- Home
- Entertainment
- శోభన్ బాబుని చేతగాని హీరో అని తిట్టిన స్టార్ విలన్, కట్ చేస్తే తిండి కూడా లేక హీరోని సాయం అడిగిన నటుడు ఎవరు?
శోభన్ బాబుని చేతగాని హీరో అని తిట్టిన స్టార్ విలన్, కట్ చేస్తే తిండి కూడా లేక హీరోని సాయం అడిగిన నటుడు ఎవరు?
శోభన్ బాబును సెట్ లోనే తిట్టాడు ఓ స్టార్ నటుడు. అసలు చేతగాని వారిని సెట్స్ లోకి ఎందుకు తీసుకువస్తారు? హీరోలుగా ఎందుకు తీసుకుంటారు అంటూ రెచ్చిపోయారు. సీన్ కట్ చేస్తే.. కొన్నాళ్ళకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో శోభన్ బాబు గుమ్మం తొక్కారట ఆస్టార్ నటుడు. అప్పుడు శోభన్ బాబు ఏం చేశారు? రివేంజ్ తీర్చుకున్నారా? లేక సాయం చేసి పంపించారా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
sobhan babu
రోజులన్నీ ఒకేలా ఉండవు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయని పెద్దలు ఊరికే సమెతలు చెప్పలేదు. టైమ్ నడుస్తుంది కదా అని ఎగిరెగిరి పడితే.. అటువైపు ఉన్నవారికి కూడా ఒక టైమ్ వస్తుంది. అలాంటి పరిస్థితినే ఫేస్ చేశాడు టాలీవుడ్ స్టార్ నటుడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న టైమ్ లో కన్ను మిన్ను కానకుండా యాటీట్యూడ్ చూపించిన ఆ సీనియర్ నటుడు, ఆతరువాత తిండికి కూడా లేకుండా ఇబ్బందులు పడ్డాడు. పైగా తను ఓ సందర్భంలో అవమానించిన శోభన్ బాబు దగ్గరే వెళ్ళి సాయం అడుక్కోవలసిన పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇంతకీ ఎవరా నటుడు, ఏంటా కథ?
Also Read: నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, దేవర 2 పనులు మొదలు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ టీమ్
శోభన్ బాబును అవమానించిన ఆ స్టార్ నటుడు ఎవరో కాదు రాజనాల. ఒకప్పుడు బిజీ విలన్. రాజనాల సెట్ లో ఉంటే అందరు సైలెంట్ గా ఉండేవారు. ఆయన నటన అద్భుతం. విలన్ అంటే అప్పట్లో రాజనాలే గుర్తుకు వచ్చేవారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, లాంటి మైథలాజికల్ విలన్ గా మాత్రమే కాదు గళ్ల లుంగీ కట్టుకుని సోషల్ విలనిజం కూడా చూపించారు రాజనాల. ఆయన గొప్ప నటుడే.. కాని కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన పనులు విమర్శల పాలు అయ్యేలా చేశాయి.
Also Read: పాకిస్తాన్ పై బూతులతో రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ, ఒక్క ఛాన్స్ ఇస్తే అంతు చూస్తానంటున్న రౌడీ హీరో
శోభన్ బాబు హీరోగా ఎదుగుతున్న టైమ్ లో వీరాభిమాన్యు సినిమాలో అవకాశం వచ్చింది. అప్పుడు అందులో రాజనాల దుర్యోధనుడి పాత్రలో ఉన్నారు. సెట్ లో ఓ సీన్ లో శోభన్ బాబు చేతిలో గద విరిగి రాజనాల తలకు తగిలిందట. దాంతో రాజనాల నుదిటిపై కాస్త రక్తం కూడా వచ్చిందట. దాంతో ఆవేశంతో ఊగిపోయిన రాజనాల శోభన్ బాబుపై ఫైర్ అయ్యారు. ఆయన క్షమించమని అడిగినా ఊరుకోకుండా డైరెక్టర్ గారు ఇలాంటి వారిని ఎందుకు హీరోగా తీసుకువస్తారు, నేను బిజీ ఆర్టిస్ట్ ను, ఇలా చేస్తే ఎలా అంటూ.. హీరోను వెంటనే మార్చేయండి అన్నారట.
అలాంటి సంఘటన తరువాత సీన్ కట్ చేస్తే.. కొన్నేళ్ళకు రాజనాల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఆస్తులు పోయి, ఆరోగ్యం చెడిపోయి ఓ కారు షెడ్డులో ఆయన తలదాచుకోవలసిన పరిస్థితులు వచ్చాయి. దాంతో సాయం కోసం శోభన్ బాబు గుమ్మం తొక్కారట రాజనాల. అప్పుడు జరిగినది గుర్తు పెట్టుకుని శోభన్ బాబు ఏం అంటారా అని ఆలోచిస్తూనే వెళ్ళారట. కాని శోభన్ బాబు మాత్రం అది ఏమాత్రం మనసలో పెట్టుకోకుండా..గొప్ప నటుడు తన ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషించారు.
Also Read: పహల్గాం ఉగ్రదాడిపై ట్వీట్, షారుఖ్ ఖాన్ పై ట్రోలింగ్
అంతే కాదు రాజనాలను సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి, సపర్యలు చేశారు. మంచి భోజనం పెట్టించి కవర్ లో డబ్బు పెట్టి రాజనాల జేబులో పెట్టారు. శోభాన్ బాబు చేసిన పనికి, గతంలో తాను చేసిన పని గుర్తుకు వచ్చి రాజనాల కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక ఇంటికి వెళ్ళి ఆ కవర్ లో చూసుకుంటే 20 వేల రూపాయలు అందులో ఉన్నాయట. అప్పట్లోనే 20 వేలు అంటే.. అది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పాలి. అలా రాజనాలకు సాయం చేసితన మంచి మనసు చాటుకున్నారు శోభన్ బాబు.