- Home
- Entertainment
- Vijay Movie Update: విజయ్ 'జననాయగన్'లో ముగ్గురు పాన్ ఇండియా డైరెక్టర్స్.. అదిరిపోయే సర్‌ప్రైజ్
Vijay Movie Update: విజయ్ 'జననాయగన్'లో ముగ్గురు పాన్ ఇండియా డైరెక్టర్స్.. అదిరిపోయే సర్‌ప్రైజ్
Vijay Movie Update: విజయ్ చివరి సినిమా 'జననాయగన్'లో చాలా సర్‌ప్రైజ్‌లు యాడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇందులో ముగ్గురు డైరెక్టర్స్ కనిపించబోతున్నారట. ఆ కథేంటో చూద్దాం.

Vijay - jana nayagan
Vijay Movie Update: హీరో విజయ్ 'జననాయగన్' సినిమాకు హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇంకా ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, ప్రియమణి, మమితా బైజు నటిస్తున్నారు. వీరే కాదు ఇందులో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయట.
విజయ్, నెల్సన్
`జన నాయగన్` చిత్రం నటుడు విజయ్ కెరీర్‌లో చివరి చిత్రం. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. ఇందుకోసం 'తమిళగ వెట్రి కళగం' అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ సినిమా అనంతరం పూర్తి స్థాయి రాజకీయాలపై ఆయన ఫోకస్ పెట్టబోతున్నారు.
విజయ్, లోకేష్
`జన నాయగన్` సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది పొంగల్(సంక్రాంతి)కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అట్లీ, లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ కనిపించబోతున్నారట. వీరి పాత్రలు చాలా సర్ ప్రైజింగ్‌గా ఉండబోతున్నాయట.
విజయ్, అట్లీ
విజయ్‌ను అట్లీ, నెల్సన్, లోకేష్ ప్రశ్నించే సన్నివేశం సినిమాలో ఉందట. వీరు ముగ్గురు నటుడు విజయ్‌కు చాలా సన్నిహితులు. విజయ్ కూడా వారిని తన తమ్ముళ్లలా చూసుకుంటాడు. ఈ క్రమంలో ఈ సీన్‌లో కొమియోగా వీరు కనిపిస్తారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది కానీ ఈ వార్త ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తుంది.
read more: 20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ డైరెక్టర్‌తో నాగార్జున సినిమా? ఇద్దరికీ సాహసమే
also read: బాలకృష్ణ చేయాల్సిన ఫస్ట్ 3డీ మూవీ ఏంటో తెలుసా? ఇంతటి భారీ సినిమా ఎలా ఆగిపోయింది?