MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Vijay CM: MGR పై విజయ్ దళపతి సంచలన కామెంట్స్, ఫస్ట్ స్పీచ్‌తోనే పొలిటికల్ హీట్

Vijay CM: MGR పై విజయ్ దళపతి సంచలన కామెంట్స్, ఫస్ట్ స్పీచ్‌తోనే పొలిటికల్ హీట్

ఇన్నాళ్లూ మిమ్మల్ని క్యూలలో నిలబెట్టి మోసం చేసిన రెండు పార్టీలను పక్కనపెట్టారు. మీరు నన్ను సీఎంని కాదు, మీ 'మొదటి సేవకుడి'ని చేశారు అని తమిళనాడు సీఎం విజయ్ తన తొలి బహిరంగ సభలో  సంచలన కామెంట్స్ చేశారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 02 2026, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సీఎం అయ్యాక ఫస్ట్ స్పీచ్..
Image Credit : X

సీఎం అయ్యాక ఫస్ట్ స్పీచ్..

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త శకం మొదలైంది. వెండితెరపై విలన్లను ఉతికి ఆరేసిన 'దళపతి' విజయ్, ఇప్పుడు పొలిటికల్ పిచ్‌పై ప్రత్యర్థుల వికెట్లు పడగొట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎం అయ్యాక తిరుచిరాపల్లిలో జరిగిన తన మొదటి భారీ ర్యాలీలో విజయ్ (Thalapathy Vijay) మాట్లాడిన తీరు ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. అది కేవలం స్పీచ్ కాదు, ప్రత్యర్థులకు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
MGR రికార్డ్.. విజయ్ వినయం
Image Credit : Twitter

MGR రికార్డ్.. విజయ్ వినయం

ర్యాలీకి పోటెత్తిన జనసంద్రాన్ని చూసి ఎమోషనల్ అయిన విజయ్, ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. "తమిళనాడు ఆరాధ్య దైవం, దివంగత సీఎం MGR గారికి కూడా తన మొదటి ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓట్లు రాలేదు. అలాంటి అద్భుతమైన సపోర్ట్ ను మీరు నాకు, మన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీకి ఇచ్చారు" అని గట్టిగా చెప్పారు. కానీ, వెంటనే "అయ్యో, నేను నన్ను MGR గారితో పోల్చుకోవట్లేదు. ఆయన ఒక మహానాయకుడు. నేను కేవలం MGR, అన్నా, పెరియార్ చూపిన దారిలో నడవడానికి వచ్చిన మీ ఇంటి బిడ్డను" అని చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు.

35
డీఎంకే - ఏఐఏడీఎంకే ఆటకు బ్రేక్
Image Credit : Asianet News

డీఎంకే - ఏఐఏడీఎంకే ఆటకు బ్రేక్

దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే అనే రెండు పెద్ద పార్టీల ఆధిపత్యానికి విజయ్ చెక్ పెట్టారు. "ఇన్నేళ్లుగా మిమ్మల్ని క్యూలలో నిలబెట్టి మోసం చేసిన ఇద్దరినీ మీరు తిరస్కరించారు. ఆరు నెలలు సైలెంట్‌గా ఉంటాడని నా గురించి అన్నారు. కానీ ఆరు రోజులు కూడా వాళ్లు సైలెంట్‌గా ఉండలేకపోయారు. మీరు నన్ను కేవలం ముఖ్యమంత్రిని చేయలేదు, మీ 'మొదటి సేవకుడి'గా ఎన్నుకున్నారు" అని విజయ్ ఎమోషనల్‌గా మాట్లాడారు.

45
2026 ఎన్నికల్లో విజయ్ హవా
Image Credit : our own

2026 ఎన్నికల్లో విజయ్ హవా

ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఏకంగా 108 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది. స్వయంగా విజయ్ రెండు చోట్ల పోటీ చేసి, రెండింటిలోనూ ఘన విజయం సాధించారు. చెన్నై పెరంబూర్ లో విజయ్ 1,19,454 ఓట్లు సాధించి, 53,532 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. తిరుచిరాపల్లి ఈస్ట్ లో 91,381 ఓట్లు పొంది, 27,416 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రస్తుతం విజయ్ తిరుచిరాపల్లి స్థానానికి రాజీనామా చేసి, చెన్నై పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

55
సినిమా స్టైల్ పాలిటిక్స్
Image Credit : Asianet News

సినిమా స్టైల్ పాలిటిక్స్

తెరపై హీరోగా ప్రేక్షకులను మెప్పించిన విజయ్, ఇప్పుడు రియల్‌గా ప్రజల సేవకు సిద్ధమయ్యారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక విప్లవాత్మక మార్పులు విజయ్ తీసుకొచ్చారు. గుడి,బడికి దూరంగా వైన్ షాపులు తరలించడం, గతంలో ముఖ్యమంత్రుల స్కీములు తీసివేయకుండా కంటీన్యూ చేయడంతో పాటు చాలా విషయాల్లో విజయ్ దూకుడు చూపించాడు. 

ఇక 1977 నుంచి 1987 వరకు తమిళనాడును పాలించిన తొలి యాక్టర్ MGR దారిలోనే విజయ్ నడుస్తుండటం అభిమానుల్లో కొత్త ఆశలు రేపుతోంది. మొత్తానికి, దళపతి పొలిటికల్ జర్నీ ముందు ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image2
Vijay Thalapathy : నా గర్భం పోడానికి కారణం సీఎం విజయ్.. బిగ్ బాస్ నటి సంచలన ఆరోపణలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved