MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu Today Episode Feb 25: సాగర్ జాబ్ గురించి ఆధారాలతో సహా పట్టేసిన వల్లి, ఇక నర్మదకు ఇత్తడే

Illu Illalu Pillalu Today Episode Feb 25: సాగర్ జాబ్ గురించి ఆధారాలతో సహా పట్టేసిన వల్లి, ఇక నర్మదకు ఇత్తడే

Illu Illalu Pillalu Today Episode Feb 25: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి, ఇడ్లీ బాబాయి, భాగ్యం మారువేషాలు వేసుకొని ఉద్యోగాలు ఇప్పించే ఏజెంట్ దగ్గరికి వెళ్తారు. సాగర్ జాబ్ గురించి తెలుసుకుంటారు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

4 Min read
Author : Haritha Chappa
Published : Feb 25 2026, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆధారాలతో పట్టేసిన వల్లి
Image Credit : Jio hotstar

ఆధారాలతో పట్టేసిన వల్లి

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి, ఇడ్లీ బాబాయి, భాగ్యం మారువేషాలతో ఉద్యోగాలు ఇప్పించే ఏజెంట్ ను కలుస్తారు. తన తండ్రికి ఏదైనా వాచ్ మెన్ ఉద్యోగం ఇప్పించమని వల్లి అడుగుతుంది. అందుకోసం ఏజెంట్ ఐదు లక్షల రూపాయలు అడుగుతాడు. దానికి భాగ్యం ‘మీరు డబ్బులు తీసుకున్నాక ఉద్యోగం ఇప్పించకపోతే ఏం చేయాలి’ అని అడుగుతుంది. అప్పుడు ఏజెంటు తాను ఉద్యోగాలు ఇప్పించిన వారు ఎంతమంది ఉన్నారో చూడండి అంటూ ఫైలు ఇస్తాడు. ఆ ఫైల్ లో సాగర్ అప్లికేషన్ కూడా ఉంటుంది. దాన్ని వల్లి వీడియో తీసి ప్రూఫ్ గా పెట్టుకుంటుంది. ఇక ఏజెంట్ కు అయిదు లక్షల రూపాయలు ఇస్తానని భాగ్యం చెప్పి అక్కడ నుంచి అందరూ మెల్లగా జారుకుంటారు.

ఇక ఇక్కడి నుంచి సీన్ రామరాజు ఇంటికి మారుతుంది. వేదవతి రామరాజుకి మందులు వేసుకోమని ఇస్తుంది. అదే సమయానికి నర్మద, సాగర్ ఇంటికి వస్తారు. నర్మద వస్తూనే సాగర్ తో నువ్వు ఏం చెప్పుకుంటావో నువ్వే చెప్పుకో అని అంటుంది. అది విన్నవేదవతి ఏం జరిగిందని అడుగుతుంది. సాగర్ మాట్లాడుతూ ‘నాకు జాబ్ వచ్చినందుకు నర్మద వాళ్ళ నాన్నగారు పార్టీ అరేంజ్ చేశారు. అందుకోసం బంధువులు, తెలిసిన వాళ్ళందరినీ పిలిచారు. మన ఫ్యామిలీని కూడా రమ్మని చెప్పారు. ఆయనే స్వయంగా వచ్చి మిమ్మల్ని పిలుస్తానన్నారు కానీ పర్లేదు నేను ఆయన తరపున పిలుస్తానని చెప్పాను’ అని అంటాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నర్మద పనిపట్టేందుకు వల్లి ప్లాన్
Image Credit : Jio hotstar

నర్మద పనిపట్టేందుకు వల్లి ప్లాన్

ఇక్కడి నుంచి సీన్ వల్లి దగ్గరికి మారుతుంది. ఇడ్లీ బాబాయి, వల్లి, భాగ్యం రోడ్డు మీద నడుచుకుంటూ వస్తారు. కోపంతో రగిలిపోతూ ఉంటారు. నర్మద తనను కొట్టిన విషయాన్ని వల్లి గుర్తు చేసుకుంటుంది. ‘ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అన్నట్టుగా ఆ నర్మద కొట్టిన దానికి బదులు తీర్చుకునేందుకు నాకు ఇన్నాళ్ళకి ఒక అవకాశం దొరికింది’ అని అంటుంది వల్లి. తరువాత సీన్ వేదవతి దగ్గరికి మారుతుంది. వేదవతి ‘అది కాదు నర్మద.. మీ నాన్న పార్టీ ఏర్పాటు చేస్తే అది నువ్వు కదా చెప్పాలి. ఏంటి నువ్విలా ఉన్నావు. నువ్వు మౌనంగా ఉండడం చూస్తుంటే ఏదో పెద్ద విషయమే జరిగిందని అనిపిస్తోంది. ఏమైంది’ అని గుచ్చి గుచ్చి అడుగుతుంది వేదవతి. మరోపక్క భాగ్యం నర్మదపై విపరీతమైన కోపంతో మాట్లాడుతూ ఉంటుంది. ‘నా నెరిసిన జుట్టు వయసు లేదు ఆ నర్మదా ఏజ్.. నాపైన ఎగిరెగిరి పడుతుందా? చరిత్రలో పెద్దపెద్ద యుద్ధాలన్నీ అహం దెబ్బ తినడం వల్లే జరిగాయి. ఈ భాగ్యం అహం దెబ్బతింటే ఆ బీభత్సం ఎంత భయంకరంగా ఉంటుందో ఆ పిల్ల కాకికి ఈరోజు తెలిసి వచ్చేలా చేస్తాను’ అంటుంది.

34
అబద్ధాలు చెప్పిన నర్మద
Image Credit : Jio hotstar

అబద్ధాలు చెప్పిన నర్మద

ఈలోపు వేదవతి దగ్గరికి సీన్ మారుతుంది. వేదవతి గుచ్చి గుచ్చి ఏమైందని అడుగుతూనే ఉంటుంది. అప్పుడు నర్మద ‘ఏమీ లేదు అత్తయ్యా.. ఇప్పుడు మనందరం అంత సంతోషంగా లేము. కదా ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అరేంజ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ మా నాన్నేమో అల్లుడుని అందరినీ పరిచయం చేయాలనుకుంటున్నారు. నేను పార్టీ వద్దని చెప్పినా వినట్లేదని కాస్త కోపంగా ఉన్నాను. అంతే’ అని సర్దిచెబుతుంది నర్మద. సాగర్ తండ్రి దగ్గరకు వచ్చి ‘మీరూ అమ్మ కూడా పార్టీకి వస్తే బాగుంటుంది. అందరికీ హ్యాపీగా ఉంటుంది’ అని అంటాడు. దానికి రామరాజు ‘ఎందుకు లేరా? మీరందరూ ఉద్యోగస్తులు. పార్టీకి కూడా పెద్ద పెద్ద గొప్పోళ్ళు, ఉద్యోగాలు చేసేవారు వస్తారు. నాలా రైస్ మిల్లులో మూటలు మోసే వాళ్ళు ఇంటికి వస్తే అది నీకు, మీ వాళ్లకు అవమానంగా ఉంటుంది’ అని అంటాడు రామరాజు.

ఈలోపు వల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ అక్కడికి వస్తారు. వల్లి కోపంతో ఏం గొప్ప ఘనకార్యాలు వెలగబెట్టారని పార్టీలు చేసుకుంటారు అని అంటుంది. భాగ్యం ఆపుతున్నా కూడా వల్లి రెచ్చిపోయి మాట్లాడుతుంది. రామరాజు ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు వల్లిని. భాగ్యం మాట్లాడుతూ ‘ఏం లేదండి అన్నయ్యగారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీల్లో ఫంక్షన్లు చేసుకుంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు కదండీ... ఆ విషయమే మా అమ్మడు చెబుతుందండి’ అని మాట మారుస్తుంది. మళ్లీ భాగ్యమే మాట్లాడుతూ ‘అయినా అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు.. కొడుకుకి ఉద్యోగం వచ్చిన సంగతి అందరికీ చెప్పుకుంటే బాగానే ఉంటుంది కదండీ’ అని మళ్ళీ సాగర్ కే సపోర్ట్ చేస్తుంది. సాగర్ కూడా మీరు తప్పకుండా రావాలని పట్టుబడతాడు. రామరాజు ఏమి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అందరూ వెళ్లిపోయాక హాలులో నర్మద, వేదవతి మిగులుతారు. వేదవతి నర్మద దగ్గరికి వచ్చి ‘మీ మామయ్య గారి మనసులో చాలా బాధ ఉంది. అందుకే ఆయన అలా మాట్లాడారు’ అని అంటుంది. దానికి నర్మద కన్నీరు పెట్టుకుంటుంది.

44
భాగ్యం భారీ ప్లాన్
Image Credit : Jio hotstar

భాగ్యం భారీ ప్లాన్

భాగ్యం, ఇడ్లీ బాబాయి, వల్లి బయట పెరట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. వల్లి సాగర్ డబ్బులు పెట్టి ఉద్యోగం కొన్న విషయం మామయ్య గారికి చెప్పేసి ఆ నర్మదను, సాగర్ ను ఇంట్లో నుంచి గెంటేసేలా చేద్దామనుకుంటే నన్నెందుకు ఆపావు అని అడుగుతుంది. భాగ్యం మాట్లాడుతూ ‘నట్టింట్లో నాలుగు గోడల మధ్య అణబాంబు పేలిస్తే ఏమవుతుంది. సాయంత్రం పార్టీలో అందరి ముందు బద్దలయ్యేలా పేలుద్దాం. అప్పుడు అందరి ముందు నర్మద పరువు తీసేసినట్టు అవుతుంది. నర్మద ఈ జన్మలో కోలుకోదు. మన ముందు తలెత్తదు’ అని ఐడియా ఇస్తుంది భాగ్యం.

ఇక్కడి నుంచి ఎపిసోడ్ ప్రేమ, ధీరజ్ దగ్గరికి మారుతుంది. ప్రేమను తీసుకుని ధీరజ్ కారు షోరూం దగ్గరకి తీసుకొస్తాడు. అక్కడ ఉన్న కార్లు అన్నింటినీ చూస్తూ ఉంటాడు. నువ్వు చేసిన గీత ఉపదేశానికి కారు కొనేందుకు సిద్ధమయ్యానని ప్రేమతో చెబుతాడు. కారు ధర పది లక్షల తెలిసి ప్రేమ షాక్ అవుతుంది. అయినా సరే ధీరజ్ కొనేందుకు సిద్ధపడతాడు.

ఇక్కడ నుంచి సీన్ వేదవతి రామరాజు దగ్గరికి మారుతుంది. వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి సాయంత్రం పార్టీకి వెళ్లేందుకు ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. ‘మీరే చెప్పారు కదా పిల్లల్ని కలగనం కానీ, వారి తలరాతలను కనలేము అని. మనం రైస్ మిల్లు చూడాలని కోరుకున్నాం, కానీ వాడు ఉద్యోగం చేయాలనుకున్నాడు. రెండిట్లో న్యాయం ఉంది కదండీ. ఇప్పుడు మనం వెళ్లకపోతే కొడుకు ఎదగడం ఇష్టం లేని తండ్రి అని అనుకుంటారు కదా అండి ’ అని చెబుతుంది వేదవతి. అయినా మీ కన్నా గొప్పగా కుటుంబాన్ని చూసుకునే తండ్రి ఎవరున్నారు ఈ ఊర్లో.. అంటుంది వేదవతి. ఇలా కనిపించి అలా వచ్చేద్దామండి అని అంటుంది. ‘నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పటికే నా కూతురు చేసిన పనికి ఇంట్లోనే చేతకాని తండ్రిలా బతుకుతున్నాను’ అని బాధపడతాడు రామరాజు. పార్టీకి రాలేనని చెప్పేస్తాడు. పోనీ నన్నైనా వెళ్ళమంటారా అని అడుగుతుంది వేదవతి. వెళ్లేందుకు ఒప్పుకుంటాడు. దాంతో వేదవతి సంతోషిస్తుంది. నేటితో ఈరోజు ఎపిసోడ్ ముక్సిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 23: భాగ్యానికి దొరికిపోయిన నర్మద సాగర్, వల్లికి పండగే పండగ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved