MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijayashanti: పవన్ భార్యపై నోటికొచ్చినట్లు కూస్తే.. తాటతీస్తా.. విజయశాంతి మాస్‌ వార్నింగ్‌!

Vijayashanti: పవన్ భార్యపై నోటికొచ్చినట్లు కూస్తే.. తాటతీస్తా.. విజయశాంతి మాస్‌ వార్నింగ్‌!

Vijayashanti: పవన్‌ కల్యాణ్‌ భార్య అన్న లెజినోవా తన కుమారుడు మార్క్‌ శంకర్‌ అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నారు. ఇటీవల ఆమె తిరుపతికి వచ్చి తన మొక్కును చెల్లించుకున్నారు. సంప్రదాయబద్దంగా తలనీలాలు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. అన్నలెజినోవా తలనీలాలు సమర్పించడంపై కొందరు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై సినీనటి, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి ట్రోలర్స్‌పై ఫైర్‌ అయ్యారు.

Bala Raju Telika | Published : Apr 16 2025, 10:18 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

ఎనిమిదేళ్ల పవన్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ సింగపూర్‌ సమ్మర్‌ క్యాంపులో ఉండగా.. అక్కడ అగ్నిప్రమాదం జరిగింది. దీనిలో అతని చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాబుని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో గండం తప్పింది. ఇక శంకర్‌ కొంత వరకు కోలుకున్నాక ఇటీవల పవన్‌ హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ఆ తర్వాత పవన్‌ సతీమణి లెజినోవో తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. 

24
pawan kalyan s wife anna lezhneva donates her hair at tirumala

pawan kalyan s wife anna lezhneva donates her hair at tirumala

లెజినోవా స్వస్థలం రష్యా.. ఆమె పుట్టుకతోనే క్రిస్టియన్‌.. అయినా కూడా పవన్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి హిందూమతాచారాలను గౌరవిస్తూ వస్తున్నారు. పలు సందర్బాల్లో పవన్‌తోపాటు బొట్టు పెట్టుకుని పూజలు కూడా చేసేవారు. ఇక పవన్‌ కొంత కాలంగా హిందూ మతపరిరక్షణలో భాగంగా సనాతనధర్మంపై ప్రచారం చేస్తున్నారు. గతంలో పవన్‌ తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని తిరుపతికి తీసుకొచ్చి లెజినోవా కుమార్తెతో డిక్లరేషన్‌ ఇప్పించి స్వామి వారి దర్శనం చేయించారు. 

34
Asianet Image

మార్క్ శంకర్‌ క్షేమంగా ఇంటికి చేరుకుంటే తిరుమలకు వస్తానని లెజినోవా మొక్కుకున్నారట. శంకర్‌ హైదరాబాద్‌ చేరుకున్న వెంటనే ఆమె తిరుమలకు వచ్చారు. ముందుగా డిక్లరేషన్‌ ఇచ్చి తలనీలాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత అన్నదానానికి రూ.17లక్షలు విరాళంగా ప్రకటించారు. లెజినోవా పరమతస్తురాలు అయినప్పటికీ తిరుమలలో స్వామి వారికి తలనీలాలు సమర్పించడంపై జనసేన శ్రేణులు, కూటమి పార్టీ కేడర్‌, హిందూ సంఘాలు హర్షించాయి. అయితే.. కొందరు మాత్రం పరమతస్తురాలు తలనీలాలు సమర్పించడం, అందులోనూ మహిళలు సమర్పించడం సరికాదని ట్రోల్స్‌ చేస్తున్నారు. 

 

44
Asianet Image

పవన్‌ భార్యపై జరుగుతున్న ట్రోల్స్‌పై సీనియర్ నటి విజయశాంతి స్పందించారు. పుట్టుకతోనే పరమతాన్ని స్వీకరించినా, ఇండియాకు వచ్చి హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవాపై కొందరు ట్రోల్స్‌ చేయడం అత్యంత అసమంజసం అని ఆమె ఫైర్‌ అయ్యారు. అనూహ్యంగా జరిగిన ఘటనలో అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడేందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం శ్రీ వేంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్ కు విరాళం సమర్పించి సేవ కూడా చేశారని, సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాను ట్రోల్ చేసేవారిది ముమ్మాటికి తప్పేనని విజయశాంతి ఖండించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. 

Bala Raju Telika
About the Author
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత. Read More...
తెలుగు సినిమా
తిరుపతి
ఆధ్యాత్మిక విషయాలు
పవన్ కళ్యాణ్
జనసేన
ఆంధ్ర ప్రదేశ్
రాజకీయాలు
 
Recommended Stories
Top Stories