- Home
- Entertainment
- బాలయ్యతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి, ఆ ఇంటికే కోడలిగా వెళ్లిన హీరోయిన్ ఎవరో తెలుసా?
బాలయ్యతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి, ఆ ఇంటికే కోడలిగా వెళ్లిన హీరోయిన్ ఎవరో తెలుసా?
నందమూరి నటసింహం బాలయ్య తో ఎన్నో సినిమాల్లో రొమాన్స్ చేసిన హీరోయిన్.. ఆతరువాత ఆ ఇంటికే కోడలిగా వెళ్లిందని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా స్టార్ హీరోయిన్.?

తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి నేటి ఎన్టీఆర్ వరకూ ఈ ఫ్యామిలీ నుంచి అనేక మంది హీరోలు తెలుగు సినిమాలో స్టార్లుగా ఎదిగారు. ఎన్టీఆర్ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది నందమూరి బాలకృష్ణ.
సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి లాంటి ఫ్యాక్షన్ చిత్రాలతో బలమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న బాలయ్య రీసెంట్ గా డాకు మహారాజ్’ సినిమాతో మరో విజయం నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం అఖండ సీక్వెల్ అయిన ‘అఖండ 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. 100కు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య అనేకమంది స్టార్ హీరోయిన్లతో స్క్రీన్‌ను షేర్ చేసుకున్నాడు.
అయితే ఈ హీరోయిన్లలో ఎక్కవగా బాలయ్యతో సినిమాలు చేసిన ఓ హీరోయిన్ బాలకృష్ణకు బంధువుగా మారిందని మీకుతెలుసా? ఆమె ఎవరో కాదు... లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. అప్పట్లో బాలకృష్ణ – విజయశాంతి జంటగా బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘నిప్పురవ్వ’ సాహస సామ్రాట్ వంటి హిట్ సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి.
విజయశాంతి 1988లో ఎం.వి. శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ బాలకృష్ణకు బంధువు అవుతాడు. బాలయ్య పెద్దబావ గణేష్ రావుకు శ్రీనివాస్ ప్రసాద్ మేనల్లుడు. ఈ నేపథ్యంలో బాలయ్య, ప్రసాద్‌ల మధ్య సన్నిహితమైన స్నేహబంధం ఏర్పడింది.
ఈ స్నేహానికి గుర్తుగా యువరత్న ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ ప్రసాద్ ‘నిప్పురవ్వ’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాలో హీరోయిన్‌గా విజయశాంతిని తీసుకోవాలని భావించిన ప్రసాద్ స్వయంగా ఆమెను సంప్రదించారు. ఈ పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లితో బలపడింది.
ఇలా బాలకృష్ణతో కలిసి పలు సినిమాల్లో నటించిన విజయశాంతి, ఆ తర్వాత అదే బాలకృష్ణకు వరుసకు కోడలయ్యింది. ఇక విజయశాంతి ఈ మధ్యే రీ ఎంట్రీ ఇచ్చి.. సెలక్టీవ్ గా సినిమాలు చేస్తోంది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిమెపన్పించి. తాజాగా కళ్యాణ్ రామ్ తల్లిగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలోను నటించింది.