MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anushka Shetty : అనుష్కను మొదటిసారి చూసినప్పుడు నాగార్జున రియాక్షన్ ఏంటో తెలుసా?

Anushka Shetty : అనుష్కను మొదటిసారి చూసినప్పుడు నాగార్జున రియాక్షన్ ఏంటో తెలుసా?

కింగ్ నాగార్జున వల్ల హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. స్వీటీగా ఉన్న ఆమెను అనుష్క అని పేరు మార్చింది కూడా ఆయనే. మొదటి సారి అనుష్కను చూసినప్పుడు నాగార్జున రియాక్షన్ ఏంటో తెలుసా?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 26 2026, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి జేజమ్మ..
Image Credit : Asianet News

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి జేజమ్మ..

సినిమాలు తగ్గించిన అనుష్క శెట్టి.. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన అనుష్క శెట్టి.. ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తోంది. ఎంతో మంది దర్శకులు కథలు పట్టుకుని ఆమె దగ్గరకు వెళ్లున్నా.. స్వీటీ మాత్రం సెలెక్టీవ్ గా వెళ్తోంది. ఈ మధ్య కాలంలో క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన ఘాటి` మూవీలో నటించింది అనుష్క.. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌ అయ్యింది. ఇక అప్పటి నుంచి కొత్తగా ఇంకా ఏ సినిమాని ప్రకటించలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
టాలీవుడ్ లో అనుష్క మార్క్..
Image Credit : Instagram

టాలీవుడ్ లో అనుష్క మార్క్..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనుష్క చాలా స్పెషల్ మార్క్ చూపించిందని చెప్పాలి. ఒకప్పుడు విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బ్లాక్ బస్టర హిట్లు కొట్టి.. టాలీవుడ్ లో హిస్టీరీ క్రియేట్ చేశారు. ఇక ఆమె తరువాత ఆ రేంజ్ లోఇమేజ్ అనుష్ కు మాత్రమే వచ్చింది. సూపర్ సినిమాతో కమర్షియల్ హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనుష్క.. నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ, వెంకటేష్, గోపీచంద్, సూర్య, విశాల్ లాంటి స్టార్స్ తో కలిసి నటించింది. అరుధతి సినిమాతో అనుష్క కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. జేజమ్మగా టాలీవుడ్ ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది అనుష్క. ఆతరువాత బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది.

37
అనుష్కను పరిచయం చేసిన నాగార్జున..
Image Credit : Asianet News

అనుష్కను పరిచయం చేసిన నాగార్జున..

అనుష్క ను హీరోయిన్‌గా పరిచం చేసింది కింగ్ నాగార్జున. కన్నడ ప్రాంతానికి చెందిన ఆమె.. ఎక్కడో ముంబాయిలో యోగ టీచర్‌గా పనిచేస్తుండగా.. అనుష్కని చూసి ఆమెని సినిమాల్లోకి తీసుకొచ్చారు. నాగార్జున జోడీగా సూపర్‌ సినిమాలో ఆమె నటించింది. ఇండస్ట్రీ, నటన గురించి ఏం తెలియకుండానే ఆమె సినిమాల్లోకి వచ్చింది. అయితే పూరీ జగన్నాథ్ ఆమెను తీసుకువచ్చినప్పుడు నాగార్జున ఆమెను కొన్ని విషయాలు అడిగారు. ఆమెకు ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ లేదని అనుకుని పంపిచేశారట. కానీ ఆతరువాత జరిగిన ఓ మ్యాజిక్ అనుష్కను స్టార్ హీరోయిన్ ను చేసింది.

47
అనుష్క శెట్టి ఫస్ట్ డైరెక్టర్..
Image Credit : Youtube

అనుష్క శెట్టి ఫస్ట్ డైరెక్టర్..

అనుష్క శెట్టిని చూసి హీరోయిన్ గా బాగుంటుంది అని నమ్మిన మొదటి దర్శకుడు పూరీ జగన్నాథ్. యోగా టీచర్ గా ఉన్న ఆమెను.. నాగార్జునకు పరిచయం చేసింది పూరీనే.  మాస్ సినిమాషూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకరాస్ లో జరుగుతోంది. అప్పుడు పూరీ జగన్నాథ్ సూపర్ సినిమా కోసం అనుష్కను తీసుకోవాలని.. ఆమెను వెంట పెట్టుకుని సెట్ కు వచ్చాడు. అక్కడే ఆమె ఇంటర్వ్యూ జరిగింది. 

57
అనుష్కను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాగార్జున రియాక్షన్..
Image Credit : Facebook/Anushka Shetty

అనుష్కను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాగార్జున రియాక్షన్..

అనుష్కను  చూసిన నాగార్జునర కొన్నిప్రశ్నలు వేశాడు. రైట్ చూడు, లెఫ్ట్ చూడు.. గడ్డం పైకి లేపు.. అటు ఇటు నడిచి చూపించు అని అడిగారు. అప్పుడు అనుష్క ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్టుగా నిర్లక్ష్యంగా చేసి చూపించింది. నడవడం కూడా ఏదో సరదాగా అటు ఇటు నడిచింది. దాంతో ఈ అమ్మాయికి సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదని పంపించేశారు నాగ్. కానీ ఆతరువాత ఎందుకో నాగార్జున మనసులో అనుష్క మొదులుతూనే ఉందట. అసలు ఎక్కడో యోగా టీచర్ గా చేసిన ఆమెకు సినిమా అంటే ఏం తెలుస్తుంది. మనమే ట్రైనింగ్ ఇవ్వాలి కదా? అని అనిపించి. మళ్లీ పిలిపించి సూపర్ లో అవకాశం ఇచ్చారు.

67
స్వీటీని అనుష్కగా మార్చింది ఎవరు?
Image Credit : Twitter

స్వీటీని అనుష్కగా మార్చింది ఎవరు?

ఈ విషయాలను నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో.. అనుష్క గెస్ట్ గా వచ్చినప్పుడు నాగార్జున గుర్తు చేశారు. అప్పటి నుంచి నా కళ్లముందే నువ్వు ఎదిగిన తీరు చూసి.. నేను గర్విస్తున్నాను అని నాగార్జున చాలా సంతోషంగా చెప్పారు. అనుష్కకు అప్పుడు నాగార్జున ఛాన్స్ ఇవ్వబట్టే.. టాలీవుడ్ కు ఇంత మంచి హీరోయిన్ దొరికింది. అంతే కాదు అప్పటి వరకూ స్వీటీ శెట్టిగా ఉన్న ఆమె పేరును అనుష్కగా మార్చింది కూడా నాగార్జుననే.

77
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్..
Image Credit : Twitter

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్..

సూపర్ సినిమా ప్లాప్ అయినా.. ఆమె నటన, గ్లామర్ తో ఆకట్టుకుంది అనుష్క. ఆ తర్వాత టాలీవుడ్‌ లో డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా ఆఫర్లు, సక్సెస్‌ అందుకొని స్టార్‌ అయిపోయింది. ప్రస్తుతం నచ్చిన సినిమాలు చేసుకుంటూ.. హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తోంది అనుష్క. 44 ఏళ్లు దాటినా.. ఇంకా బ్యాచిలర్ గానే మిగిలిపోయింది స్వీటీ. ప్రభాస్ తో ప్రేమలో ఉంది అని రూమర్స్ వినిపించినా.. ఇంత వరకూ పెళ్లి విషయంలో క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. మరి ఆమె పెళ్ళి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
అనుష్క శెట్టి
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Singeetham Life Story: సినిమాకి కొత్త రుచులు చూపించిన సింగీతం.. 60 చిత్రాలు, ఎన్నో అద్భుతాలు, ఎవరికీ తెలియని నిజాలు
Recommended image2
Singeetham Srinivasa Rao Passes Away: టాలీవుడ్ లో తీరని విషాదం, దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనీవాసరావు కన్నుమూత..
Recommended image3
Nagarjuna: బిగ్ బాస్ ఏం పీకలేడు అనుకున్నావా.. కోపంతో ఊగిపోయిన నాగార్జున, రౌడీ వేషాలు, చిల్లర కామెంట్లకు ఇచ్చిపడేశాడుగా
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ కోసం కోటి డిమాండ్ చేస్తున్న స్టార్ ఎవరో తెలుసా? ఈసారి రచ్చ రచ్చే..
Recommended image2
Vijayashanti : చావు బ్రతుకుల్లో ఉండి కూడా విజయశాంతి తో సినిమా చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved