MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay Rashmika: విజ‌య్‌, ర‌ష్మిక‌ల వివాహంపై స్పందించిన ప్ర‌ధాని మోదీ.. ఏమ‌న్నారంటే.?

Vijay Rashmika: విజ‌య్‌, ర‌ష్మిక‌ల వివాహంపై స్పందించిన ప్ర‌ధాని మోదీ.. ఏమ‌న్నారంటే.?

Vijay Rashmika: స‌స్పెన్స్‌కు తెర‌తీస్తూ టాలీవుడ్ క్యూట్ క‌పుల్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌లు పెళ్లితో ఒక్క‌టి కానున్నారు. దీంతో ప‌లువురు సెల‌బ్రిటీలు విషెస్ చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సైతం వీరి వివాహంపై స్పందించారు 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 25 2026, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉదయ్‌పూర్‌లో విజయ్–రష్మిక పెళ్లి సందడి
Image Credit : rashmika_mandanna/Instagarm, ANI

ఉదయ్‌పూర్‌లో విజయ్–రష్మిక పెళ్లి సందడి

టాలీవుడ్ ప్రేమ జంట‌ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. గురువారం (ఫిబ్రవరి 26) వీరి వివాహం జరగనుండగా, ఇప్పటికే కుటుంబ సభ్యులు, సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు పూర్తి కావడంతో వేడుకలు సందడిగా కొనసాగుతున్నాయి. అభిమానుల్లో ఈ వివాహంపై భారీ ఆసక్తి నెలకొంది.

25
పెళ్లికి ముందు వేడుకలు హైలైట్
Image Credit : Rashmika Mandanna/Instagram

పెళ్లికి ముందు వేడుకలు హైలైట్

వివాహానికి ముందే పలు సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రోజున పెళ్లికొడుకు టీమ్, పెళ్లికూతురు టీమ్‌గా విడిపోయి సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడినట్లు సమాచారం. రాత్రి సంగీత్ కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు హల్దీ, మెహెందీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగే ఈ వేడుకలు ఎంతో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. పెళ్లి పూర్తిగా ప్రైవేట్‌గా జరగనుండటంతో ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Related Articles

Related image1
RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Related image2
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
35
వెడ్డింగ్‌కు ప్రత్యేక భద్రత
Image Credit : rashmika_keralafc instagram

వెడ్డింగ్‌కు ప్రత్యేక భద్రత

వివాహ వేడుక ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ గ్రూప్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ హోటల్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులను మాత్రమే ఆహ్వానించారు. సుమారు 100 మంది అతిథులు మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మూడు స్థాయిల భద్రత ఏర్పాటు చేసినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక భద్రతా సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ బృందాలు కలిసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాయి.

45
ప్రధాని మోదీ శుభాకాంక్షలు
Image Credit : Asianet News

ప్రధాని మోదీ శుభాకాంక్షలు

కాబోయే వధూవరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ ఆహ్వానం అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంటూ ఒక అభినందన లేఖ పంపారు. విజయ్, రష్మిక జీవితంలో ఈ వివాహం ఒక అందమైన కొత్త దశకు నాంది అవుతుందని ఆయన పేర్కొన్నారు. సప్తపది ద్వారా జీవితాంతం స్నేహితులు, భాగస్వాములుగా కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పరస్పర గౌరవం, ప్రేమతో జీవితం సంతోషంగా సాగాలని ఆశీస్సులు అందించారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

55
హైదరాబాద్‌లో రిసెప్షన్
Image Credit : Instagram

హైదరాబాద్‌లో రిసెప్షన్

ఈ వివాహానికి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరవుతున్నారు. అంబానీ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నట్లు సమాచారం. అభిమానుల కోరిక మేరకు ఈ పెళ్లి వేడుకకు "విరోష్" అనే పేరు పెట్టినట్లు తెలిసింది. వివాహం అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: రష్మిక పాత ప్రియుడి గురించి అడిగితే విజయ్ దేవరకొండ ఏం చేశాడో తెలుసా?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతితో మీనా ఛాలెంజ్, సంజూని వణికించిన పూలగంప
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 25: సాగర్ జాబ్ గురించి ఆధారాలతో సహా పట్టేసిన వల్లి, ఇక నర్మదకు ఇత్తడే
Related Stories
Recommended image1
RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Recommended image2
వెంక‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. ముంద‌స్తు బుకింగ్ లేకుండానే ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌నం, నేరుగా టికెట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved