- Home
- Entertainment
- 35 ఇయర్స్ బ్యాక్ వెళ్లిన పవన్ కళ్యాణ్.. కరాటే స్కూల్ సీనియర్‌తో ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్
35 ఇయర్స్ బ్యాక్ వెళ్లిన పవన్ కళ్యాణ్.. కరాటే స్కూల్ సీనియర్‌తో ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్
పవన్ కళ్యాణ్ హీరో కాకముందే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. అప్పటి తన స్కూల్ సీనియర్‌ని తాజాగా కలుసుకుని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.

మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. కరాటేతోపాటు పలు ఇతర మార్షల్ ఆర్ట్స్ విద్యలను నేర్చుకున్నారు.
ప్రారంభంలో తన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభని సినిమాల్లో ప్రదర్శించారు పవన్. `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`లో ఆయన తన మార్షల్ ఆర్ట్స్ విద్యలను ప్రదర్శించారు.
అలాగే `తమ్ముడు`, `బద్రి`, `ఖుషి`, `జల్సా` ఇలా ప్రతి సినిమాలో ఏదో ఒక మార్షల్ ఆర్ట్స్ విద్యని ఫైట్స్ లో మేళవించారు. తన ప్రత్యేకతని చాటుకున్నారు పవన్.
షిహాన్ హుస్సైని సారథ్యంలో శిక్షణ తీసుకున్న పవన్
పవన్ కళ్యాణ్ చెన్నైలోని షిహాన్ హుస్సేని అవర్ సారథ్యంలోని కరాటే స్కూల్‌లో శిక్షణ తీసుకున్నారు. తన గురువు ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఆ స్కూల్ బాధ్యతను ఇప్పుడు పవన్ సీనియర్ అయిన రెన్షి రాజా అవర్ నిర్వహస్తున్నారు. ఈ క్రమంలో చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరు కలుసుకున్నారు. మళ్లీ కరాటే మెలుకువలను పొందారు పవన్ కళ్యాణ్.
ఈ సందర్భంగా ఆయా ఫోటోలను పంచుకున్నారు. రెన్షి రాజా అవర్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టారు పవన్.
పాత జ్ఞాపకాలను తిరిగిపొందాంః పవన్
ఇందులో పవన్ కళ్యాణ్ చెబుతూ, `34ఏళ్ల తర్వాత తమిళనాడుకి చెందిన తిరు రెన్షి రాజా అవర్‌ని కలుసుకోవడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది. 1990 ప్రారంభంలో ఆయన నాకు సీనియర్.
షిహాన్ హుస్సేని అవర్ సారథ్యంలో ఆయన కూడా శిక్షణ పొందారు. ఆయన అప్పటికే బ్లాక్ బెల్ట్ పొందారు. నేను ఇంకా గ్రీన్ బెల్ట్ లోనే ఉన్నాను. మేం శిక్షణ పొందిన కరాటే పాఠశాలకు ఇప్పుడు ఆయన నాయకత్వం వహిస్తున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది.
షిహాన్ దార్శనికతను అంకిత భావంతో ముందుకు తీసుకెళ్తున్నారు. షిహాన్ హుస్సేనితో మా దీర్ఘకాల అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం, మార్షల్ ఆర్ట్స్ పట్ల మాకున్న ఉమ్మడి అభిరుచిని చర్చించడం వల్ల అనేక పాత జ్ఞాపకాలను తిరిగి పొందాం` అని తెలిపారు పవన్ కళ్యాణ్.
సీనియర్‌తో కరాటే ప్రాక్టీస్ ఫోటోలు పంచుకున్న పవన్
ఇందులో రెన్షిరాజాతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఇందులో ఆయన సారథ్యంలో పవన్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నారు. పాత మెలుకువలను తిరిగిపొందారు.
ఆయనతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న పిక్స్ ని కూడా పంచుకోవడం విశేషం. కరాటే డ్రెస్‌లో పవన్ కళ్యాణ్ ఆకట్టుకుంటున్నారు. తాజాగా పవన్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
`హరి హర వీరమల్లు`తో సందడి చేస్తోన్న పవన్
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన `హరి హర వీరమల్లు` సినిమా కోసం తన మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన ఆయన మళ్లీ ప్రాక్టీస్ చేశారు. అందుకు రెన్షి రాజాని పిలిపించుకున్నట్టు తెలుస్తోంది.
అదే సమయంలో `ఓజీ` సినిమా తన మార్షల్ ఆర్ట్స్ విద్యలను ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఇక పవన్ నటించిన `హరి హర వీరమల్లు` ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోన్న విషయం తెలిసిందే.