MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tamannaah: మరో హీరోయిన్ ప్రేమలో తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్..? జవాన్ నటితో విజయ్ వర్మ డేటింగ్..

Tamannaah: మరో హీరోయిన్ ప్రేమలో తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్..? జవాన్ నటితో విజయ్ వర్మ డేటింగ్..

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్ లు కామన్ అయిపోయాయి.. ఇలా ప్రేమించుకుని అలా బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. కొన్ని జంటలు మాత్రమే పెళ్లి వరకూ వెళ్లున్నాయి. తాజాగా విజయ్ వర్మ,  తమన్నాబ్రేకప్ స్టోరీలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంతకీ అదేంటంటే?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 27 2026, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తమన్నా   విజయ్ వర్మ బ్రేకప్.. ?
Image Credit : our own

తమన్నా - విజయ్ వర్మ బ్రేకప్.. ?

స్టార్ జంటలు ప్రేమించుకోవడం.. బ్రేకప్ లు చెప్పుకోవడం కామన్ అయిపోయింది. కానీ ఈ విషయాన్ని అభిమానులు మాత్రం తీసుకోలేకపోతున్నారు. అంత ఈజీగా మార్చిపోలేకపోతున్నారు. అలాంటి జంటల్లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, హీరోయిన్ తమన్నా భాటియా కూడా ఉన్నారు. దాదాపు రెండేళ్ల పాటు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అభిమానులు భావించారు. అయితే అనూహ్యంగా వీరిద్దరూ విడిపోవడం అభిమానులకు పెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
షూటింగ్ టైమ్ లో చిగురించిన ప్రేమ..
Image Credit : Social Media

షూటింగ్ టైమ్ లో చిగురించిన ప్రేమ..

విజయ్ వర్మ, తమన్నా భాటియా ఇద్దరూ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 లో నటించారు. ఈసినిమా షూటింగ్ టైమ్ లో వీరి మధ్య ప్రేమ పుట్టినట్టు సమాచారం. ఈమూవీ కంప్లీట్ అయ్యే టైమ్ కు వీరు మరింతగా దగ్గరయ్యారని తెలుస్తోంది. ఆ తర్వాత పలు సందర్భాల్లో తమ సంబంధాన్ని పరోక్షంగా అంగీకరించారు. ఇక దాదాపు ఏడాదికిపై గా చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఈ జట.. పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇద్దరు ఎప్పుడు ఈ విషయాలను పబ్లిక్ గా ఒప్పుకోలేదు.

36
రెండేళ్లకే ముగిసిన బంధం..
Image Credit : Instagram

రెండేళ్లకే ముగిసిన బంధం..

సాఫీగా సాగిపోతుందనుకున్న విజయ్ - ‌తమన్నా ప్రేమ కథలో.. 2025 ప్రారంభం నుంచి విభేదాలు మొదలయ్యాయని సోషల్ మీడియా కోడై కూసింది. పెళ్లి విషయంలో అభిప్రాయ భేదాలే ఈ బ్రేకప్‌కు కారణమని బీటౌన్ వర్గాల్లో చర్చ జరిగింది. తమన్నా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి విజయ్ వర్మతో ఉన్న ఫోటోలను తొలగించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 2025 మార్చి నాటికి వీరిద్దరూ అధికారికంగా విడిపోయినట్లు సమాచారం.

46
జవాన్ నటితో విజయ్ వర్మ డేటింగ్?
Image Credit : moneycontrol.com

జవాన్ నటితో విజయ్ వర్మ డేటింగ్?

ఇదిలా ఉంటే, తమన్నాతో విడిపోయిన కొద్ది కాలానికే విజయ్ వర్మ మరో నటి తో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్ గా ముంబైలో విజయ్ వర్మ, అలియా ఖురేషితో కలిసి డిన్నర్‌కు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ కలిసి బయటకు రావడం, ఒకే కారులో వెళ్లడం వంటి వీడియోలు నెట్టింట్లో కనిపించాయి. దాంతో సోషల్ మీడియాలో ఈ విషయంపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

56
వెబ్ సిరీస్ కలిపిన బంధం..
Image Credit : instagram

వెబ్ సిరీస్ కలిపిన బంధం..

గతంలో విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్‌తో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ కూడా వినిపించాయి. అయితే తాజా పరిణామాలతో అలియా ఖురేషితో కొత్త సంబంధం మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విజయ్ వర్మ నటిస్తున్నమట్కాకింగ్ వెబ్ సిరీస్‌లో అలియా ఖురేషి కూడా నటిస్తోంది. ఈవెబ్ సరీస్ షూటింగ్ లోనే వీరి బంధం బలపడిందన్న టాక్ వినిపిస్తోంది.

66
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి..
Image Credit : Asianet News

ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి..

అలియా ఖురేషి బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ స్టార్. ఆమె బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ Jawan లో కీలక పాత్ర పోషించి ‘జాన్వి’ పాత్రతో గుర్తింపు పొందింది. నటిగానే కాకుండా గాయని, సాంగ్ రైటర్‌గా కూడా ఆమెకు మంచి పేరు ఉంది. వెబ్ సిరీస్‌ల ద్వారా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తోంది.ప్రస్తుతం విజయ్ వర్మ, అలియా ఖురేషి డేటింగ్ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటనలు లేవు. ఈ వార్తలు కేవలం రూమర్స్ గా మాత్రమే వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంతా అనేది చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: విజయ్ దేవరకొండపై రష్మిక మందన్న షాకింగ్ కామెంట్స్.. అలా అనేసిందేంటి?
Recommended image2
Srinidhi Shetty: ఆ విషయంలో యశ్ కంటే నానినే బెస్ట్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి సంచలన కామెంట్స్..
Recommended image3
Pawan-Singeetam Movie: జీసస్‌ కథతో పవన్‌ కళ్యాణ్‌ మూవీ.. సింగీతంతో చేయాల్సిన సినిమా ఎలా ఆగిపోయింది?
Related Stories
Recommended image1
Meena : మీనా నిర్ణయం వల్ల సౌందర్య కు దక్కిన అదృష్టం.. సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదంటే?
Recommended image2
Anushka Shetty : అనుష్కను మొదటిసారి చూసినప్పుడు నాగార్జున రియాక్షన్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved