- Home
- Entertainment
- Kingdom: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి రెండు హామీలు.. `కింగ్‌డమ్`తో మనం కొడుతున్నామంటూ కామెంట్
Kingdom: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి రెండు హామీలు.. `కింగ్‌డమ్`తో మనం కొడుతున్నామంటూ కామెంట్
విజయ్ దేవరకొండ తాజాగా `కింగ్‌డమ్` మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులకు రెండు హామీలిచ్చాడు విజయ్.

`కింగ్‌డమ్`తో హిట్ కోసం రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి `గీత గోవిందం` తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. ఆ తర్వాత ఆరేడు సినిమాలు చేసినా ఏది గొప్పగా చెప్పుకునే మూవీ పడలేదు.
`టాక్సీవాలా`, `ఖుషి` చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. కానీ విజయ్‌ని మరో మెట్టు ఎక్కించే చిత్రం రాలేదు. ఈక్రమంలో ఇప్పుడు `కింగ్‌డమ్` మూవీతో వస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ కాగా, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
KNOW
టెన్షన్‌గా ఉందంటూ విజయ్ దేవరకొండ
తాజాగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ్ పోలీస్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చారు.
మరో మూడు రోజుల్లో కలవబోతున్నామని, అయితే సినిమా రిలీజ్ అవుతుందంటే కాస్త టెన్షన్‌గా ఉందని, అదే సమయంలో మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉందన్నారు విజయ్. సినిమా ఔట్‌పుట్ చూసుకున్నామని, కచ్చితంగా కొట్టబోతున్నామనే ఫీలింగ్ కలిగిందన్నారు.
ఫ్యాన్స్ కి విజయ్ రెండు హామీలు
ఇందులో ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడారు విజయ్. `మీరు నాకు దేవుడిచ్చిన వరం. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. అదే ప్రేమ, అదే నమ్మకం నాపై చూపిస్తున్నారు.
ఈ రోజు ఫ్యాన్ మీట్ లో దాదాపు రెండు వేల మందిని కలిశాను. అందులో ఎక్కువమంది నాతో చెప్పిన మాట 'అన్నా ఈసారి మనం హిట్ కొడుతున్నాం'. నన్ను మీ వాడిని చేసేసుకున్నారు.
నా విజయాన్ని చూడాలని మీరు కోరుకుంటున్నాను. సినిమా వల్లే మీకు నేను పరిచయం అయ్యాను. మీ కోసం ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాను. మీరు గర్వపడే సినిమా చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా.
అదే సమయంలో మీరు నా కోసం ఏమేమో చేస్తున్నారు. మీకు నేను ఏదైనా చేయాలనుకుంటున్నారు. మీరందరు సంతోషపడేలా, పాజిటివ్‌గా ఫీలయ్యేలా, మిమ్మల్ని సెటిల్ చేసేలా ఏదైనా చేసే వెళ్తాను. ఈరెండు కచ్చితంగా చేసి తీరుతా` అని తెలిపారు విజయ్.
కింగ్‌డమ్ సక్సెస్ క్రెడిట్ వాళ్లకే
ఈ సందర్భంగా `కింగ్‌డమ్` మూవీ గురించి చెబుతూ, ఇది నా కింగ్‌డమ్ కాదు అని, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కింగ్‌డమ్ అని, ఈ కథ ఆలోచన పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా పని మీదే ఉన్నాడు గౌతమ్.
ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పటికీ వర్క్ చేస్తున్నాడు. అందుకే ఈ వేడుకకి రాలేకపోయాడు. ఆ తర్వాత ఇది అనిరుధ్ రవిచందర్ ‘కింగ్‌డమ్’. పాటలు ఇప్పటికే విన్నాము.
నేపథ్యం సంగీతం కూడా అదిరిపోతుంది. నా సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తే బాగుంటుంది అనుకునేవాడిని. అది ‘కింగ్‌డమ్’తో నెరవేరింది. తన సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాడు.
ఆ తర్వాత ఇది ఎడిటర్ నవీన్ నూలి ‘కింగ్‌డమ్’. నాలో ఒక ఫైర్ ఉంటుంది. మా వాళ్లకి బెస్ట్ ఇవ్వాలని కోరిక ఉంటుంది. ఈసారి నాకు ఇంత ఫైర్ ఉన్న టీమ్ దొరికింది.
అలాగే ఇది నాగవంశీ ‘కింగ్‌డమ్’. ఎంతో రిస్క్ చేసి ఈ సినిమా చేశారు. బెస్ట్ అవుట్ పుట్ రావడం కోసం.. ఎక్కడా రాజీ పడకుండా మేము ఏది అడిగితే అది ఇచ్చారు.
కింగ్‌డమ్ టీమ్ గురించి విజయ్ కామెంట్
భాగ్యశ్రీ బోర్సే కొత్తమ్మాయి. కానీ, సినిమా కోసం చాలా కష్టపడుతుంది. రాబోయే రోజుల్లో పెద్ద స్థాయికి వెళ్తుంది. నా సోదరులు సత్యదేవ్, వెంకటేష్ ఇద్దరూ చాలా మంచి నటులు. ఈ సినిమాలో అన్న పాత్ర చాలా ముఖ్యమైనది.
ఆ పాత్రలో సరైన నటుడు చేస్తేనే సినిమా పండుతుంది. అలాంటి పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని చాలా చర్చించిన తర్వాత.. సత్యదేవ్ ని ఎంపిక చేశాడు గౌతమ్. షూటింగ్ సమయంలో సత్యదేవ్ నిజంగానే నాకు సోదరుడిలా అనిపించాడు.
సత్యదేవ్ అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. అలాగే వెంకటేష్ అద్భుతంగా నటించాడు. భవిష్యత్ లో బిగ్ స్టార్ కావాలని కోరుకుంటున్నాను.
కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, సినిమాటోగ్రాఫర్స్ జోమోన్, గిరీష్.. ఇలా ప్రతి ఒక్కరూ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. రెండు రోజుల్లో ‘కింగ్‌డమ్’ మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను` అని తెలిపారు విజయ్ దేవరకొండ.