MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • Meena : మీనా నిర్ణయం వల్ల సౌందర్య కు దక్కిన అదృష్టం.. సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదంటే?

Meena : మీనా నిర్ణయం వల్ల సౌందర్య కు దక్కిన అదృష్టం.. సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదంటే?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలిగారు మీనా, సౌందర్య. ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. అయితే మీనా తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల.. సౌందర్యకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా దక్కిన విషయం మీకు తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 26 2026, 02:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సౌత్ లో స్టార్లుగా వెలిగిన హీరోయిన్లు..
Image Credit : Asianet News

సౌత్ లో స్టార్లుగా వెలిగిన హీరోయిన్లు..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌందర్య, మీనా స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. హీరోయిన్ గా ఎదిగింది. కానీ సౌందర్య మాత్రం ఇండస్ట్రీలోకి రావడమే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలతో ఈ ఇద్దరు హీరోయిన్లు ఊపు ఊపేశారు.

 దాదాపు సౌత్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జు, వెంకటేష్, సుమన్, జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి హీరోల సరసన నటించిన ఇద్దరు తారలు .. తమిళంతో రజినీకాంత్, విజయ్ కాంత్, కమల్, శరత్ కుమార్ ల జంటగా కనిపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిన్న వయసులోనే కన్నుమూసిన సౌందర్య..
Image Credit : Asianet News

చిన్న వయసులోనే కన్నుమూసిన సౌందర్య..

అనుకోకుండా ఓ ప్రమాదంలో సౌందర్య అతి చిన్న వయసులోనే కన్నుమూసింది. ఆమె తోటి హీరోయిన్లలో కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. కానీ మీనా ఇప్పటికీ హీరోయిన్ పాత్రలు చేస్తోంది. దృశ్యం లాంటి సినిమాలలో హీరోయిన్ గా కనిపిస్తోంది మీనా. తల్లి పాత్రల్లోకి ఇంకా షిఫ్ట్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే తల్లి పాత్రలు చేయడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించడంలేదు అయితే మీనా, సౌందర్యకు సబంధించిన ఓ విషయం రీసెంట్ గా వైరల్ అవుతోంది. ఓ ఇంటర్వ్యూలో మీనా షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

Related Articles

Related image1
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ కోసం కోటి డిమాండ్ చేస్తున్న స్టార్ ఎవరో తెలుసా? ఈసారి రచ్చ రచ్చే..
Related image2
Anushka Shetty : అనుష్కను మొదటిసారి చూసినప్పుడు నాగార్జున రియాక్షన్ ఏంటో తెలుసా?
35
సౌందర్య కెరీర్ ను పరుగులు పెట్టించిన సినిమా..
Image Credit : Goldmines Gaane Sune Ansune youtube

సౌందర్య కెరీర్ ను పరుగులు పెట్టించిన సినిమా..

సౌందర్య తన కెరీర్ లో చేసిన హిట్ సినిమాల్లో.. రజినీకాంత్ జోడీగా నటించిన నరసింహ సినిమా ఒకటి. తమిళంలో ఈ సినిమాను పడయప్పగా తెరకెక్కించారు. ఈసినిమాలో రజినీకాంత్ జోడీగా సౌందర్య నటించగా.. నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఈమూవీలో సౌందర్యది చాలా అమాయకపు పాత్ర. ఇన్నోసెంట్ గా కనిపిస్తుంటుంది. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా మీనాను అనుకున్నారట మేకర్స్. అంతే కాదు మీనాకు కథ కూడా చెప్పారట. మీనాకు కూడా ఈసినిమా చేయాలనే ఉందట.

45
మీనా వల్ల సౌందర్యకు ఆఫర్..
Image Credit : Asianet News

మీనా వల్ల సౌందర్యకు ఆఫర్..

కానీ ఆపాత్రకు నువ్వు బాగోవు, వద్దు అని మీనా తల్లి ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. అంతకు ముందు ముత్తు సినిమాలో రజినీకాంత్ తో కలిసి మీనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమాను కూడా కేఎస్ రవికుమార్ డైరెక్ట్ చేశారు.. నరసింహా మూవీని కూడా రవికుమారే డైరెక్ట్ చేయడంతో.. మీనాను తీసుకోవాలని అనుకున్నారట. కానీ మీనా తల్ల ఒప్పుకోకపోవడంతో.. ఆ సినిమా చేసే లక్కీ ఛాన్స్ సౌందర్యకు దక్కింది. ఈసినిమాతో తమిళంలో సౌందర్య ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. మీనా ఈసినిమా చేసి ఉంటే…ఆమె కెరీర్ మరోస్థాయికి వెళ్లేది.  ఈ విషయాన్ని మీనా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

55
మీనా లైఫ్ లో అతి పెద్ద విషాదం..
Image Credit : Instagram

మీనా లైఫ్ లో అతి పెద్ద విషాదం..

సౌందర్య రాజకీయజీవితం స్టార్ట్ చేసిన కొద్ది కాలానికే ప్రమాదంలో మరణించగా.. మీనా పర్సనల్ లైఫ్ విషయంలో ఓ భారీ విషాదాన్ని చూసింది. ఆమె భర్త విద్యాసాగర్ 2022 సంవత్సరంలో కరోనా కారణంగా మరణించారు. అప్పటి నుంచి ఆమె వ్యక్తిగత జీవితంపై అనేక వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. 

గత కొంతకాలంగా ఆమెపై సోషల్ మీడియాలో వస్తున్న రెండో పెళ్లి రూమర్స్ చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తమిళ హీరో ధనుష్‌ను మీనా పెళ్లాడబోతున్నారనే వార్తలు అప్పట్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఆ సమయంలోనే మీనా ఆ వార్తలపై స్పందించారు. ఇలాంటి వార్తలను ఎక్కడి నుంచి పుట్టిస్తారో తెలియదంటూ మండిపడ్డారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
మీనా (నటి)
సౌందర్య
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Korean Kanakaraju 13 Days Collections: చతికిల పడ్డ కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ మూవీ టోటల్‌ ఎంత చేసిందంటే?
Recommended image2
Dil Raju: మహేష్, రాంచరణ్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో సూపర్ హిట్ కొట్టిన హీరో.. వాళ్ళు చేసుంటే సినిమా షెడ్డుకే
Recommended image3
Sowcar Janaki: ఐసీయూలో షావుకారు జానకి.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ కోసం కోటి డిమాండ్ చేస్తున్న స్టార్ ఎవరో తెలుసా? ఈసారి రచ్చ రచ్చే..
Recommended image2
Anushka Shetty : అనుష్కను మొదటిసారి చూసినప్పుడు నాగార్జున రియాక్షన్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved