MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna: బాలకృష్ణ చేయాల్సిన ఫస్ట్ 3డీ మూవీ ఏంటో తెలుసా? ఇంతటి భారీ సినిమా ఎలా ఆగిపోయింది?

Balakrishna: బాలకృష్ణ చేయాల్సిన ఫస్ట్ 3డీ మూవీ ఏంటో తెలుసా? ఇంతటి భారీ సినిమా ఎలా ఆగిపోయింది?

Nandamuri Balakrishna: బాలకృష్ణ ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే ఆయన నలభై ఏళ్ల క్రితమే బాలయ్య 3డీ మూవీ చేయాలనుకున్నారు. మరి ఆ సినిమా ఏంటి? ఎలా ఆగిపోయింది?

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 11 2025, 08:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

బాలకృష్ణ తన ఐదు దశాబ్దాల కెరీర్‌లో 109 సినిమాలు చేశారు. ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ నాలుగు సినిమాలతో విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు డబుల్‌ హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు 3డ్రీ మూవీస్‌ సాధారణంగానే వస్తున్నాయి. కానీ ఏకంగా నలభై ఏళ్ల క్రితమే 3డీ సినిమాకి శ్రీకారం చుట్టారు బాలయ్య. కానీ ఆ మూవీ ఆగిపోయింది. అది ఎలా ఆగిపోయింది? ఇంతకి ఆ సినిమా ఏంటి? అనేది చూస్తే..

25
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

బాలకృష్ణ ప్రారంభంలో చాలా సినిమాలు తండ్రి ఎన్టీఆర్‌తోనే కలిసి నటించారు. అటు సాంఘీకాలు, ఇటు పౌరాణికాలు, జానపదాలు ఇలా ఏవైనా బాలయ్య కేవలం తండ్రి సినిమాల్లోనే మెరిశారు. 12వ మూవీ నుంచి ఆయన సోలో హీరోగా మారారు. 1974లో `తాతమ్మకళ` చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమై, పదేళ్ల తర్వాత `సాహసమే జీవితం` మూవీతో సోలో హీరోగా పరిచయం అయ్యారు. 
 

35
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

అప్పట్లో `మంగమ్మ గారి మనవడు` చిత్రంలో బిగ్‌ బ్రేక్‌ అందుకున్నారు. 1985లో వచ్చిన `బాబాయ్‌ అబ్బాయి` చిత్రం బాలకృష్ణకి 20వ మూవీ కావడం విశేషం. ఈ మూవీని నిర్మించిన సుధాకర్‌రెడ్డి, ఎస్‌ గోపాల్‌ రెడ్డి కలిసి మరో సినిమాని ప్లాన్‌ చేశారు.

దాని పేరే `శపథమ్‌`. దీనికి క్రాంతికుమార్‌ దర్శకుడు. కథతోపాటు టీమ్‌ అంతా రెడీ అయ్యింది. సినిమాని అధికారికంగా ప్రకటించారు. త్వరలో ప్రారంభించాలని కూడా భావించారు. కానీ ఏం జరిగిందో ఏమో సినిమాని ఆదిలోనే ఆపేశారు.
 

45
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

అయితే అప్పట్లో 3డీ సినిమాల ట్రెండ్‌ స్టార్ట్ అయ్యింది. దీంతో ఈ మూవీని కూడా త్రీడీలోనే తెరకెక్కించాలని భావించారు. కానీ అనుకోకుండా ఈ మూవీ ఆగిపోయింది. దానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి వచ్చింది.

కానీ అదే ఏడాది బాలయ్య `భలేతమ్ముడు`, `కత్తుల కొండయ్య`, `పట్టాభిషేకం` వంటి మూవీస్‌ చేసినా పెద్దగా ఆడలేదు. 25వ మూవీ `నిప్పులాంటి మనిషి` ఫర్వాలేదనిపించుకుంది. అలా అప్పట్లో ఏడాది ఏడెనిమిది సినిమాలు చేసి మెప్పించారు బాలకృష్ణ. ఇప్పుడు ఏడాది ఒక్కో సినిమాతోనే వస్తున్నారు. 

55
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

ఇటీవల `డాకు మహారాజ్‌`తో హిట్‌ అందుకున్న బాలయ్య ప్రస్తుతం  `అఖండ2` చిత్రంలో నటిస్తున్నారు. `అఖండ`కిది సీక్వెల్‌. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇది ఈ ఏడాది ఎండింగ్‌లోగానీ, వచ్చే ఏడాదిగానీ ఈ మూవీ విడుదల కాబోతుంది. దీని తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. 

read  more: రంభ ముందు డాన్సర్‌గా పరిచయమై.. ఇప్పుడు పాన్‌ ఇండియా బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా?

also read: ప్రభాస్‌, ప్రశాంత్‌ వర్మ సినిమా టైటిల్‌ ఇదేనా? ప్రభాస్‌ని విలన్‌గా చూపించబోతున్నారా?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అస్సలు ఒప్పుకోలేదు, సినిమాపై అనుమానాలు.. ప్రకాష్ రాజ్ పై వైరల్ కామెంట్స్
Recommended image2
రాఘవేంద్ర రావు నుంచి కోదండరామిరెడ్డి వరకు.. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ట్విస్ట్
Recommended image3
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved