె 6 కోట్ల వరకూ రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. దీనికి ముందు ఆమె 'దేవర' అనే సౌత్ సినిమాలో కనిపించారు. పెద్ది తరువాత జాన్వీ దేవర 2లో నటించబోతుంది.

48
దివ్యేందు శర్మ
Image Credit : instagram

దివ్యేందు శర్మ

బాలీవుడ్ స్టార్ నటుడు దివ్యేందు శర్మ కూడా 'పెద్ది' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించిన దివ్యేందు, ఈ సినిమా కోసం 7 కోట్ల రూపాయల ఫీజు తీసుకున్నారట.

58
జగపతి బాబు
Image Credit : instagram

జగపతి బాబు

జగపతి బాబు 'పెద్ది' సినిమాలో పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని, గుర్తుపట్టడం కష్టమని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆయనకు 5 కోట్ల రూపాయల వరకూ పారితోషికం అందుకున్నట్టు సమాచారం.

68
శివ రాజ్ కుమార్
Image Credit : Asianet News

శివ రాజ్ కుమార్

పెద్ది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్. ఆయన ఈసినిమాలో రామ్ చరణ్ కు గురువు పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. శివన్న లుక్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈసినిమాలో నటించడానికి శివరాజ్ కుమార్ దాదాపు 10 కోట్లు తీసుకున్నట్టు సమాచారం.

78
బోమన్ ఇరానీ
Image Credit : instagram

బోమన్ ఇరానీ

బోమన్ ఇరానీ కూడా కొంతకాలంగా బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. రామ్ చరణ్ 'పెద్ది'లో ఆయనది ఒక ప్రత్యేక పాత్ర. ఈ సినిమాలో నటించినందుకు ఆయనకు 3 కోట్ల రూపాయల ఫీజు అందింది.

88
బుచ్చి బాబు సానా
Image Credit : instagram

బుచ్చి బాబు సానా

'పెద్ది' డైరెక్టర్ బుచ్చి బాబు సానా తన సినిమాపై చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఈ సినిమాను తీయడానికి ఆయన చాలా కష్టపడ్డారని చెబుతున్నారు. 'పెద్ది' సినిమాను డైరెక్ట్ చేసినందుకు ఆయన 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
జాన్వీ కపూర్
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Deva: 400 సినిమాలు.. ఇళయరాజా హవాకు ఎదురెళ్లి.. ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దేవా!
Recommended image3
Music Director Deva: తొలిప్రేమ, భాషా సినిమాల సంగీత దర్శకుడు దేవా కన్నుమూత..
Related Stories
Recommended image1
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Recommended image2
100 కోట్ల క్లబ్‌లో సూర్య ఆరో సినిమా.. లిస్టులో ఇంకా ఏ మూవీస్ ఉన్నాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved