MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajeev Kanakala: `నువ్వు 116 ఏళ్లు బతకాలి సుమ`.. భార్య గురించి నిజాలు చెబుతూ రాజీవ్ కనకాల ఎమోషనల్‌

Rajeev Kanakala: `నువ్వు 116 ఏళ్లు బతకాలి సుమ`.. భార్య గురించి నిజాలు చెబుతూ రాజీవ్ కనకాల ఎమోషనల్‌

యాంకర్ సుమ కనకాల నిర్వహిస్తున్న `ఫెస్టివల్స్ ఫర్ జాయ్` ఈవెంట్‌లో నటుడు రాజీవ్ కనకాల ఎమోషనల్ అయ్యారు. సుమ చేస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన స్టేజ్ మీదే కన్నీళ్లు పెట్టుకున్నారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 25 2026, 08:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భార్య సుమ గురించి చెబుతూ రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌
Image Credit : Asianet News

భార్య సుమ గురించి చెబుతూ రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌

సౌత్ ఇండియాలో స్టార్ హీరో హీరోయిన్ల డేట్స్ అయినా దొరుకుతాయేమో కానీ, టాప్ యాంకర్ సుమ కనకాల డేట్స్ దొరకడం అంత ఈజీ కాదు. రోజులో 24 గంటలు బిజీగా ఉండే సుమ, టీవీ స్క్రీన్ మీద ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తారు. అందరినీ నవ్విస్తుంటారు. కానీ, రీసెంట్‌గా జరిగిన ఒక ఈవెంట్‌లో సుమ, ఆమె భర్త రాజీవ్ కనకాల ఇద్దరూ స్టేజ్ మీదే కన్నీళ్లు పెట్టుకున్నారు. సుమ కనకాల ఆధ్వర్యంలో నడుస్తున్న 'ఫెస్టివల్స్ ఫర్ జాయ్' (Festivals For Joy) సేవా సంస్థ 5వ వార్షికోత్సవంలో ఈ ఎమోషనల్ సీన్ కనిపించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
23 ఏళ్లుగా గుప్తదానం
Image Credit : Asianet News

23 ఏళ్లుగా గుప్తదానం

ఈ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ, తన భార్య చేస్తున్న సేవలను తలచుకుని ఎమోషనల్ అయ్యారు. `నేను కొంచెం ఎమోషనల్ అవుతున్నాను, ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. సుమ ప్రయాణం మామూలుది కాదు. ఆమె పట్టుదల, కృషినే ఆమె సక్సెస్‌కు కారణం. ఫ్యామిలీని, కెరీర్‌ను ఆమె బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది. నా లాంటి మొగుడ్ని భరించడమే ఆమె సక్సెస్‌కు పెద్ద కారణం" అని సరదాగా అంటూనే కంటతడి పెట్టుకున్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. "సుమ సమాజ సేవ చేయడం నిన్నో మొన్నో మొదలుపెట్టింది కాదు. మా పెళ్లయిన రెండు మూడేళ్లకే, అంటే కరెక్ట్‌గా 23 ఏళ్ల క్రితమే ఆమె చారిటీ మొదలుపెట్టింది. ఇన్నేళ్లుగా ఎవరికీ తెలియకుండా ఎన్నో గుప్తదానాలు చేసింది. కష్టాల్లో ఉన్న అనాథలకు, వృద్ధాశ్రమాల్లో ఉన్న పెద్దవాళ్లకు పండుగ సంతోషాన్ని పంచడానికే రీసెంట్‌గా 'ఫెస్టివల్స్ ఫర్ జాయ్' సంస్థను అఫీషియల్‌గా మొదలుపెట్టింది" అని రాజీవ్ గర్వంగా చెప్పారు.

34
"నువ్వు 116 ఏళ్లు బతకాలి సుమ!"
Image Credit : Asianet News

"నువ్వు 116 ఏళ్లు బతకాలి సుమ!"

మాట్లాడుతూనే బాగా ఎమోషనల్ అయిన రాజీవ్ కనకాల.. "నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెప్తున్నాను. సుమ, నువ్వు నిండు నూరేళ్లు బతకాలి. నీకు 116 ఏళ్లు గ్యారెంటీ! ఇలాంటి సమాజ సేవను కంటిన్యూ చేయడానికి నువ్వు కనీసం 116 ఏళ్లు బతకాలి" అంటూ రెండు చేతులు జోడించి దండం పెడుతూ ఏడ్చేశారు.

44
భర్త కన్నీళ్లు తుడిచిన సుమ
Image Credit : Asianet News

భర్త కన్నీళ్లు తుడిచిన సుమ

భర్త స్టేజ్ మీద ఏడవడం చూసి కింద కూర్చున్న సుమ కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. లాస్ట్‌లో "లవ్ యూ సుమ" అని చెప్తూనే రాజీవ్ కన్నీళ్లు తుడుచుకుంటూ స్టేజ్ దిగారు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్లిన సుమ, భర్త చేయి పట్టుకుని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు. తన చేతులతో భర్త కన్నీళ్లు తుడిచి ఓదార్చారు.

ఈ స్టార్ కపుల్ మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమను, ఈ ఎమోషనల్ మూమెంట్‌ను చూసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేనితో పాటు అక్కడున్న గెస్ట్‌లంతా చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఫెస్టివల్స్ ఫర్ జాయ్

ఇది తెలుగు ఇండస్ట్రీ టాప్ యాంకర్ సుమ కనకాల స్థాపించిన రిజిస్టర్డ్ నాన్-ప్రాఫిట్ ఎన్జీవో (Non-Profit NGO). సమాజంలో ఉన్న పేదలు, అనాథ పిల్లల ముఖాల్లో నవ్వులు పూయించాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థను మొదలుపెట్టారు. రీసెంట్‌గానే ఈ సంస్థ విజయవంతంగా 5 వసంతాలు (5th Anniversary) పూర్తి చేసుకుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Deverakonda: పెళ్లై ఏడాది కూడా కాలేదు.. అప్పుడే మొదలెట్టారు, విజయ్-రష్మిక మధ్య గొడవలొచ్చాయా? నెట్టింట షాకింగ్ రూమర్స్!
Recommended image2
ANR: సావిత్రితో నటించడానికి నో చెప్పిన ఏఎన్నార్.. ఎన్టీఆర్ మహానటి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ..
Recommended image3
ఇండియాలోనే రిచ్ హీరోయిన్, 4వేల కోట్లకుపైగా సంపాదించిన నటి ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Jayasudha-Jayaprada: జయప్రద అంటే జయసుధకి ఎందుకంత కోపం.. మొహం మీదే కారణం చెప్పిన సహజనటి
Recommended image2
Top 10 OTT Movies: ఇండియావైడ్‌గా ఓటీటీలో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు..నెట్‌ ఫ్లిక్స్‌ టాప్‌ 10 మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved